Viral Video: పామే కదా అని ఆడిద్దామనుకున్నాడు..ఒళ్ళుమండిన పాము ఏం చేసిందో చూశారంటే పొట్టచెక్కలవడం ఖాయం!

సరదాకి ఓ హద్దు ఉంటుంది. అది మనిషికీ..మనిషికీ మధ్య అయినా.. మనిషికీ జంతువుకూ మధ్య అయినా. ఏమిటి ఇదేం లెక్క అనుకుంటున్నారా?

Viral Video: పామే కదా అని ఆడిద్దామనుకున్నాడు..ఒళ్ళుమండిన పాము ఏం చేసిందో చూశారంటే పొట్టచెక్కలవడం ఖాయం!
Viral Video
Follow us
KVD Varma

|

Updated on: Aug 02, 2021 | 8:28 PM

Viral Video: సరదాకి ఓ హద్దు ఉంటుంది. అది మనిషికీ..మనిషికీ మధ్య అయినా.. మనిషికీ జంతువుకూ మధ్య అయినా. ఏమిటి ఇదేం లెక్క అనుకుంటున్నారా? అవును మరి ఒకరిని ఒకరు టీజ్ చేసుకోవడంలో హద్దులు దాటితే ఇద్దరి మధ్య దెబ్బలాట తప్పదు. అలానే నోరులేనిదే కదా.. ఏం చేస్తుందని ఆడిద్దామని అనుకుంటే జంతువైనా ఒళ్ళు మండిందంటే మనపని పడుతుంది. ఇక పాములాంటి విషసర్పం అయితే ఏం చేస్తుంది.. ఇదిగో ఈ వీడియోలో కనిపించినట్టు చేస్తుంది.

సాధారణంగా పాములంటే అందరూ భయపడతారు. పామును చూస్తే కొందరికి కాళ్ళూ చేతులూ ఆడవు. కొందరికి ఓ చెత్త అలవాటు ఉంటుంది జంతువు ఏది కనబడినా దానితో ఇష్టం వచ్చినట్టు ఆదుకోవడం. పామంటే భయం ఉన్నా.. దానిని కాసేపు ఆడించి చంపేసే విధంగా వారి చేష్టలు ఉంటాయి. ఒక్కోసారి అది వికటిస్తుంది. అప్పుడుంటుంది ఈ ఆటల సరదా.. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అయిన ఓ వీడియో చూస్తే మీకు నవ్వాగదు. పామును ఆటపట్టించాలని చూసిన వాడికి చివరికి పట్టిన గతికి మీ పొట్టచెక్కలవ్వటం ఖాయం.

ఓ లుంగీ ధరించిన వ్యక్తి పామును పట్టుకోవడానికి ప్రయత్నించినట్లు వీడియోలో చూడవచ్చు. అతను పదేపదే పాము పండగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వీడియోలో. చాలాసేపు పాము అటూ ఇటూ ఆడింది. ఇక దాని సహనం చచ్చిపోయింది. తరువాత.. ఆ పాముకి కోపం వచ్చింది. దీంతో ఆ వ్యక్తి పైకి దూకి.. అతని లుంగీని పట్టుకుంది.   అప్పుడు చూడాలి మనోడి కథ.. లుంగీ దులిపి పామును వదిలిద్దామను కున్నాడు. అబ్బే లుంగీ పట్టుకున్నది అసలే ఒళ్ళు మండిన పాము.. అంత తేలికగా వదులుతుందా? వదల్లేదు. చివరికి ఏమి చేయాలో అర్ధం కాక..  తన లుంగీ వదిలేసి పరుగులంకించుకున్నాడు.

కాచింగ్ ప్లస్ అనే ట్విట్టర్ హ్యాండిల్‌తో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియోను మీరూ చూడండి ఇక్కడ..

చూశారుగా.. చూసినతరువాత మీరూ నవ్వు ఆపుకోలేకపోయి ఉంటారు అవునా! అందుకే ఈ వీడియో వైరల్ గా మారింది. ట్విట్టర్ లో ఈ వీడియోను నెటిజనం తెగ చూసేయడమే కాకుండా షేర్లు కూడా చేసేస్తున్నారు.

Also Read: Viral Video: నడిరోడ్డుపై యువతి హాల్‌చల్‌.. వ్యక్తిని ఎగిరెగిరి కొడుతూ రచ్చ.. హ్యష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌!

Viral Video: మనుషుల గ్యాంగ్ వార్ చూశారు.. మరి కోతుల గ్యాంగ్ వార్ చూశారా? అయితే ఇప్పుడు చూసేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!