ఒక్క పరుగుకే ఐదు వికెట్లు.. ప్రత్యర్ధులను బెంబేలెత్తించిన దిగ్గజ బౌలర్.. ఆ ప్లేయర్ ఎవరంటే.?

టెస్ట్ మ్యాచ్‌ల్లో లక్ష్య చేధనలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్నిసార్లు భారీ స్కోర్లను సైతం చేధిస్తే.. మరికొన్నిసార్లు తక్కువ స్కోర్లను...

ఒక్క పరుగుకే ఐదు వికెట్లు.. ప్రత్యర్ధులను బెంబేలెత్తించిన దిగ్గజ బౌలర్.. ఆ ప్లేయర్ ఎవరంటే.?
Ian Botham
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 02, 2021 | 1:29 PM

టెస్ట్ మ్యాచ్‌ల్లో లక్ష్య చేధనలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్నిసార్లు భారీ స్కోర్లను సైతం చేధిస్తే.. మరికొన్నిసార్లు తక్కువ స్కోర్లను సైతం చేధించడంలో చతికిలపడుతుంటాయి. అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సాధారణంగా నాలుగో ఇన్నింగ్స్‌లో 151 పరుగుల టార్గెట్‌ను చేధించడం పెద్ద కష్టమేమి కాదు. సునాయాసంగా గెలుపొందొచ్చు. అయితే ఓ బౌలర్ కారణంగా మొత్తం మ్యాచ్ రివర్స్ అయింది. విజయం వరిస్తుందనుకున్న జట్టుకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ మ్యాచ్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జూలై 30 నుంచి ఆగష్టు 2 వరకు 1981వ సంవత్సరంలో జరిగింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 189 పరుగులు చేసింది. కెప్టెన్ మైక్ బ్రెర్లీ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో టెర్రీ ఆల్డెర్మాన్ ఐదు వికెట్లు తీయగా, డెన్నిస్ లిల్లీ, రే బ్రైట్ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక ఆస్ట్రేలియా మొదటి ఇన్నింట్స్‌లో 258 పరుగులకు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జాన్ ఎంబ్రీ నాలుగు వికెట్లు, క్రిస్ ఓల్డ్ మూడు వికెట్లు, ఇయాన్ బోథమ్ ఒక వికెట్ తీశారు.

బోథమ్ 14 ఓవర్లలో 11 పరుగులిచ్చి ఐదు వికెట్లు..

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. 219 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో ఆస్ట్రేలియా ముందు 151 పరుగుల టార్గెట్ విధించింది. ఇక లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా 114 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా పతనాన్ని ఇంగ్లాండ్ బౌలర్ ఇయాన్ బోథమ్ శాసించాడు. కేవలం ఒక పరుగుకే ఐదుగురు ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. దీనితో, ఆస్ట్రేలియా జట్టు మొత్తం 121 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. బోథమ్ మొత్తం 14 ఓవర్లలో 11 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.