Saif Ali Khan: దేవర సెట్లో ప్రమాదం.! సైఫ్ అలీఖాన్ ఫస్ట్ రియాక్షన్..

Saif Ali Khan: దేవర సెట్లో ప్రమాదం.! సైఫ్ అలీఖాన్ ఫస్ట్ రియాక్షన్..

Anil kumar poka

|

Updated on: Jan 25, 2024 | 11:29 AM

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మోచేతి సమస్యతో ముంబయిలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా 'దేవర' మూవీ షూటింగ్‏లో పాల్గొంటున్న సైఫ్.. ఇటీవల షూట్ సమయంలో గాయపడ్డారు. దీంతో ఆయన మోకాలు, భుజానికి గాయాలు కావడంతో ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. అదే రోజు తన భుజానికి శస్త్ర చికిత్స జరిగినట్టు కూడా.. బాలీవుడ్‌ మీడియా కోడై కూసింది. ఇక ఈ క్రమంలోనే భుజానికి కట్టుతో.. తన భార్య కరోనా సమేతంగా... తన ఇంటి దగ్గర కనిపించారు సైఫ్‌.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మోచేతి సమస్యతో ముంబయిలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ‘దేవర’ మూవీ షూటింగ్‏లో పాల్గొంటున్న సైఫ్.. ఇటీవల షూట్ సమయంలో గాయపడ్డారు. దీంతో ఆయన మోకాలు, భుజానికి గాయాలు కావడంతో ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. అదే రోజు తన భుజానికి శస్త్ర చికిత్స జరిగినట్టు కూడా.. బాలీవుడ్‌ మీడియా కోడై కూసింది. ఇక ఈ క్రమంలోనే భుజానికి కట్టుతో.. తన భార్య కరోనా సమేతంగా… తన ఇంటి దగ్గర కనిపించారు సైఫ్‌. కనిపించడమే కాదు.. ఈ వీడియోతో నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు. ఇక సైఫ్‌కు దేవర సెట్లో ప్రమాదం జరిగిందని తెలియగానే.. ఆయన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ కూడా ముంబయ్‌లోని సైఫ్‌ ఇంటికి భారీగా చేరారు. అయితే వీరందరికీ అభివాదం చేసిన సైఫ్‌.. తనపై ఇంతగా ప్రేమను చూపిస్తూ.. కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ గాయాలు, శస్త్రచికిత్స అన్నీ.. తన పనిలో భాగమే అని.. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ ధన్యవాదాలు” అని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోతో మరో సారి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు ఈ హీరో.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos