AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా కింగ్ నాగార్జున.. శరవేగంగా జరుగుతున్న షూటింగ్..

కుర్రహీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్న సీనియర్ హీరోల్లో కింగ్ నాగార్జున ఒకరు. సినిమాలతో, టీవీ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు నాగ్...

Nagarjuna: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా కింగ్ నాగార్జున.. శరవేగంగా జరుగుతున్న షూటింగ్..
Nagarjuna
Rajeev Rayala
| Edited By: |

Updated on: Aug 03, 2021 | 8:37 AM

Share

Nagarjuna: కుర్రహీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్న సీనియర్ హీరోల్లో కింగ్ నాగార్జున ఒకరు. సినిమాలతో, టీవీ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు నాగ్. ఇటీవల్ వైల్డ్ డాగ్ సినిమాతో అలరించి నాగార్జున ఇప్పుడు మరో సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. గరుడ వేగ సినిమాతో మంచి విజయాన్నిఅందుకున్న ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. నాగ్ – కాజల్ కాంబోలో వస్తున్న ఫస్ట్ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను గోవాలో పూర్తి చేశారు చిత్రయూనిట్. త్వరలోనే రెండో షెడ్యూల్ ను మొదలు పెట్టనున్నారు. హైదరాబాద్ లో ఆగస్టు 4 నుంచి ఈ షడ్యూల్  ప్రారంభించనున్నారని తెలుస్తోంది. నాగార్జున ఈ సినిమాలోలో ఎంటర్టైనింగ్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది.అలాగే కాజల్ కూడా మునుపెన్నడూ చేయని వైవిధ్యమైన పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో గుల్ పనాంగ్ – అనైకా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాతోపాటు ఎప్పటినుంచో వెయిట్ చేస్తోన్న బంగార్రాజు సినిమను కూడా మొదలుపెట్టనున్నారు నాగార్జున. ఆగస్టు 20న హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్నారు. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించడానికి సిద్ధం అవుతున్నారు నాగ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rakshasudu 2: ఈసారి లండన్‌లో రాక్షసుడి ఆకృత్యాలు.. సీక్వెల్‌ సినిమాకు ఎంత ఖర్చు చేయనున్నారో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

Rashi Khanna: జోరు మీదున్న అందాల రాశి.. ఒకేసారి మూడు భాషల చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీ..

సాక్ష్యాధారాలు నాశనం చేస్తుంటే మౌనంగా ఉండలేం.. రాజ్ కుంద్రా కేసులో ముంబై పోలీసుల వాదన

Follow Us
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!