Viral Video: నడిరోడ్డుపై యువతి హాల్‌చల్‌.. వ్యక్తిని ఎగిరెగిరి కొడుతూ రచ్చ.. హ్యష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Aug 03, 2021 | 7:57 AM

సోషల్ మీడియా ఎన్నో రకాల వైరల్ వీడియోలకు నిలయం.. రొమాంటిక్, షాకింగ్, పగ, ప్రతీకారం.. కంటెంట్ ఏదైనా కూడా సామాజిక మాధ్యమాల్లో...

Viral Video: నడిరోడ్డుపై యువతి హాల్‌చల్‌.. వ్యక్తిని ఎగిరెగిరి కొడుతూ రచ్చ.. హ్యష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌!
Lucknow Girl

Follow us on

సోషల్ మీడియా ఎన్నో రకాల వైరల్ వీడియోలకు నిలయం.. రొమాంటిక్, షాకింగ్, పగ, ప్రతీకారం.. కంటెంట్ ఏదైనా కూడా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంటాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి నడిరోడ్డుపై చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. #ArrestLucknowGirl అంటూ నెటిజన్లు హ్యష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఈ ఘటన ఏ తేదీన జరిగిందో తెలియదు గానీ.. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిటీలోని అవధ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ యువతి నడిరోడ్డుపై ఓ వ్యక్తిని చితక బాదుతున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఆ యువతి కొడుతున్న వ్యక్తి క్యాబ్ డ్రైవర్ అని తెలుస్తోంది. అతడ్ని చెంప దెబ్బలు కొడుతుంటే.. ట్రాఫిక్ కానిస్టేబుల్, మిగతా జనాలు చూస్తూ ఉండిపోయారు. ఎగిరెగిరి మరీ చెంపదెబ్బలు కొడుతూ ఆ వ్యక్తి ఫోన్‌ను పగలగొట్టింది. ఆమెను ఆపేందుకు వచ్చిన వ్యక్తిని సైతం కొట్టింది. ఆ యువతి చేసిన రచ్చకు అక్కడంతా ట్రాఫిక్ జామ్ అయింది. తనను ఆ కారు ఢీకొట్టిందని.. అందుకే ఈ పని చేస్తున్నానని అడ్డుగా వచ్చిన అతడిని కాలర్ పట్టుకుని మరీ బాదేసింది. అక్కడున్న వారంతా ఆమె ‘badtameez’ అంటూ అరుస్తున్నా.. ఏదీ పట్టుకోకుండా కొడుతూనే ఉంది.

కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిని ‘Megh Updates’ అనే ఖాతా ట్విట్టర్‌లో అప్‌లోడ్‌ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై లక్నో పోలీసులు సదరు యువతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాగే ఆ యువతిని విమర్శిస్తూ నెటిజన్లు ట్విట్టర్‌లో #ArrestLucknowGirl అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా 22 వేలకు పైగా ట్వీట్స్ చేశారు.

అసలేం జరిగింది..

సిగ్నల్ పడినా కూడా ఆమె క్రాస్ చేస్తున్నట్లుగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆమె రావడాన్ని చూసిన క్యాబ్ డ్రైవర్ సడన్ బ్రేక్ ఇచ్చి ఆపాడు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ వీడియోను మీరు కూడా చూడండి..

ఆ వైరల్ వీడియోస్ ఇవే…


లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu