AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Raja Saab : రాజా సాబ్ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి.. తెలంగాణలో ఎంతంటే..

ప్రభాస్ హీరోగా నటించిన లేటేస్ట్ సినిమా 'ది రాజాసాబ్'. ఈ మూవీ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటిలకే ప్రీమియర్ షోలు చూసిన అడియన్స్ డైరెక్టర్ మారుతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సరికొత్త హారర్ థ్రిల్లర్ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

The Raja Saab : రాజా సాబ్ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి.. తెలంగాణలో ఎంతంటే..
Raja Saab
Prabhakar M
| Edited By: |

Updated on: Jan 09, 2026 | 7:06 AM

Share

హైదరాబాద్: ప్రభాస్ నటించిన భారీ చిత్రం ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపుపై తెలంగాణలో అర్ధరాత్రి వరకు ఉత్కంఠ నెలకొంది. అనుమతి వస్తుందా లేదా అన్న సందిగ్ధతతో థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు ఎదురుచూసిన పరిస్థితి. చివరకు అర్ధరాత్రి తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక జీవోను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో నిర్ణీత కాలానికి టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

జీవో ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో తొలి మూడు రోజుల పాటు టికెట్‌పై రూ.105 వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతి ఏడు రోజులు, అంటే జనవరి 12 నుంచి 18 వరకు రూ.62 మేర అదనంగా వసూలు చేయవచ్చు. మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధరల పెంపు మరింతగా ఉంటుంది. తొలి మూడు రోజులు టికెట్‌పై రూ.132 పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం ఏడు రోజుల పాటు రూ.89 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతిచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం తప్పనిసరిగా ఫిల్మ్ ఇండస్ట్రీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్‌కు జమ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిధి నిర్వహణ కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక ఖాతాను ప్రారంభించనుంది. ఇక థియేటర్లలో సామాజిక బాధ్యతకు సంబంధించిన అంశాలపై కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. డ్రగ్స్, నార్కోటిక్స్ వినియోగం, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై అవగాహన కల్పించే ప్రకటనలను తప్పనిసరిగా ప్రదర్శించాలని జీవోలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

ఈ నిబంధనల అమలుపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, లైసెన్సింగ్ అధికారులు కఠినంగా పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. అర్ధరాత్రి వరకు కొనసాగిన హైడ్రామా అనంతరం విడుదలైన ఈ జీవోతో థియేటర్ యాజమాన్యానికి స్పష్టత రావడంతో పాటు, ‘రాజాసాబ్’ విడుదలపై నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్టైంది.

ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..