Karthika Deepam: కార్తీకదీపం షాకింగ్ ట్విస్ట్..మోనితను చంపేసిన కార్తీక్..!

ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ మరింత ఇంట్రస్టింగ్ గా మారింది. కార్తీక్ ను పెళ్ళిచేసుకోవాలనే తొందరలో మోనిత చేసిన పాపాలు దీప చేతికి సాక్ష్యాలుగా చిక్కాయి.

Karthika Deepam: కార్తీకదీపం షాకింగ్ ట్విస్ట్..మోనితను చంపేసిన కార్తీక్..!
Karthika Deepam Episode 1112
Follow us

|

Updated on: Aug 07, 2021 | 8:40 AM

Karthika Deepam: ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ మరింత ఇంట్రస్టింగ్ గా మారింది. కార్తీక్ ను పెళ్ళిచేసుకోవాలనే తొందరలో మోనిత చేసిన పాపాలు దీప చేతికి సాక్ష్యాలుగా చిక్కాయి. 25వ తేదీ దగ్గర పడుతుండడంతో విషయాన్ని తొందరగా తేల్చాలని దీప భావిస్తుంది. అటు మోనిత కూడా అంజిని కిడ్నాప్ చేయించాననే సంబరంలో ఉంటుంది. కానీ అంజి ఆమె చెర నుంచి తప్పించుకుంటాడు. ఈలోపు మోనిత దగ్గరకు వచ్చిన భాగ్యంను కట్టిపాడేస్తుంది మోనిత. అంజిని కలిసిన కార్తీక్ కు అంజి మోనిత గురించి ఎంత చెప్పినా నమ్మడు. పైగా అతన్ని తిట్టి వెనక్కి వస్తాడు. ఇదీ నిన్నటి (ఎపిసోడ్ 1111) కథ. మరి ఈరోజు (ఎపిసోడ్ 1112) లో ఏమి జరగబోతోంది? తెలుసుకుందాం..

మోనిత అసలు రంగు ఇదీ..

దీపతో, ఇద్దరు పిల్లలు బయటకు వెళదామా అని అడుగుతారు. డాడీ వచ్చాకా మాట్లాడి వెళదాం అంటుంది దీప. సరే అని పిల్లలు బయటకు వెళ్ళిపోతారు..ఈ లోపు కార్తీక్ వస్తాడు. అంజిని కలిసారా అని అడుగుతుంది. కలిసాను కలిసి ప్రయోజనం ఏమిటి? అంటాడు కార్తీక్. అంజి నిజం చెప్పలేదా? అని ప్రశ్నిస్తుంది దీప..ఈ విషయం పక్కన పెట్టు. ”అంజి వస్తాడు. ఎదో జరుగుతుంది అని అనుకుంటే వాడు పాత విషయాలే చెబుతున్నాడు. దీని వలన లాభం ఏమిటి?” అని అడుగుతాడు కార్తీక్. అదేమిటి డాక్టర్ బాబు అంజిని తీసుకెళ్ళి రోషిణి మేడం ముందు నిలబెడితే మోనిత జైలు కెళ్ళిపోయేది అని దీప అంటుంది. దానికి కార్తీక్.. రోషిణి మేడం నేను ఈ పెళ్లి తప్పించుకోవడం కోసం ఎప్పుడో పదేళ్ళ క్రితం జరిగిన సంఘటనను అడ్డం పెట్టుకోవాలని అంజిని తీసుకొచ్చి నాటకం ఆడుతున్నాను అనుకుంటుంది. ఆమెకు సాక్ష్యం కావాలి. అంజి సాక్ష్యం సరిపోదు అని చెబుతాడు. ”అర్ధం అయింది డాక్టర్ బాబు.. మీకు సాక్ష్యం ఉంటేనే కానీ, నన్ను నమ్మరు. మీకూ..రోషిణి మేడంకి కావలసిన సాక్ష్యం నా దగ్గర ఉంది.” అంటూ దీప మోనిత అంజిని బెదిరిస్తూ మాట్లాడిన వీడియో కార్తీక్ కి చూపిస్తుంది.

వీడియో చూస్తున్న కార్తీక్ చేష్టలుడిగిపోతాడు. హిమను నేనే చంపించాను అని మోనిత చెబుతున్న మాటలు విని కార్తీక్ కు చెమటలు పడతాయి. ”డాక్టర్ బాబు మీరు ప్రేమించిన హిమను మోనిత చంపించింది. తరువాత మీరు నన్ను పెళ్లి చేసుకున్నాకా.. నా మీద అనుమానం పెరిగేలా చేసింది. మనల్ని పదేళ్ళు దూరంగా ఉండేలా చేసింది. మీకు నిజం తెలిసి మనం దగ్గరవుతున్నాం అని ఇప్పుడు కడుపు నాటకం మొదలు పెట్టింది. ఈ సాక్ష్యం చాలు డాక్టర్ బాబు..రోషిణి మేడం దగ్గరకు వెళ్లి ఈ వీడియోను చూపిస్తే ఆమె అన్ని విషయాలు చూసుకుంటుంది. అంటుంది దీప. అప్పటికే వీడియో చూసి షాక్ అయిన కార్తీక్ కి చెమటలు పడతాయి. అది చూసిన దీప మంచినీళ్ళు తెస్తాను అని ఇంట్లోకి వెళుతుంది.

మోనితను చంపడానికి బయలుదేరిన కార్తీక్..

దీప మంచినీళ్ళు తీసుకువచ్చేసరికి కార్తీక్ అక్కడ ఉండడు. కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడో అని బయటకు వచ్చిన దీపకు పిల్లలు ఎదురై అతను కారులో వెళుతున్న విషయం చెబుతారు. దీంతో దీప భయపడుతుంది. మోనిత నిజస్వరూపం తెలిసిన తరువాత ఆవేశంతో ఏమి చేయబోతున్నారో అని టెన్షన్ అవుతుంది. కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. దీప ఫోన్ లిప్ట్ చేసిన కార్తీక్ తాను డాక్టర్ భారతి వాళ్ళ ఫ్రెండ్ చనిపోతే, అతన్ని చూడటానికి వెళుతున్నానని అబద్ధం చెబుతాడు. అయితే, మనసులో మాత్రం.. ఇంత అన్యాయం చేసిన మోనితను చంపడానికి వెళుతున్నాను అని అనుకుంటాడు.

భాగ్యం కోసం వెతుకులాట

అక్కడ భాగ్యం భర్త ఆమె కోసం అన్నిచోట్లా వెతుకుతాడు. ఇంటికి వచ్చి కూచుని ఆమె ఎక్కడ కనిపించలేదనీ, తెలిసిన వారివారి ఇంటి వద్దా లేదనీ ఏమైందో ఏమిటో అని కంగారు పడుతుంటాడు. మరోవైపు భాగ్యం తన కట్లు విప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

అన్నయ్య ఎక్కడ వదినా?

దీప కార్తీక్ చెప్పింది నిజామా అని ఆలోచిస్తుంటుంది. ఇంత ఘోరం మోనిత చేసింది అని తెలిసిన తరువాత కూడా కార్తీక్ అంత కూల్ గా ఎలా ఉన్నారని అనుకుంటుంది. ఈలోపు ఆదిత్య ఫోన్ చేస్తాడు. వదినా.. అన్నయ్య అక్కడ ఉన్నాడా అని అడుగుతాడు. బయటకు వెళ్లారు. అక్కడికి వచ్చారా? అని అడుగుతుంది దీప. అవును వదినా.. ఇక్కడికి వచ్చాడు. చాలా సీరియస్ గా ఉన్నాడు. వస్తూనే అమ్మ గదిలోకి వెళ్ళాడు. వెంటనే బయటకు వచ్చి డాడీకి మందులు మార్చాలని చెప్పాడు. కొత్త మందులు రాసిచ్చి జాగ్రత్తగా ఈ మందులు వాడేలా చూడు. డాడీని జాగ్రత్తగా చూసుకో..అంటూ వెళ్ళిపోయాడు. అని చెబుతాడు ఆదిత్య. ”నాకు డాక్టర్ భారతి వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు. వాళ్ళింటికి వెళుతున్నాను అని చెప్పారు” అని అంటుంది దీప. వదినా నిన్న రాత్రంతా నువ్వు ఎక్కడికి వెళ్లావు. మేము వెతుకుతూనే ఉన్నాం అని చెబుతాడు. అవన్నీ తరువాత మాట్లాడుదాం ఆదిత్య..నేను మీ అన్నయ్యకు ఫోన్ చేయాలి అని చెప్పి.. కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. ఫోన్ కలవదు. దీంతో దీప కంగారు పడుతుంది.

మోనిత టెన్షన్..

అక్కడ మోనిత టెన్షన్ పడుతుంది. కాళ్ళు పట్టుకున్నా.. అన్నా అని పిలిచినా అంజి నన్ను నమ్మలేదు. ఇప్పుడు ఏమి చేస్తాడు? రోషిణి మేడం దగ్గరకు వెళ్లి నా కథ అంతా చెప్పెస్తాడా? ఇక్కడికి వచ్చి నన్ను చంపెస్తాడా? దీప దగ్గరకు వెళ్లి విషయం చెబుతాడా? అని అనుకుంటూ అటూ ఇటూ కంగారుగా తిరుగుతుంటుంది. ఈలోపు తలుపులు గట్టిగా తెరచుకుంటాయి. ఆ చప్పుడు లోపల గదిలో కట్టిపడేసి ఉన్న భాగ్యంకి కూడా వినిపిస్తుంది. ఎవరు వచ్చి ఉంటారు? దీప వచ్చి ఉంటుందా అని అనుకుంటుంది.

మోనితపై కార్తీక్ సీరియస్..

కార్తీక్ లోపలి వస్తాడు. ”వచ్చావా కార్తీక్.. నీకోసం ఎదురుచూస్తున్నాను.. వస్తాడు నారాజు యీరోజు అంటూ నీకోసమే ఎదురు చూస్తున్నాను అని మోనిత సంబరంగా అంటుంది. కార్తీక్ నువ్వు నాకోసం వస్తావని తెలుసు. నాకార్తీక్ నన్ను పెళ్లిచేసుకుంటాడని నాకు తెలుసు. నువ్వు ఎంత మంచివాడివి కార్తీక్.. నన్ను పెళ్ళిచేసుకోవడానికి వచ్చావు అంటూ ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తూ ఉంటుంది. దీంతో.. కార్తీక్ ”ఆపవే!” అని అరుస్తాడు. ఏమిటి కార్తీక్ అప్పుడే సొంత పెళ్ళాంని పిలిచినట్టు పిలుస్తున్నావ్ అంటుంది మోనిత. ”ఎవరు పెళ్ళామే..నా భార్య దీప. నేను చచ్చేవరకూ నా భార్య దీపే. నీలాంటి వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా నా కాలిగోటికి కూడా సరిపోరు” అని సీరియస్ గా అంటదు. ”ఏమిటి కార్తీక్ అలా మాట్లాడుతున్నావు. నా కడుపులో బిడ్డకు నువ్వే తండ్రివి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోక తప్పదు దీనిని తప్పించుకోలేవు” అంటుంది మోనిత.

నిన్ను చంపేస్తాను..

ఆపవే నాటకాలు.. నీ పెళ్లి కాదు చావు వచ్చింది అని కోపంగా అంటాడు. మోనిత నేనెందుకు చస్తాను? ఎప్పుడు చస్తాను అని ప్రశ్నిస్తుంది. ఇప్పుడే.. నా చేతుల్లోనే.. ఎందుకో తెలుసా? నన్ను ప్రేమించిన కారణానికి..కేవలం నేను ప్రేమించిన కారణానికి హిమని దారుణంగా నువ్వు చంపించినందుకు.. నిన్ను.. ఇక్కడే.. ఇప్పుడే చంపేయబోతున్నాను అంటాడు కార్తీక్. దీంతో మోనిత షాక్ అవుతుంది. ఇదీ ఈరోజు ఎపిసోడ్..

మోనితను చంపిన కార్తీక్..

ఆవేశంగా వెళ్ళిన కార్తీక్ ఇంటికి కూల్ గా వచ్చాడు. ఈలోపు ఏసీపీ రోషిణి అక్కడకు వస్తుంది. దీప ఆమెతో రండి మేడం మేమే మీ దగ్గరకు బయలుదేరాం అంటుంది. ”ఎందుకు లొంగిపోవడానికా?” అని అడుగుతుంది రోషిణి. లొంగిపోవడం ఏమిటి మేడం అని దీప అడుగుతుంది. మోనిత ను చంపి ఆ శవాన్ని దాచిపెట్టినందుకు? మిస్టర్ కార్తీక్ మోనిత శవం ఎక్కడ దాచావు? అని అడిగి అతన్ని అరెస్ట్ చేసి తీసుకు వెళ్లిపోతుంది.. ఇదీ సోమవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ 1113 ఎపిసోడ్ ప్రోమో.. మరి ఏమి జరిగింది? ఎలా జరిగింది తెలియాలంటే సోమవారం వరకూ ఆగాల్సిందే!

Also Read: మరిన్ని కార్తీకదీపం సీరియల్ కథనాల కోసం ఇక్కడ చూడండి:

Karthika Deepam: నిజం తెలుసుకోలేని కార్తీక్..తప్పించుకున్న అంజి..మోనిత ముహూర్తం చుట్టూ కార్తీకదీపం ట్విస్ట్!

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీప చాకచక్యం..డాక్టర్ బాబు బయటపడినట్టేనా?

Karthika Deepam: మోనితకు దొరికిన అంజి..దీపకు షాక్..కార్తీక్ టెన్షన్..

Karthika Deepam: ధర్మం కోసం ఒకరు.. పంతంతో మరొకరు.. ఒకే కారులో ఉప్పూ..నిప్పూ.. కార్తీకదీపంలో యాక్షన్ సెగ!

Karthika Deepam: మోనితను నిలదీసిన ప్రియమణి..దొరికిన ఆచూకీ.. అంజి కోసం బయలుదేరిన దీప!

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..