ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ చేయనున్న ముగ్గురు స్టార్ ప్లేయర్స్..?
Team India Retirement 2026: టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ 2026 కోసం బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో టీమిండియాకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఈ ఏడాది రిటైర్మెంట్ చేయనున్నారు. ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Team India Retirement 2026: టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. అయితే, ఈ ఏడాది ముగిసేలోపు భారత జట్టులో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. వయసు, ఫామ్, ఫిట్‌నెస్ కారణాల దృష్ట్యా ముగ్గురు కీలక ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ జాబితాలో టీ20 కెప్టెన్ ఉండటం గమనార్హం.
1. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav): ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెరీర్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. 360 డిగ్రీల బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని మెప్పించిన సూర్య, గత 25 అంతర్జాతీయ టీ20ల్లో కేవలం 244 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2024 బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత అతని బ్యాట్ నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాలేదు. 2026 టీ20 వరల్డ్ కప్ తర్వాత, ఒకవేళ ఫామ్ మెరుగుపడకపోతే యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో సూర్య రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం అతను కేవలం టీ20లకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే.
2. అజింక్య రహానే (Ajinkya Rahane): భారత టెస్టు జట్టులో ఒకప్పుడు నమ్మదగ్గ బ్యాటర్ అయిన అజింక్య రహానే, 2023 జూలై నుంచి టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వైట్ బాల్ క్రికెట్‌లో అతనికి ఎప్పుడో తలుపులు మూసుకుపోయాయి. ప్రస్తుతం కోచ్ గౌతమ్ గంభీర్ యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తుండటంతో, టెస్టుల్లో కూడా రహానే పునరాగమనం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఏడాదే అతను అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.
3. రవీంద్ర జడేజా (Ravindra Jadeja): స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, 2027 వన్డే వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టేందుకు జడేజా టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఫిట్‌నెస్ కాపాడుకుంటూ తన వన్డే కెరీర్‌ను పొడిగించుకోవాలని జడేజా భావిస్తున్నట్లు తెలుస్తోంది. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా 2026లో అతను టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది.
ఏ ఆటగాడికైనా రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ, టీమిండియా భవిష్యత్తు ప్రణాళికలు మరియు యువ ఆటగాళ్ల రాక ఈ ముగ్గురి కెరీర్‌పై ప్రభావం చూపేలా ఉన్నాయి. 2026 ఏడాది భారత క్రికెట్‌లో ఒక శకానికి ముగింపు పలకవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..



