Alia Bhatt: మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై జంటగా అలియా, రణ్‌బీర్.. కీలక పాత్రలో విక్కీ.. డైరెక్టర్ ఎవరంటే?
అలియా భట్ , రణబీర్ కపూర్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర' చిత్రం 2022 చివర్లో విడుదలై సూపర్ హిట్ అయింది. అప్పటికి వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలీవుడ్‌కి ఇది ఊరటనిచ్చింది. ఇప్పుడు ఆలియా భట్, రణబీర్ కపూర్ మళ్లీ తెరపై కలిసి నటించనున్నారు.

అలియా భట్ , రణబీర్ కపూర్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం 2022 చివర్లో విడుదలై సూపర్ హిట్ అయింది. అప్పటికి వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలీవుడ్‌కి ఇది ఊరటనిచ్చింది. ఇప్పుడు ఆలియా భట్, రణబీర్ కపూర్ మళ్లీ తెరపై కలిసి నటించనున్నారు. అంతేకాదు ఇదే సినిమాలో కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ కూడా నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలియా భట్‌కి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రానికి దర్శకత్వం వహించిన సంజయ్ లీలా భన్సాలీ ఇప్పుడు తన కొత్త సినిమాలో అలియాభట్‌కు మళ్లీ అవకాశం ఇచ్చాడు. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే సంజయ్ ఎప్పటిలాగే కొత్త తరం కథతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఆలియా, రణ్‌బీర్, విక్కీ కౌశల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ నేపథ్యంలో సాగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సంజయ్ లీలా బన్సాలీ హిస్టారికల్ లేదా రెట్రో తరహా సినిమాలు చేసేవారు. అయితే ‘లవ్ అండ్ వార్’ సినిమా కొత్త తరం కథాంశంతో సాగుతుంది. అలాగే సంజయ్ లీలా బన్సాలీ సినిమాల్లో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని యాక్షన్ కి ఈ సినిమాలో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ సంజయ్ లీలా బన్సాలీ కొత్త చిత్రంలో నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ముంబైలోని సంజయ్ లీలా బన్సాలీ కార్యాలయం ముందు అల్లు అర్జున్ కూడా కొన్ని సార్లు కనిపించాడు. అల్లు అర్జున్‌తో సంజయ్ ఈ సినిమా గురించి చర్చించాడని, ఇప్పుడు విక్కీ కౌశల్‌కి ఆ అవకాశం వచ్చిందని అంటున్నారు. ‘లవ్ అండ్ వార్’ చిత్రాన్ని భన్సాలీ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 2025 లో విడుదల కానుంది.
త్వరలోనే షూటింగ్ ప్రారంభం..
❤🔥#SanjayLeelaBhansali #RanbirKapoor @vickykaushal09 @prerna982 @bhansali_produc #LOVEandWAR pic.twitter.com/C7QpdIjpZt
— Alia Bhatt (@aliaa08) January 24, 2024
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి యానిమల్..
The air is dense and the temperature is rising. 🔥🔥 Witness his wild rage in Animal, streaming from 26 January on Netflix in Hindi, Tamil, Telugu, Malayalam and Kannada. #AnimalOnNetflix pic.twitter.com/ituQvrT9kS
— Netflix India (@NetflixIndia) January 25, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








