Karthika Deepam: కార్తీకదీపంలో పెద్ద ట్విస్ట్..మోనిత కొత్త నాటకం మొదలైంది!

కుటుంబ బంధాల మాధుర్యం.. వైవాహిక జీవితంలో అనుమాన భూతం తెచ్చే అనర్ధం.. ప్రేమ వికృత రూపం దాలిస్తే వచ్చే ఉపద్రవం.. అన్నిటినీ కలబోసి ధారావాహికగా ప్రతిరోజూ ఇంటిల్లపాదినీ అలరిస్తున్న సీరియల్ కార్తీకదీపం.

Karthika Deepam: కార్తీకదీపంలో పెద్ద ట్విస్ట్..మోనిత కొత్త నాటకం మొదలైంది!
Karthika Deepam Episode 1120
Follow us
KVD Varma

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2021 | 2:10 PM

Karthika Deepam: కుటుంబ బంధాల మాధుర్యం.. వైవాహిక జీవితంలో అనుమాన భూతం తెచ్చే అనర్ధం.. ప్రేమ వికృత రూపం దాలిస్తే వచ్చే ఉపద్రవం.. అన్నిటినీ కలబోసి ధారావాహికగా ప్రతిరోజూ ఇంటిల్లపాదినీ అలరిస్తున్న సీరియల్ కార్తీకదీపం. తెలుగు ప్రేక్షకులకు నిత్యం వినోదాన్ని అందిస్తూ వస్తోంది కార్తీకదీపం. ఇప్పటివరకూ ఎన్నో మలుపులు తిరుగుతూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకూ 1119 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు 1120వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. ప్రతి రోజు.. ప్రతి ఎపిసోడ్ అక్షరరూపంలో మీకోసం అందిస్తున్నాం. ఈరోజు (ఎపిసోడ్ 1120)లో ఏం జరగబోతోందో తెలుసుకోబోయే ముందు గతంలో ఏం జరిగిందో చూద్దాం..

ఎలాగైనా డాక్టర్ బాబును రక్షిస్తాను..

మోనితను హత్య చేశాడనే నేరంపై కార్తీక్ ను జైలులో పెట్టింది ఏసీపీ రోషిణి. అయితే, అతను హత్య చేసి ఉండడని దీప గట్టిగా నమ్ముతుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కార్తీక్ ను కలుస్తుంది. దీప ఎంత అడిగినా తను ఈ కేసునుంచి బయటపడటం కష్టం అనే మాట తప్ప ఇంకో ముక్క చెప్పడు. ఏసీపీ రోషిణి దీపను పిలిచి మాట్లాడుతుంది. దీప కార్తీక్ తప్పు చేయలేదని ఆమెతో వాదిస్తుంది. కానీ, రోషిణి దీపను నువ్వు మంచిదానివి అందరూ మంచివారనే నమ్ముతావు. ఆ నమ్మకంతోనే నిన్ను అందరూ మోసం చేస్తారు అని అంటుంది. అయినా, దీప కార్తీక్ విషయంలో నేను చెప్పిందే కరెక్ట్ అని అంటుంది. దీంతో రోషిణి.. కార్తీక్ మోనిత శవాన్ని ఎక్కడ దాచాడో తెలుసుకో చాలు. అది నీకు..మాకు మంచిది. కార్తీక్ కు శిక్ష తక్కువ పడేలా చేస్తాను. తరువాత పిల్లలతో కలిసి మీరిద్దరూ సంతోషంగా ఉండవచ్చు అని అంటుంది. ఇక అక్కడ నుంచి ఇంటికి వచ్చిన దీపకు ఆనందరావు ఆరోగ్యం బాగాలేదని తెలుస్తుంది. ఇదంతా తనవల్లె జరిగింది అని బాధపడుతుంది సౌందర్య దగ్గర. తాను ఎలాగైనా సతీ సావిత్రిలా పోరాటం చేసి కార్తీక్ ను రక్షించుకుంటానని చెబుతుంది. ఇదీ నిన్నటి (1119) ఎపిసోడ్ లో జరిగిన కథ. మరి ఈరోజు (1120) ఏం జరగబోతోందో తెలుసుకుందాం.

డాక్టర్ బాబుకు ఎంత శిక్ష పడుతుంది..

కార్తీక్ కు భోజనం పాలు తీసుకువచ్చి ఇస్తుంది కానిస్టేబుల్ రామసీత. తన భర్తకు ఆరోగ్యం బాగాలేదనీ..మందులు రాసివ్వమనీ అడుగుతుంది. కార్తీక్ మందులు రాసి ఇస్తాడు. తరువాత నామీద ఎందుకు జాలి చూపిస్తున్నావు అని అడుగుతాడు కార్తీక్. ”జాలి కాదు సర్.. గౌరవం. మీరు ఎంతో మంచివారు. మీ హస్తవాసి మంచిది. మీరు ఈ నేరం చేశారని నేను నమ్మలేకపోతున్నా సర్.” అంటుంది. ఇక అక్కడ భాగ్యం తన భర్తకు అన్నం వడ్డిస్తూ ఎదో ఆలోచనలో పడిపోతుంది. అది చూసిన అతను భాగ్యం ఏమిటి ఆలోచిస్తున్నావు? అని అడుగుతాడు. దాంతో భాగ్యం మన కార్తీక్ కి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడొచ్చు అని అడుగుతుంది. నేరం చేశాడని సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఎంత శిక్ష పడుతుందో చెప్పలేము. కానీ, సౌందర్య తన కొడుకుకు శిక్ష తక్కువ పడేలా మంచి లాయర్ ని పెడుతుంది అంటూ చెబుతాడు.

మోనిత శవం దొరకాలి..

దీప వారణాశితో కలిసి అంజని కలవడం కోసం వెళుతుంది దీప. అంజి అక్కడికి వస్తాడు. తాను మోనితను హత్య చేయలేదని చెబుతాడు. తాను కోపంగా మోనితను చంపడానికి వెళ్లానని చెబుతాడు. అయితే, అప్పటికే మోనిత చనిపోయినట్టు తెలిసింది అంటాడు. మోనిత లాంటి రాక్షసి చనిపోవడం గురించి ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు అని చెబుతాడు. కానీ, దేవుడి లాంటి డాక్టర్ బాబుపై నేరం పడటం తట్టుకోలేకపోతున్నాను అని చెబుతాడు అంజి. తాను పాత కక్షలతో మోనితను చంపినట్టు పోలీసులకు చెప్పి లొంగిపోతానని అంటాడు. దానికి దీప..నా భర్త తప్పు చేయకుండా పోలీస్ స్టేషన్ లో ఉన్నాడనే నేను బాధపదుతున్నాను. నువ్వు చేయని తప్పుకు శిక్షకు సిద్ధం అయితే నేను ఎలా ఒప్పుకుంటాను. వద్దు. ఆ పని చేయొద్దు. నాకోసం ఒక సహాయం చేయి అంజి..మోనిత శవం ఎక్కడుందో కనిపెడితే మొత్తం చిక్కుముడి విడిపోతుంది. ఆ కోణంలో ఆలోచించి ఏదైనా దారి దొరుకుతుందేమో చూడు అంజీ అని చెబుతుంది. అంజి సరే అంటాడు. తరువాత.. దీపమ్మా.. నాకులానే ఆ మోనితకు ఇంకా శత్రువులు ఉండొచ్చు కాదమ్మా.. వారు ఆమెను చంపేసి ఉండొచ్చు కదా అని అడుగుతాడు. దీప అవును అంజి.. మోనితకు నీలానే ఒక శత్రువు ఉన్నాడు. దుర్గ.. అతన్ని నన్ను చంపడం కోసం మా ఇంట్లో డ్రైవర్ గా పెట్టింది మోనిత. అయితే, తరువాత మోనితతో అతను గొడవపడ్డాడు. తరువాత దుర్గ కనిపించలేదు. ఎక్కడున్నాడో తెలీదు అని చెబుతుంది దీప. అతని ఫోటో, ఫోన్ నెంబర్ నాకు పంపించండి దీపమ్మా.. నేను అతన్ని ఎలాగైనా కనిపెదతాను అని చెబుతాడు అంజి. వారణాసి.. కార్తీక్ కోసం జైలుకు వెళతాను అని అంజి అన్నందుకు అభినందిస్తాడు.

నేను హత్య చేయలేదు..

సౌందర్య కార్తీక్ కు భోజనం తీసుకువస్తుంది. కార్తీక్ దీప ఎలా ఉంది అని అడుగుతాడు. సతీ సావిత్రిలా ఉంది అని చెబుతుంది సౌందర్య. దానికి కార్తీక్ నవ్వుతాడు. నువ్వు మోనితను హత్య చేశావా అని సౌందర్య అడుగుతుంది. దానికి కార్తీక్ లేదు అని చెబుతాడు. అయితే, దీప నమ్మకం నిజమవుతుంది. కచ్చితంగా నిన్ను బయటకు తీసుకువస్తుంది అని చెబుతుంది. కార్తీక్ ఆమెను ఆలస్యం అయిందని చెప్పి ఇంటికి వెళ్ళిపొమ్మని చెబుతాడు. దీంతో సౌందర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

మోనిత కొత్త నాటకం..

కానిస్టేబుల్ రామసీత ఒక చిన్న ఇంటి దగ్గరకు వెళుతుంది తలుపు తీస్తుంది. అక్కడ మోనిత ఉంటుంది. ఆమె మోనిత దగ్గరకు వెళ్లి మేడం అని పిలుస్తుంది. వచ్చావా రామసీత.. నా కార్తీక్ ఎలా ఉన్నాడు. భోజనం చేశాడా? అని అడుగుతుంది. చేశారు మేడం. అని చెబుతుంది రామసీత. కార్తీక్ ఎలా ఉన్నాడు.. ఫోటో తీసావా అని అడుగుతుంది. తీశాను అని కార్తీక్ లాకప్ లో ఉన్న ఫోటో ఫోన్ లో చూపిస్తుంది రామసీత. ఆ ఫోటో చూసిన మోనిత ఒక్కసారిగా పిచ్చిదానిలా మారిపోతుంది. కార్తీక్ నా కార్తీక్.. అంటూ పిచ్చి మాటలు మొదలు పెడుతుంది. నిన్ను కష్టపెట్టాలని కాదు కార్తీక్. దీపకు నేనంటే ఏమిటో తెలియాలనే ఇలా చేశాను. లేకపోతె నాముందే నీకు పాన్ తినిపిస్తుందా? నువ్వు పాన్ తప్పని సరి పరిస్థితిలో తిన్నావని తెలుసు కార్తీక్. దీప సంగతి తేలుస్తాను. అంటూ ఇష్టం వచ్చినట్టు తనలో తానే మాట్లాడుకుంటుంది. ఈలోపు రామసీత మేడం అని పిలవడంతో సర్దుకుని ఆమెకు డబ్బు ఇస్తుంది. నువ్వు నా మనిషివి అని ఎవరికీ తెలియనివ్వకు.. జాగ్రత్త అని చెబుతుంది. రామ సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఇదీ ఈరోజు జరిగిన కథ. మరి బ్రతికే ఉన్న మోనిత శవం కోసం వెతుకుతున్న పోలీసులకు, దీపకు నిజం తెలుస్తుందా.. కార్తీక్ బయటకు వస్తాడా? మోనిత తరువాత ఏమి చేస్తుంది? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.

Also Read: Karthika Deepam: నీ భర్త మోనితను చంపేశాడు.. దీపకు షాక్ ఇచ్చిన రోషిణి..అంతా వాళ్ళే చేశారంటున్న కార్తీక్!

Karthika Deepam: మీ అమ్మనూ చంపేస్తాను..నిస్సిగ్గుగా నిజాలు కక్కిన మోనిత..నిజాలు విని కార్తీక్ షాక్..!