Karthika Deepam: దీపను చంపేస్తాను..కార్తీకదీపంలో మోనిత ఆట మళ్ళీ మొదలైంది..

Karthika Deepam: దీపను చంపేస్తాను..కార్తీకదీపంలో మోనిత ఆట మళ్ళీ మొదలైంది..
Karthika Deepam Episode 1121

కార్తీకదీపం..ప్రతిరోజూ టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్. ఇంటిల్లిపాదీ ఆసక్తిగా చూస్తున్న సీరియల్. కుటుంబ బంధాలు.. మంచీ,చెడుల మధ్య ఉండే సన్నని గీతలు.. అనుబంధాల మధ్యలో అపార్ధాలు.. అన్నిటినీ కలగలిపి బిగి సడలని కథనంతో ముందుకు సాగుతోంది కార్తీకదీపం.

KVD Varma

|

Aug 18, 2021 | 8:15 AM

Karthika Deepam: కార్తీకదీపం..ప్రతిరోజూ టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్. ఇంటిల్లిపాదీ ఆసక్తిగా చూస్తున్న సీరియల్. కుటుంబ బంధాలు.. మంచీ,చెడుల మధ్య ఉండే సన్నని గీతలు.. అనుబంధాల మధ్యలో అపార్ధాలు.. అన్నిటినీ కలగలిపి బిగి సడలని కథనంతో ముందుకు సాగుతోంది కార్తీకదీపం. కుటుంబ సమేతంగా చూడదగ్గ అతి కొద్దీ కార్యక్రమాల్లో ఒకటిగా కార్తీకదీపం విజయయాత్ర కొనసాగిస్తోంది. ఇప్పటివరకూ 1120 ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. అయినా.. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని ప్రేక్షకాదరణతో కార్తీకదీపం ప్రసారం అవుతోంది.

నిన్న (ఎపిసోడ్ 1120) ఏం జరిగిందంటే..

ఎసీపీ రోషిణి దీపకు ఒక అవకాశం ఇస్తుంది. మోనిత శవాన్ని కార్తీక్ ఎక్కడ దాచిపెట్టాడో తెలుసుకుంటే.. అతనికి శిక్ష తగ్గేలా చేస్తానని చెబుతుంది. కార్తీక్ ను జైలు నుంచి బయటకు తీసుకురావాలని దీప ప్రయత్నాలు మొదలు పెడుతుంది. అంజిని కలిసి ఎలాగైనా మోనిత శవాన్ని కనిపెట్టాలని చెబుతుంది. దానితో పాటు మోనిత గతంలో ఘర్షణ పడిన దుర్గ జాడ కనిపెట్టాలని అడుగుతుంది. దానికి అంజి సరే అని ఒప్పుకుంటాడు. అసలు తానే ఆ హత్య చేసినట్లు పోలీసులకు చెప్పి జైలుకు వెళ్ళిపోతానని అంజి అంటాడు అయితే దీప వారిస్తుంది.

ఇక మోనిత బతికే ఉంటుంది. కానిస్టేబుల్ రామసీత మోనితను కలుస్తుంది. కార్తీక్ ఫోటో ఇస్తుంది. అది చూసిన మోనిత కార్తీక్ కటకటాల వెనుక ఉన్నందుకు బాధగా ఉన్నా..దీప పై పగతోనే అదంతా చేశాను అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. రామసీతకు కొంత డబ్బు ఇచ్చి జాగ్రత్తగా ఉండు. నువ్వు నన్ను కలిసిన విషయం ఎవ్వరికీ తెలియనివ్వకు అని చెబుతుంది. ఇదీ నిన్న (ఎపిసోడ్ 1120) జరిగింది. ఇక ఈరోజు (ఎపిసోడ్ 1121) ఏం జరగబోతోందో తెలుసుకుందాం.

మేమెందుకు రాకూడదు..

దీప ఇంట్లో నేలపై పడుకుని ఉంటుంది. అది చూసిన పిల్లలు ఆమెను ఎందుకు నేల మీద పడుకున్నావు? అని ప్రశ్నిస్తారు. డాడీ కోసం రాత్రంతా ఏడుస్తూ కూచున్నావు కదా అని సౌర్య దీపను అడుగుతుంది. మాకు కూడా డాడీ గుర్తు వస్తే ఏడుపు వస్తోంది అని హిమ అంటుంది. మమ్మల్ని డాడీ దగ్గరకు తీసుకువెళ్లమ్మా అని పిల్లలు ఇద్దరూ అడుగుతారు. అటువంటి చోటుకు మిమ్మల్ని తీసుకువెళితే డాడీ తిడతారు అని చెబుతుంది దీప. మరి నువ్వు వెళుతున్నావు కదా మమ్మీ.. నువ్వు వెళ్ళగా లేనిది మేము వెళితే తప్పేమిటి? మమ్మల్ని డాడీ దగ్గరకు తీసుకువెళ్ళకపోతే మామీద ఒట్టే అని అంటారు పిల్లలు. దీంతో చేసేది లేక సరే అంటుంది దీప. సౌందర్య హాలులో అటూ ఇటూ తిరుగుతుంటుంది. అమ్మా ఏమిటమ్మా ఇల్లంతా కొత్తగా చూస్తున్నావు? అంటాడు ఆదిత్య. ఇల్లు కొత్తగా కనిపిస్తోందిరా.. మీ అన్నయ్య లేక కళ తప్పింది. అంటుంది సౌందర్య. నీకే ఇలా ఉంటె మరి వదిన పరిస్థితి ఏమిటమ్మా అని అడుగుతాడు ఆదిత్య. ”పదేళ్ళు మీ వదిన కార్తీక్ కి దూరంగానే ఉందిరా.. దానికి వాడి ఎడబాటు అలవాటే. కానీ, వాడు నన్ను ఎప్పుడూ వదిలి ఉండలేదు. మనతోనే ఉన్నాడు. అందుకే.. బాధగా ఉంది .” అని చెబుతుంది సౌందర్య. డాడీ వాకింగ్ కు వెళ్ళారా? అని అడుగుతుంది సౌందర్య. అవునమ్మా వాకింగ్ కె కానీ, బయటకు కాదు టెర్రస్ మీదకు అంటాడు ఆదిత్య. అదేంటి? అని అడుగుతుంది సౌందర్య. బయటకు వెళుతుంటే అందరూ అన్నయ్య గురించి అడుగుతున్నారట. అందుకని టెర్రస్ మీదే వాకింగ్ చేస్తాను అని చెప్పారు అంటాడు ఆదిత్య.

పిల్లలని తప్ప అందర్నీ చంపేస్తాను..

ఇక మోనిత ఒక చిన్న ఇంట్లో కార్తీక్ ఫోటో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో ఎంత ఇబ్బంది పడుతున్నావో కార్తీక్. నిన్ను బాధ పెట్టాలని కాదు కార్తీక్..నిన్నూ..దీపను కలవకుండా చేయాలనే ఇలా చేశాను. మీ ఇద్దరూ కలవకూడదు. నేను నీకోసం ఏమైనా చేస్తాను కార్తీక్. నిన్ను త్వరలోనే బయటకు తీసుకువస్తాను. కానీ, ఆ దీపను మాత్రం చంపేస్తాను. ఎటువంటి పరిస్థితిలోనూ బతకనివ్వను. ఆ దీపే కాదు పిల్లల్ని తప్ప మొత్తం అందర్నీ చంపేస్తాను. అని క్రూరంగా మాట్లాడుకుంటూ ఉంటుంది. తరువాత అసలు ఆరోజు ఏమి జరిగింది అనేది గుర్తు చేసుకుంటుంది. ఆవేశంగా తనను నిలదీసిన కార్తీక్.. తుపాకీ తీసి చంపేస్తాను అని కోపంగా అంటాడు. కానీ, ఛీ.. అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. దీంతో మోనిత కార్తీక్ అంటూ అతని వెనుక వస్తుంది. ‘నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉన్నాసరే.. నిన్ను చంపకుండా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే, నాకు చంపడం చాతకాదు. ప్రాణాలు పోయడమే తెలుసు.’ అంటాడు కార్తీక్. నీ మొహం నాకు చూపించకు అని అంటాడు. మరి నా కడుపులో బిడ్డ మాట ఏమిటి కార్తీక్ అని అడుగుతుంది. మనం పెళ్లి చేసుకుందాం. నీకు నేను పేమ అంటే ఏమిటో చూపిస్తాను అని అంటుంది. దీంతో ఆమెను ఈసడించుకుని వెళ్ళిపోతాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిపోయిన తరువాత మోనిత గదిలోకి వెళ్లి తుపాకీ తీసుకుని రెండుసార్లు గాలిలో పేలుస్తుంది. తరువాత చాకుతో తనని తానూ గాయపరుచుకుంటుంది. ఈ తుపాకీ శబ్దం లోపల గదిలో బందీగా ఉన్న భాగ్యం వింటుంది. తనని తాను రక్తం వచ్చేలా గాయపరుచుకున్న మోనిత ఇప్పుడు చూడు కార్తీక్.. నిన్ను దీపను ఎలా వేరుచేస్తానో అనుకుంటుంది. ఇదీ ఈ ఎపిసోడ్ కథ.

మరి మోనిత బ్రతికి ఉందనే నిజం దీపకు తెలుస్తుందా? కార్తీక్ బయటకు వస్తాడా? దీపను చంపడానికి మోనిత ఏమి చేయబోతోంది? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే!

కార్తీకదీపం మరిన్ని కథనాలను ఇక్కడ చదవండి: Karthika Deepam: కార్తీకదీపంలో పెద్ద ట్విస్ట్..మోనిత కొత్త నాటకం …

Karthika Deepam: నీ భర్త మోనితను చంపేశాడు.. దీపకు షాక్ ఇచ్చిన రోషిణి..అంతా వాళ్ళే చేశారంటున్న కార్తీక్!

Karthika Deepam: మీ అమ్మనూ చంపేస్తాను..నిస్సిగ్గుగా నిజాలు కక్కిన మోనిత..నిజాలు విని కార్తీక్ షాక్..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu