IND vs ENG: నాటింగ్‌హామ్ చేరుకున్న టీమిండియా.. రెండు రోజుల్లో తొలి టెస్టు.. జట్టులో మూడు మార్పులు
టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్ ముగిసింది. ఇక ఆగస్టు 4 నుంచి సుదీర్ఘమైన టెస్టు సిరీస్ బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్..
IND vs ENG: టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్ ముగిసింది. ఇక ఆగస్టు 4 నుంచి సుదీర్ఘమైన టెస్టు సిరీస్ బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 14వరకు సాగనుంది. కాగా, ఈ పర్యటనలో భాగంగా కొద్ది రోజుల క్రితం డర్హామ్‌లో వార్మప్ మ్యాచ్ ఆడిన భారత ఆటగాళ్లు.. తాజాగా నాటింగ్‌హామ్‌కి చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తొలి టెస్టు ఇక్కడే జరగనుంది. అయితే, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కోసం జట్టును ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ గాయపడడంతో.. వీరి స్థానంలో పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లు ఎంపికయ్యారు.
శ్రీలంక నుంచి పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్‌కి వెళ్లారు. అయితే ప్రస్తుతం వీరు క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ కారణంతో వారు తొలి టెస్టుకి అందుబాటులో ఉండరని బీసీసీఐ పేర్కొంది. కాగా, శుభమన్ గిల్, వాషింగ్టన్ సుందర్, అవేష్ ఖాన్‌లు ఇప్పటికే ఇండియా చేరుకున్నారు. ఇక ఇప్పటికే స్టాండ్ బై ఓపెనర్‌గా ఇంగ్లండ్ టూర్‌కి వెళ్లిన అభిమన్యు ఈశ్వరన్‌ని జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), చతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, సాహా (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్
Also Read: Viral Photo: బ్యాటింగ్ ప్యాడ్లను ఇలా కూడా వాడతారా..! వైరలవుతోన్న టీమిండియా స్పీడ్‌స్టర్ ఫొటో
జాతీయ జట్టులో చోటు దక్కలేదు.. అయినా రికార్డులకు దడ పుట్టించాడు.. ఈ భారత క్రికెటర్ ఎవరంటే.!