Karthika Deepam: మీ అమ్మనూ చంపేస్తాను..నిస్సిగ్గుగా నిజాలు కక్కిన మోనిత..నిజాలు విని కార్తీక్ షాక్..!

కుటుంబ బంధాల మాధుర్యం.. వైవాహిక జీవితంలో అనుమాన భూతం తెచ్చే అనర్ధం.. ప్రేమ వికృత రూపం దాలిస్తే వచ్చే ఉపద్రవం.. అన్నిటినీ కలబోసి ధారావాహికగా ప్రతిరోజూ ఇంటిల్లపాదినీ అలరిస్తున్న సీరియల్ కార్తీకదీపం.

Karthika Deepam: మీ అమ్మనూ చంపేస్తాను..నిస్సిగ్గుగా నిజాలు కక్కిన మోనిత..నిజాలు విని కార్తీక్ షాక్..!
Karthika Deepam Episode 1113
Follow us

|

Updated on: Aug 09, 2021 | 8:04 AM

Karthika Deepam: కుటుంబ బంధాల మాధుర్యం.. వైవాహిక జీవితంలో అనుమాన భూతం తెచ్చే అనర్ధం.. ప్రేమ వికృత రూపం దాలిస్తే వచ్చే ఉపద్రవం.. అన్నిటినీ కలబోసి ధారావాహికగా ప్రతిరోజూ ఇంటిల్లపాదినీ అలరిస్తున్న సీరియల్ కార్తీకదీపం. తెలుగు ప్రేక్షకులకు నిత్యం వినోదాన్ని అందిస్తూ వస్తోంది కార్తీకదీపం. ఇప్పటివరకూ ఎన్నో మలుపులు తిరుగుతూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకూ 1112 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు 1113వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. ప్రతి రోజు.. ప్రతి ఎపిసోడ్ అక్షరరూపంలో మీకోసం అందిస్తున్నాం. ఈరోజు (ఎపిసోడ్ 1113)లో ఏం జరగబోతోందో తెలుసుకోబోయే ముందు గతంలో ఏం జరిగిందో చూద్దాం..

మోనిత నిజస్వరూపం తెలుసుకున్న కార్తీక్ 

కార్తీక్ ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే పిచ్చి ప్రయత్నాల్లో ఉంటుంది డాక్టర్ మోనిత. తన కాపురాన్ని నిలబెట్టుకోవాలనీ, కార్తీక్ ను మోనిత బారినుంచి రక్షించాలనీ ప్రయత్నిస్తుంది దీప. ఈ క్రమంలో కార్తీక్ ప్రియురాలు హిమను అంజి అనే రౌడీ ద్వారా చంపించిన విషయం తెలిసిన దీప అంజి కోసం వెతుకులాట ప్రయత్నిస్తుంది. కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో మోనిత తానూ గర్భవతిని అని నాటకం ఆడటమే కాకుండా తన పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టేసుకుంటుంది. కార్తీక్ పెళ్లి చేసుకోను అని అనడంతో ఏసీపీ రోషిణిని ఆశ్రయిస్తుంది మోనిత. రోషిణి ఈ కేసు దర్యాప్తులో భాగంగా దీపతో మాట్లాడినపుడు కొంతవరకూ మోనిత గురించి అర్ధం చేసుకుంటుంది.

ఈలోపు దీపకు అంజి ఎక్కడ ఉన్నాడనే సమాచారం రోషిణి చెబుతుంది. అదే సమయంలో మోనితకు కూడా అంజి ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. అంజి ఉన్న ప్రాంతానికి చేరుకున్న మోనిత ముందు అంజిని బ్రతిమిలాడుతుంది. తరువాత తుపాకీతో బెదిరించి తాను చేసిన పాపాల్ని స్వయంగా చెబుతుంది. ఇదంతా చాటుగా ఉంది దీప వీడియో తీస్తుంది. ఆ తర్వాత మోనిత అంజిని కట్టేసి ఒకచోట పెడుతుంది. ఇక తన పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తోందని దీప పిన్ని భాగ్యాన్ని తన ఇంట్లోనే ఒక గదిలో కట్టిపారేస్తుంది. మరోవైపు అంజి మోనిత చెర నుంచి తప్పించుకుంటాడు. దీప కార్తీక్ కి మోనిత గురించి చెబుతుంది. కానీ, నమ్మడు. దీంతో దీప మోనిత వీడియోను కార్తీక్ కు చూపిస్తుంది. అది చూసిన కార్తీక్ ఆవేశంగా మోనిత దగ్గరకు బయలు దేరుతాడు. ఇదీ ఇప్పటివరకూ జరిగిన కథ.. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

వెన్నుపోటు పొడిచావు కదే..

మోనిత నిజస్వరూపం తెలిసిన కార్తీక్ ఆమె దగ్గరకు వచ్చాడు. మోనితను నిలదీశాడు. అసలు నువ్వు ఆడదానివేనా అని ప్రశ్నించాడు. నన్ను ప్రేమించిన పాపానికి.. నేను ప్రేమించిన పాపానికి అమాయకురాలైన హిమను చంపేస్తావా? అని ప్రశ్నించాడు కార్తీక్. దీంతో కార్తీక్ కు విషయం తెలిసిపోయిందని మోనిత ముందు షాక్ అవుతుంది. కానీ, వెంటనే తేరుకుంటుంది. ”ఇలా వచ్చిందా ఆ వంటలక్క. ఆమె చెబితే మాత్రం నువ్వు ఎలా నమ్మావు కార్తీక్. మన పెళ్లి ఆపాలని వంటలక్క చేసిన ఎత్తు ఇదంతా అని చెప్పాలని ప్రయత్నిస్తుంది. అయినా దానికి సాక్ష్యం ఏమిటి?” అని ప్రశ్నిస్తుంది మోనిత. ”సాక్ష్యం ఉంది. అది నువ్వే.” అంటాడు కార్తీక్. మోనిత వీడియోలో మాట్లాడిన మాటలు ఆమెకు చూపిస్తాడు. దీంతో మోనిత మ్రాన్పడిపోతుంది.

”నువ్వు మనిషివేనా? ఇంత అమానుషంగా ఎలా ఒక అమాయకురాల్ని చంపేస్తావు? అక్కడా ఇక్కడా పనులు చేసుకుంటూ.. తన కూతురని డాక్టర్ చేయాలని చూసిన హిమ తల్లి ఆశలన్నిటినీ బూడిద కుప్పగా చేశావ్ కదే. నిన్ను ఏమని పిలవాలి. ఇప్పుడు నీలో నాకు ఒక రాక్షసత్వం కనిపిస్తోంది. ఒక అడివి మృగం కనిపిస్తోంది. నీ అంత పాపత్మురాలు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. నీతో స్నేహం చేసిన పాపానికి హిమను చంపేశావు. నిన్ను నమ్మి.. నా శ్రేయోభిలాషిగా భావించాను. అమ్మ చెప్పినా వినలేదు. కట్టుకున్న భార్య చెబుతున్నా పట్టించుకోలేదు. నువ్వు నాకు మంచి స్నేహితురాలివనుకున్నాను. నన్ను వెన్నుపోటు పొడిచావు కదే..” అంటూ కడిగి పారేస్తాడు కార్తీక్. దీనికి ఏం సమాధానం చెబుతావు? అని ప్రశ్నిస్తాడు. కార్తీక్ మాట్లాడుతున్నంత సేపు మౌనంగా నిలబడి విన్న మోనిత షాక్ నుంచి తేరుకుంటుంది. ఇక తన నిజస్వరూపాన్ని బయటకు తీస్తుంది.

నీ మీద ప్రేమతోనే ఇదంతా..

సమాధానం ఉంది కార్తీక్.. నేను అన్నిటికీ సిద్ధం అయ్యే ఉన్నాను మైడియర్ కార్తీక్.. అంటూ మోనిత మొదలు పెడుతుంది. ”ఇందులో నాకు నీమీద ఉన్న అంతులేని ప్రేమ ఉంది. నిన్ను దక్కించుకోవడం కోసం చేసిన ప్రయత్నం ఉంది. అవును హిమను చంపించడం ఒక్కటే కాదు కార్తీక్.. నిన్ను దక్కించుకోవడం కోసం ఇంకా చాలా చేశాను. దీపను నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అది చెడకొట్టడానికి ప్రయత్నించాను. కుదరలేదు. నువ్వు దీపను పెళ్ళిచేసుకున్నావు. దీంతో నీకు పిల్లలు పుట్టారని డాక్టర్ తో చెప్పించాను. తరువాత దుర్గ సహాయంతో దీపకు యాక్సిడెంట్ చేయించాను. కానీ, దీప బ్రతికింది. దీంతో దీపకు.. విహారికీ మధ్యలో సంబంధం ఉందని నీకు చెప్పాను. ఈ లోపు దీప గర్భవతి అయింది. నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి దీప గర్భవతి కావడంతో అనుమానపడేలా చేశాను.

తరువాత కూడా దీపకు స్లో పాయిజన్ ఇవ్వడానికి ప్రయత్నించాను. కానీ, అదే సమయంలో అంజిగాడు వచ్చి చెడగొట్టాడు. తరువాత నువ్వు..దీప ఎటువంటి పరిస్థితిలోనూ కలవకూడదని ఎంతో ప్రయత్నం చేశాను. కానీ, నువ్వు నిజం తెలుసుకుని దీప కాళ్ళమీద పడ్డావు. అప్పుడు నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా. మనసు కలుక్కు మంది.” అంటూ తను చేసిన అకృత్యాలు అన్నిటినీ వరుసగా ఏకరువు పట్టేస్తుంది మోనిత. ఇవన్నీ విన్న కార్తీక్ కి మతి పోతుంది. తనతో ఉంటూనే తనకి ఇంత ద్రోహం చేసిన మోనితపై మరింత అసహ్యం పెరిగిపోతుంది. కోపంగా అరుస్తాడు. దీంతో.. మోనిత ఇంకో విషయం కార్తీక్.. నువ్వు నీకు పిల్లలు పుడతారో లేదో తెలుసుకోవడం కోసం ఆసుపత్రిలో ఇచ్చిన శాంపిల్స్ ను తీసుకుని అందులోని నీ వీర్యం ద్వారా నేను ఆర్టిఫిషియల్ గా గర్భవతిని అయ్యాను. ఎలాగైతే ఏం..ఇప్పుడు నా కడుపులో బిడ్డకు తండ్రివి నువ్వే కదా కార్తీక్..” అని ఇంకో పెద్ద షాక్ ఇస్తుంది మోనిత. దీంతో కార్తీక్ ఆపవే.. అంటూ అరుస్తాడు. ”కోపం తెచ్చుకోకు కార్తీక్.. ఈ పనులన్నిటిలో నాకు నీమీద ఉన్న ప్రేమ చూడు. అందులోని చెడు చూడకు. కేవలం నీ ప్రేమకోసమే ఇవన్నీ చేశాను అని చెబుతుంది మోనిత.

మీ అమ్మనూ…

”ఏ కోశానా ఆడతనమే లేదే నీకు..దిక్కుమాలిన తనమే నీది. నిన్ను ఇంకా..ఇంకా ఇలా ప్రాణాలతో వదిలేస్తే నువ్వు ఎంతకైనా తెగిస్తావు. అవసరం అయితే నన్ను కూడా చంపేస్తావే.. అమాయకురాలైన హిమను చంపేశావు. దేవతలాంటి దీప మీద పతిత అనే ముద్ర వేసి జీవచ్చవంలా చేశావు. నిన్ను ఎటువంటి పరిస్థితిలోనూ బ్రతకనీయను అంటూ తుపాకీ తీస్తాడు. దీంతో.. మోనిత ” కార్తీక్ నా కార్తీక్ నన్ను చంపేస్తావా? నీకు ఇవన్నీ దారునాలుగా కనిపిస్తున్నాయా? ఇందులో నా ప్రేమ కనిపించడం లేదా. నీ ఎదురుగా నిలుచున్నా నీ ప్రేమమూర్తిని నువ్వే చేతులారా చంపేస్తావా? ఓహ్.. దీప ఏమనుకుంటుందో అని ఆలోచిస్తున్నావా? ఇన్ని చేసిన దానిని దీపను చంపడం ఒక లెక్కా? అవసరం అయితే..మీ అమ్మని కూడా అని చెప్పబోతుంది మోనిత..దీంతో తుపాకీ ఆమెకు దగ్గరగా పెట్టి గట్టిగా అరుస్తాడు కార్తీక్.. ఇదీ ఈరోజు జరిగిన కథ. మరి మోనితను కార్తీక్ ఏం చేశాడు అనేది రేపటి ఎపిసోడ్ (1114) చూడాల్సిందే.

Also Read: మరిన్ని కార్తీకదీపం సీరియల్ కథనాల కోసం ఇక్కడ చూడండి:

Karthika Deepam: కార్తీకదీపం షాకింగ్ ట్విస్ట్..మోనితను చంపేసిన కార్తీక్..!

Karthika Deepam: నిజం తెలుసుకోలేని కార్తీక్..తప్పించుకున్న అంజి..మోనిత ముహూర్తం చుట్టూ కార్తీకదీపం ట్విస్ట్!

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీప చాకచక్యం..డాక్టర్ బాబు బయటపడినట్టేనా?

Karthika Deepam: మోనితకు దొరికిన అంజి..దీపకు షాక్..కార్తీక్ టెన్షన్..

Karthika Deepam: ధర్మం కోసం ఒకరు.. పంతంతో మరొకరు.. ఒకే కారులో ఉప్పూ..నిప్పూ.. కార్తీకదీపంలో యాక్షన్ సెగ!

Karthika Deepam: మోనితను నిలదీసిన ప్రియమణి..దొరికిన ఆచూకీ.. అంజి కోసం బయలుదేరిన దీప!

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!