Karthika Deepam: నిజం తెలుసుకోలేని కార్తీక్..తప్పించుకున్న అంజి..మోనిత ముహూర్తం చుట్టూ కార్తీకదీపం ట్విస్ట్!

కార్తీకదీపం సీరియల్ రసకందాయంలో పడింది. తాను చేసిన పాపాలు ఒక్కోటిగా మోనితను చుట్టుముట్టాయి. తాను కార్తీక్ ను పెళ్లిచేసుకోవాలనే తాపత్రయంతో అంజి ద్వారా హిమను చంపించిన వైనం ఇప్పడు ఆమె మెడకు పాములా చుట్టుకుంది.

Karthika Deepam: నిజం తెలుసుకోలేని కార్తీక్..తప్పించుకున్న అంజి..మోనిత ముహూర్తం చుట్టూ కార్తీకదీపం ట్విస్ట్!
Karthika Deepam Episode 1111
Follow us

|

Updated on: Aug 06, 2021 | 8:29 AM

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ రసకందాయంలో పడింది. తాను చేసిన పాపాలు ఒక్కోటిగా మోనితను చుట్టుముట్టాయి. తాను కార్తీక్ ను పెళ్లిచేసుకోవాలనే తాపత్రయంతో అంజి ద్వారా హిమను చంపించిన వైనం ఇప్పడు ఆమె మెడకు పాములా చుట్టుకుంది. మరి ఇప్పుడు ఏంజరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇంటిల్లపాదినీ ఆకట్టుకుంటూ సాగిపోతున్న కార్తీకదీపం సీరియల్ ట్విస్ట్ లతో మరింత ఉత్సుకతను పెంచుతోంది. మోనిత కార్తీక్ ను పెళ్లి చేసుకోవడానికి పెట్టిన ముహూర్తం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కార్తీక్ ఎలా మోనిత కుట్రల నుంచి బయటపడతాడు అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే 1110 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న కార్తీకదీపం ఈరోజు 1111 వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. మరి ఈరోజు కార్తీకదీపంలో ఏం జరగబోతోందో తెలుసుకుందాం.

నిన్న (ఎపిసోడ్ 1110) ఏం జరిగిందంటే..

మోనిత తనకు అడ్డుగా ఉన్నాడని అంజిని బంధించి తన ఫాంహౌస్ లో ఉంచుతుంది. దీప చాటుగా అంజితో ఆవేశంలో మోనిత మాట్లాడిన మాటలు అన్నీ వీడియో తీస్తుంది. పిన్ని ఇంటికి వెళుతున్నానని వెళ్ళిన దీప అక్కడికి వెళ్లలేదని తెలిసిన కార్తీక్ టెన్షన్ పడతాడు. ఈలోపు దీప ఇంటికి వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళావని కార్తీక్ ఎంత అడిగినా దీప చెప్పదు. మరోవైపు దీప పిన్ని భాగ్యం మోనితను పెళ్లి చేసుకోకుండా ఆపాలనే ప్రయత్నంలో ఆమె ఇంటికి వెళ్లి మోనితను కార్తీక్ చంపాలని అనుకుంటున్నాడని అబద్ధం చెబుతుంది. విషయం గ్రహించిన మోనిత ఒక గదిలోకి భాగ్యంను తీసుకువెళుతుంది. అక్కడ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నాను అని భాగ్యంతో చెబుతుంది. ఇదీ నిన్నటి కథ.. మరి ఈరోజు ఎపిసోడ్ 1111లో ఏం జరగబోతోంది?

మోనిత చెరలో భాగ్యం

భాగ్యాన్ని గదిలో ఉంచి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నాన్ని చెప్పడంతో.. భాగ్యం జాలి పడుతుంది. నిన్ను రక్షిద్దామని నేను వస్తే చచ్చిపోతానని అంటావేమిటి? అని అడుగుతుంది. ఈలోపు మోనిత నేను కార్తీక్ ను పెళ్లి చేసుకుని తీరతాను దానికి అడ్డువచ్చిన వారిని ఎవరినైనా ఏదైనా చేస్తాను అంటూ కర్రతో భాగ్యం తలమీద కొట్టి కుర్చీకి కట్టేస్తుంది. ఆమె నోటికి ప్లాస్టర్ వేసి.. కార్తీక్ తో నా పెళ్లిని నువ్వు కాదుకదా ఎవరూ ఆపలేరు అంటూ చెబుతుంది. తరువాత గదికి తాళం వేసి వెళ్ళిపోతుంది.

నిజాలు మీరే తెలుసుకోండి 

దీప కార్తీక్ కు మీకు తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయి అని చెబుతుంది. దానికి కార్తీక్..నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పమంటే.. ఇదంతా ఏమిటి? అంటాడు. అవును డాక్టర్ బాబు.. మీకు తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. అవి మీరు తెలుసుకుంటేనే బావుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన చోటికి వెళ్ళండి. అక్కడ మీకు నిజం ఏమిటో చెప్పాల్సిన వాళ్ళు చెబుతారని అంటుంది. అదేదో నువ్వే చెప్పొచ్చుకదా అని కార్తీక్ అడుగుతాడు. ”నేను చెప్పీ..చెప్పీ దశాబ్దం దాటిపోయింది డాక్టర్ బాబు. మీరు నమ్మలేదు. మోనిత నిజస్వరూపం ఇదీ అని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినలేదు. ఇప్పుడు నేను చెప్పిన చోటికి వెళ్ళండి. అక్కడ మీకు నిజం తెలుస్తుంది. నన్ను నమ్మండి.” అని అంటుంది దీప.

భాగ్యం భర్త ఇంటికి వస్తాడు. ఇల్లు తాళం పెట్టి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళింది అని అనుకుని ఫోన్ చేస్తాడు. కానీ, ఆమె ఫోన్ లిఫ్ట్ చేసే అవకాశం ఉండదు. దీంతో కంగారు పడిన ఆయన దీప దగ్గరకు బయలుదేరుతాడు.

అంజి తప్పించుకున్నాడు

అంజి కుర్చీలో ఉంటాడు. అక్కడ ద్రాక్షారామం మందు తాగుతూ అంజిని మా డాక్టరమ్మతో పెట్టుకుంటావా? ఏమనుకున్తున్నావు? అని బెదిరిస్తాడు. దానికి అంజి నువ్వు నాతో పెట్టుకుంటున్నావు..నేనెవరో తెలుసా? అని అడుగుతాడు. ”నువ్వేవరైతే నాకేంటి? మా మేడం నిన్ను చంపమని ఒక్క ఫోన్ చేసి చెబితే చాలు ఇక్కడే లేపెస్తాను అంటాడు.”. దీంతో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరుగుతుంది. ద్రాక్షారామం చేతిలో ఉన్న బాటిల్ లాకున్న అంజి దానితో అతని తలమీద కొడతాడు. ఆ దెబ్బకు ద్రాక్షారామం తల పగిలి కింద పడిపోతాడు. సరిగ్గా ఇదే సమయంలో కార్తీక్ అక్కడకు వస్తాడు.

నిజాన్ని నమ్మని డాక్టర్ బాబు 

అక్కడ అంజిని చూసిన కార్తీక్ ”ఓహో దీప ఇలా రౌడీలతో కలిసి పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తోందా?” అనుకుంటాడు. ఈలోపు అంజి డాక్టర్ బాబూ నమస్తే అని పలకరిస్తాడు. దానికి కార్తీక్..”ఏమిటిదంతా అంటాడు.” ఆ మోనిత చేసిన పని బాబూ.” అంటాడు అంజి. నువ్వెవరు అని అడుగుతాడు కార్తీక్.. నేను డాక్టర్ బాబు మీ దగ్గర డ్రైవర్ గా పనిచేసిన వాడిని అంటాడు అంజి. అంతకు ముందు నువ్వెవరు అని అడుగుతున్నాను అంటాడు కార్తీక్. రౌడీని బాబు అని చెబుతాడు. దీంతో కార్తీక్ దీప నిన్ను నమ్మింది కాబట్టి ఎదో కథలు చెప్పి కాలక్షేపం చేయాలనీ ప్రయత్నిస్తున్నావు. నాకేమీ నువ్వు చెప్పకు అంటాడు. ”కాదు డాక్టర్ బాబు మోనితను నమ్మవద్దు. అని ఇంకా ఎదో చెప్పబోతుండగా ఇదేనా దీప చెప్పమంది అని అడుగుతాడు. అవును అని చెబుతాడు అంజి. నిన్ను దీప బాగా నమ్ముతుంది కాబట్టి నీకేదైనా సహాయం కావాలంటే అడుగు చేస్తాను. నువ్వు ఇలాంటి పనులు మానేసి బుద్దిగా ఉండు అని చెప్పి వెనక్కి తిరుగుతాడు. అంజి..డాక్టర్ బాబూ ఒక్క నిమిషం అని అతన్ని ఆపుతాడు. ” మీరు నన్ను నమ్మినా నమ్మకపోయినా మీకు నష్టం లేదు. కానీ, ఆ మోనితను మాత్రం అసలు నమ్మవద్దు డాక్టర్ బాబు. మీరు మంచివారు. అందరిలోనూ మంచే చూస్తారు. కానీ మోనిత మంచిది కాదు. మీరు ప్రపంచంలో ఎవరినైనా నమ్మండి కానీ, మోనితను నమ్మవద్దు. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలే. మోనిత వలెనే నా జీవితం ఎటూ కాకుండా అయిపొయింది. మీరు మోనితను నమ్మితే మీ జీవితమూ ఎటూకాకుండా అయిపోతుంది.” అని హెచ్చరిస్తాడు. అదంతా విని కార్తీక్ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

భాగ్యం కోసం ఆందోళన 

దీప తండ్రి దీప దగ్గరకు వస్తాడు. దీపను మీ పిన్ని ఇక్కడకు వచ్చిందా అంటాడు. రాలేదు అని చెబుతుంది. ఇద్దరూ భాగ్యం ఏమైందని కంగారు పడతారు. తండ్రికి కంగారు పడవద్దని ధైర్యం చెబుతుంది. కానీ, అతను మాత్రం లేదు ఎదో జరిగింది. నేను తెలిసిన వారిని అందరినీ అడుగుతాను అని వెళ్ళిపోతాడు. దీప ఆలోచనలో పడుతుంది.

ఆనందరావు టెన్షన్ 

అక్కడ కార్తీక్ తండ్రి ఆనందరావు టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఆదిత్య వచ్చి ”ఏంటి డాడీ..మందులు వేసుకున్నారా?” అని అడుగుతాడు. ”వేసుకుని చచ్చాను” అంటాడు. అదేమిటి డాడీ అలా మాట్లాడతావు అని అడుగుతాడు. ”మరేం చేయమంటావు. 25వ తేదీ వచ్చేసింది. రిజిస్ట్రార్ ఆఫీసులో మోనిత పెళ్లి కోసం పెట్టుకున్న ముహూర్తం ఇది. కార్తీక్ ఏం చేయబోతున్నాడో అర్ధం కావడం లేదు. టెన్షన్ పడక ఏమి చేయను” అంటాడు ఆనందరావు. ఈ పరిస్తితిలో దీప, కార్తీక్ ల దగ్గర ఉండడమే మంచిది అని ఆదిత్యకు చెబుతాడు ఆనందరావు. దానికి ఆదిత్య ”రేపో మాపో మమ్మీ వచ్చేస్తుంది. తను అప్పగించిన పనులు ఉన్నాయి. అవి పూర్తికకపోతే చంపేస్తుంది. ఈ ఒక్కరోజు ఆగు ఆ పనులన్నీ పూర్తి చేసుకుని అక్కడికి వెళదాం డాడీ.” అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళు నన్ను దీప దగ్గరకు వెళ్ళనిచ్చేలా లేరు అని ఆనందరావు బాధపడతాడు.

మోనిత షాక్ 

అక్కడ మోనిత ద్రాక్షారామానికి ఫోన్ చేస్తుంది. అంజి తనను కొట్టి తప్పించుకున్న విషయం చెబుతాడు ద్రాక్షారామం. దీంతో మోనిత ఫ్యూజులు ఎగిరిపోతాయి. వాడు తప్పించుకుంటే నువ్వేం చేస్తున్నావ్ అంటుంది కోపంగా. అమ్మా వాడు చాలా పెద్ద హంతకుడిలా ఉన్నాడు..మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెబుతాడు ద్రాక్షారామం. దీంతో మోనిత వాడిని తిట్టిపోస్తుంది. తరువాత ఏమి చేయాలా అని మతిపోయినదానిలా ఆలోచిస్తూ ఉంటుంది.

మాకు చెప్పింది మర్చిపోయారు

దీప ఇంటిలో కూచుని ఆలోచిస్తూ ఉంటుంది. భాగ్యం ఏమైపోయింది అని. ఈలోపు పిల్లలు వస్తారు. అమ్మా ఆన్లైన్ క్లాస్ అయిపొయింది అంటారు. వాళ్ళను పట్టించుకోకుండా తన ఆలోచనల్లో ఉంటుంది దీప. సౌర్య”అమ్మా ఏమిటి ఆలోచిస్తున్నావు” అంటుంది. దీంతో తేరుకున్న దీప ఏమీ లేదమ్మా అంటుంది. సౌర్య ”అమ్మ నువ్వొకటి మర్చిపోయావు.. నువ్వే కాదు డాడీ కూడా మర్చిపోయారు” అంటుంది. ఏమిటి అని అడుగుతుంది దీప. ఈరోజు 25 వ తేదీ. అంటుంది. దీప షాక్ అయి.. నేను నీతో ఆ తేదీ గురించి ఎప్పుడు చెప్పను అంటుంది. హిమ కూడా ఎప్పుడూ అమ్మ ఆ తేదీ చెప్పలేదే అంటుంది. దానికి సౌర్య”ఏమిటీ నీకు కూడా గుర్తులేదా? మనం బయటకు తీసుకువెళ్ళమని అడిగితే అమ్మ..25 వతేదీన అందరం కలిసి వెళదాం” అని చెప్పింది కదా గుర్తులేదా? అని అడుగుతుంది. అప్పుడు దీపకు తాను అలా చెప్పిన విషయం గుర్తొస్తుంది. అమ్మా ఎప్పుడు వెళదాం అని అడుగుతుంది సౌర్య. హిమ కూడా నిజమే నువ్వు చెప్పావు అమ్మా.. ఎప్పుడు వెళదాం అని అడుగుతుంది. దీంతో దీపలో రకరకాల ఆలోచనలు మొదలవుతాయి.

ఇదీ ఈరోజు జరిగిన కథ. మరి కార్తీక్ కు అంజి చెప్పినా నిజం తెలియలేదు. ఇప్పుడు దీప ఏం చేస్తుంది? మోనిత చేసిన మోసం బయటపడుతుందా? భాగ్యం ఎక్కడవుందో తెలుస్తుందా. ఇంత జరుగుతున్నా ఏసీపీ రోషిణి ఏమీ మాట్లాడటం లేదు ఎందుకు? దీప తీసిన వీడియో కార్తీక్ చూస్తాడా? ఇవన్నీ రేపు (ఎపిసోడ్ 1112) ప్రసారం అయ్యే ఎపిసోడ్ లో చూడాల్సిందే!

Also Read: మరిన్ని కార్తీకదీపం సీరియల్ కథనాల కోసం ఇక్కడ చూడండి:

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీప చాకచక్యం..డాక్టర్ బాబు బయటపడినట్టేనా?

Karthika Deepam: మోనితకు దొరికిన అంజి..దీపకు షాక్..కార్తీక్ టెన్షన్..

Karthika Deepam: ధర్మం కోసం ఒకరు.. పంతంతో మరొకరు.. ఒకే కారులో ఉప్పూ..నిప్పూ.. కార్తీకదీపంలో యాక్షన్ సెగ!

Karthika Deepam: మోనితను నిలదీసిన ప్రియమణి..దొరికిన ఆచూకీ.. అంజి కోసం బయలుదేరిన దీప!

Latest Articles
టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారుః కొడాలి నాని
టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారుః కొడాలి నాని
పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డ్‌లో గుజరాత్
పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డ్‌లో గుజరాత్
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు