మీ జాతకంలో శుక్ర దోషం ఉందా? శుక్రవారం ఈ పరిహారాలు చేస్తే అదృష్టం మీవెంటే
జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. శుక్రుడు వైవాహిక సౌఖ్యం, భౌతిక ఆనందాలు, ప్రతిభ, అందం, శ్రేయస్సును ప్రసాదించే గ్రహంగా భావిస్తారు. ఎవరి జాతకంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉంటాడో వారు ఈ సుఖాలన్నింటిని అనుభవిస్తారని జ్యోతిష్యులు చెబుతారు. కానీ శుక్రుడు దోష స్థితిలో ఉండటం లేదా బలహీనంగా ఉండటం వల్ల జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. జాతకంలో శుక్ర దోషం ఉన్నవారికి, శుక్రవారం నాడు పాటించాల్సిన కొన్ని ప్రత్యేక పరిహారాలను వాస్తు శాస్త్రం సూచిస్తోంది.

జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శుక్రుడు వైవాహిక ఆనందం, భౌతిక సుఖాలు, ప్రతిభ, అందం, శ్రేయస్సుకు కారణమైన గ్రహంగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో శుక్రుడు ఉన్నత స్థానంలో ఉంటాడో వారు ఈ ఆనందాలన్నింటినీ పొందుతారని చెబుతారు. అయితే, దోషం లేదా వారి జాతకంలో అశుభ స్థానం ఉన్నవారు జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు.
జాతకంలో శుక్ర దోషం లేదా బలహీన శుక్రుడు ఉన్నవారికి.. శుక్రవారం నాడు కొన్ని ప్రత్యేక నివారణలు సూచించింది వాస్తు శాస్త్రం. ఈ నివారణలను పాటిస్తే.. జాతకంలో శుక్ర దోష ప్రభావాలు తొలగిపోయి.. బలహీన శుక్రుడు బలంగా మారతాడు. దీంతో శుక్రుడు అశుభ ఫలితాలు ఇవ్వడానికి బదులుగా.. శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు.
జాతకంలో శుక్ర దోషాలకు సంకేతాలు
శుక్ర దోషం లేదా బలహీనమైన శుక్రుడు జాతకంలో ఉన్నవారు ఆర్థిక నష్టాలను చవిచూస్తారు. అలాంటి వ్యక్తులు మద్యం, జూదం, మాదక ద్రవ్యాలు, చెడు సహవాసాల వైపు మొగ్గు చూపుతారు. వివాహాలు ఆలస్యమవుతాయి. సంబంధాలు దెబ్బతింటాయి. చర్మం, కంటి సమస్యలు తలెత్తుతాయి. జీవితంలో భౌతిక సుఖాలు లోపిస్తాయి. ప్రేమ సంబంధాలు విజయవంతం కావు. ధూమపానం, మద్యపానం లాంటి చెడు వ్యసనాలకు బానిసలు కావచ్చు.
శుక్రవారంనాడు ఈ పరిహారాలు చేయండి
శుక్ర గ్రహ దోష ప్రభావాలను తొలగించి.. మీ జాతకంలో శుక్రుడిని బలోపేతం చేసేందుకు శుక్రవారాల్లో తెల్లటి వస్తువులను దానం చేయండి. 11 శుక్రవారాలు వైభవ లక్ష్మీ ఉపవాసం ఆచరించండి. ఇది శుక్రుడిని సంతోషపరుస్తుంది. శుక్రవారాల్లో పేదవారికి ఆహారం ఇవ్వండి. ఆవులకు రొట్టెలకు నెయ్యి పూసి, బెల్లం తినిపించండి. ఇది మీ జాతకంలో శుక్రుడిని బలపరుస్తుంది. బలహీనమైన శుక్రుడు ఉన్నవారు క్రమంగా తప్పకుండా ‘ఓం శుక్రాయన నమ:’ అనే మంత్రాన్ని జపించాలి. అంతేగాక, మద్యం, ఇంద్రియ సుఖాలు, మాంసం, అక్రమ సంబంధాలకు దూరంగా ఉండటం మంచిది.
Note: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.
