AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భీష్ముడు మకర సంక్రాంతి రోజే ఎందుకు మరణించాడు? ప్రత్యేకత ఏంటో తెలుసా?

జనవరి 14న సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ రోజున మకర సంక్రాంతి పండగను జరుపుకుంటారు. మకర సంక్రాంతి కేవలం పండగ మాత్రమే కాదు.. దీని వెనుక అనేక ఆధ్యాత్మిక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈరోజున సూర్యుడు మకర రాశిలో ఉత్తరం వైపు కదులుతాడు. ఈ కారణంగా ఈ కాలాన్ని పుణ్యకాలంగా భావిస్తారు. ఈరోజు మరణిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

భీష్ముడు మకర సంక్రాంతి రోజే ఎందుకు మరణించాడు? ప్రత్యేకత ఏంటో తెలుసా?
Bhishma Patamah
Rajashekher G
|

Updated on: Jan 09, 2026 | 9:34 AM

Share

హిందూ మతంలో సంక్రాంతి అతిపెద్ద పండగల్లో ఒకటి. జనవరి 14న సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ రోజున మకర సంక్రాంతి పండగను జరుపుకుంటారు. మకర సంక్రాంతి కేవలం పండగ మాత్రమే కాదు.. దీని వెనుక అనేక ఆధ్యాత్మిక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈరోజున సూర్యుడు మకర రాశిలో ఉత్తరం వైపు కదులుతాడు. హిందూ గ్రంథాల ప్రకారం ఈ కాలాన్ని దేవతల సమయంగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు ఉత్తరంవైపు కదులుతున్నప్పుడు.. స్వర్గం ద్వారాలు తెరుచుకుంటాయని చెబుతారు.

ఉత్తరాయణ కాలంలో మణించినవారు మోక్షాన్ని పొందుతారని, దక్షిణాయన సూర్యుని సమయంలో మరణించినవారు జనన మరణ చక్రం గుండా వెళ్లాలని నమ్ముతారు. పండగల సమయంలో మరణం ప్రాముఖ్యత గురించి గురించి తరచూ గందరగోళం గురవుతూ ఉంటారు. మకర సంక్రాంతినాడు మరణం ప్రాముఖ్యత ఏమిటని ప్రజలు తరచుగా ఆశ్చర్యపోతారు. భీష్మ పితామహుడు కూడా మకర సంక్రాంతి రోజు కోసం ఎదురుచూసి ఆ రోజునే తన ప్రాణాలు విడవడం గమనార్హం.

మకర సంక్రాంతి నాడు మరణిస్తే మోక్షం లభిస్తుందా?

శాస్త్ర పండితుల అభిప్రాయం ప్రకారం.. మకర సంక్రాంతి లేదా సూర్య భగవానుడి ఉత్తరాయణంలో ఎవరైనా మరణిస్తే.. వారి కోసం స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయి. మకర సంక్రాంతి నాడు మరణించే వారి ఆత్మలు అత్యంత పుణ్యప్రదమైనవిగా పరిగణిస్తారు. అందుకే ఆత్మలు స్వయంచాలకంగా మోక్షాన్ని పొందుతాయి. వీటిని దేవుని రోజులుగా పరిగణిస్తారు. కాబట్టి మరణం తర్వాత ఆత్మ నేరుగా దేవుడి పాదాల వద్ద ఒక స్థానాన్ని పొందుతుందని విశ్వాసం.

మహా భారతంలో భీష్మ పితామహుడి మరణం నుంచి దీనిని బాగా అర్థం చేసుకోవచ్చు. భీష్ముడికి ఇష్టానుసారంగా మరణం అనే వరం లభించింది. మహా భారతం 10వ రోజున.. అర్జునుడి బాణాలు భీష్ముడి శరీరాన్ని తీవ్రంగా చీల్చాయి. దీంతో అతను యుద్ధభూమిలో గాయపడి పడిపోయాడు. ఆ తర్వాత అర్జునుడు వేసిన బాణాల మంచం మీద భీష్ముడు పడుకుంటాడు. భరించలేని నొప్పిని అనుభవించాడు కానీ.. మరణించేందుకు ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ సమయంలో సూర్య భగవానుడు దక్షిణ దిశలో ఉన్నందున అతను వెంటనే ప్రాణాలు వదులుకోలేదు.

భీష్ముడు మోక్షం కోసం వేచి చూశాడు

శాస్త్రాల ప్రకారం సూర్యదేవుడు దక్షణి దిశలో ఉన్న కాలాన్ని మరణానికి అనుకూలమైనదిగా పరిగణించబడదు. భీష్ముడికి ఈ విషయం తెలుసు. అందుకే ఆయన సూర్య భగవానుడు ఉత్తరం వైపునకు వెళ్లే వరకు వేచి ఉన్నారు. సూర్య భగవానుడు ఉత్తరంవైపునకు ప్రయాణం ప్రారంభించిన మకర సంక్రాంతినాడు భీష్ముడు తన ప్రాణం వదిలాడు. ఈ సమయంలో మరణించడం వల్ల ఆత్మ మోక్షం పొందుతుందని నమ్ముతారు. భీష్ముడికి తన ఇచ్ఛా ప్రకారం మరణం ఉండటంతో సంక్రాంతి వరకు వేచి ఉన్నారు.

Note: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధ‌ృవీకరించదు.

వైభవ్ దెబ్బకు రికార్డులు బద్దలు కావాల్సిందే.. మిషన్ 607 షురూ!
వైభవ్ దెబ్బకు రికార్డులు బద్దలు కావాల్సిందే.. మిషన్ 607 షురూ!
వేడి వేడి పనీర్ బ్రెడ్ పకోడీ.. చల్లని వెదర్‌లో పర్ఫెక్ట్ స్నాక్..
వేడి వేడి పనీర్ బ్రెడ్ పకోడీ.. చల్లని వెదర్‌లో పర్ఫెక్ట్ స్నాక్..
'ది రాజాసాబ్' సినిమాకు హీరోగా ప్రభాస్ ఫస్ట్ చాయిస్ కాదా?
'ది రాజాసాబ్' సినిమాకు హీరోగా ప్రభాస్ ఫస్ట్ చాయిస్ కాదా?
కళ్లు తిరగడం: ప్రమాదకర సంకేతం కావచ్చు.. జాగ్రత్తలు తీసుకోండి
కళ్లు తిరగడం: ప్రమాదకర సంకేతం కావచ్చు.. జాగ్రత్తలు తీసుకోండి
మీ టీ కప్పులో దాగున్న ముప్పు.. లివర్ ఆరోగ్యం కోసం ఈ వాస్తవాలు..
మీ టీ కప్పులో దాగున్న ముప్పు.. లివర్ ఆరోగ్యం కోసం ఈ వాస్తవాలు..
ఆ హీరోయిన్ పెళ్లి నేనే చేశా.. వాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు..
ఆ హీరోయిన్ పెళ్లి నేనే చేశా.. వాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు..
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
నందీశ్వరుడు ప్రతిష్టించిన శివ లింగం.. మన దగ్గరలోనే ఈ క్షేత్రం
నందీశ్వరుడు ప్రతిష్టించిన శివ లింగం.. మన దగ్గరలోనే ఈ క్షేత్రం
ఫోన్‌ను కారులో ఛార్జ్‌ చేస్తే ఏమవుతుంది? చాలా మందికి తెలియంది ఇదే
ఫోన్‌ను కారులో ఛార్జ్‌ చేస్తే ఏమవుతుంది? చాలా మందికి తెలియంది ఇదే
నువ్వా నేనా అంటున్న బ్యూటీస్.. మరి అదృష్టం ఎవరిని వరించనుందో..
నువ్వా నేనా అంటున్న బ్యూటీస్.. మరి అదృష్టం ఎవరిని వరించనుందో..