AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: బ్యాటింగ్ ప్యాడ్లను ఇలా కూడా వాడతారా..! వైరలవుతోన్న టీమిండియా స్పీడ్‌స్టర్ ఫొటో

మరో రెండు రోజుల్లో క్రికెట్ ప్రేమికులకు పండుగ మొదలకాబోతోంది. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 4 నుంచి మొదలు కాబోతుంది. ఈమేరకు ఇప్పటికే నాటింగ్‌హామ్ చేరుకున్న టీమిండియా.. ప్రాక్టీస్‌లో మునిగిపోయింది.

Viral Photo: బ్యాటింగ్ ప్యాడ్లను ఇలా కూడా వాడతారా..! వైరలవుతోన్న టీమిండియా స్పీడ్‌స్టర్ ఫొటో
Ind Vs Eng Jasprit Bumrah
Venkata Chari
|

Updated on: Aug 02, 2021 | 12:17 PM

Share

Ind vs Eng 1st Test: మరో రెండు రోజుల్లో క్రికెట్ ప్రేమికులకు పండుగ మొదలకాబోతోంది. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 4 నుంచి మొదలు కాబోతుంది. ఈమేరకు ఇప్పటికే నాటింగ్‌హామ్ చేరుకున్న టీమిండియా.. ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 3.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈమేరకు బీసీసీఐ ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. అందులో టీమిండియా స్పీడ్ స్టర్ బుమ్రా ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ధరించే ప్యాడ్స్‌ను కాళ్లకు కట్టుకుని మరీ బౌలింగ్ చేశాడు. దీంతో ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఈమేరకు ఆ ఫొటోకు టీమిండియా నెట్ ప్రాక్టీస్‌లో బిజీగా ఉందని, ఈ పిక్ చూస్తే అర్థమౌతోందని రాసుకొచ్చింది. దీంతో అభిమానులకు కూడా చాలా ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. నోబాల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడంటూ కొంతమంది కామెంట్ చేయగా, బౌలింగ్ చేసేప్పుడు కాళ్లకు దెబ్బలు తగలకుండా ముందు జాగ్రత్త అంటూ మరికొందరు కామెంట్ చేశారు. అసలు బౌలింగ్ చేసేప్పుడు కాళ్లకు ప్యాడ్‌లు ఎందుకు బుమ్రా అంటూ మరికొంతమంది.. ఇది బౌలింగ్ చరిత్రలో కొత్తగా ఉందంటూ ఇంకొంతమంది కామెంట్ చేశారు. ఇలా కాళ్లకు ప్యాడ్స్ కట్టుకుని బౌలింగ్ చేస్తే ఎక్కువ నోబాల్స్ వేసే అవకాశం ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి బుమ్రా సీరియస్ ప్రాక్టీస్‌ని కూడా నెటిజన్లు చాలా ఫన్నీగా తీసుకుంటూ వైరల్ చేస్తున్నారు.

బుమ్రా.. ఇంగ్లండ్‌పై 100 వికెట్ల మార్క్ చేరుకోవడానికి ఇంకో 17 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఈ రికార్డును చేరుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే అతి తక్కువ ఇన్నింగుల్లో ఇంగ్లీష్ జట్టుపై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు. ఇంతకు ముందు 25 టెస్ట్ మ్యాచుల్లో ఇంగ్లండ్‌పై వంద వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా కపిల్ దేవ్ పేరిట ఉంది. టీమిండియా మరో బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 100 వికెట్లకు ఇంకో 12 వికెట్ల దూరంలో నిలిచాడు.

Also Read: జాతీయ జట్టులో చోటు దక్కలేదు.. అయినా రికార్డులకు దడ పుట్టించాడు.. ఈ భారత క్రికెటర్ ఎవరంటే.!

పాకిస్తాన్ పాలిట యముడిలా మారిన టీమిండియా బౌలర్.. ఆసియా కప్ ఫైనల్లో చిరస్మరణీయ ప్రదర్శన.. ఆ హైదరాబాదీ ఎవరో తెలుసా?