Jana Nayagan: దళపతి విజయ్ ‘జన నాయగన్’ విడుదలపై ఉత్కంఠ.. హిస్టరీలోనే బిగ్గెస్ట్ రీఫండ్!
స్టార్ హీరో రిలీజ్ అవుతోందంటే అభిమానులకు పండుగే. అటువంటిది సంక్రాంతి పండుగకు స్టార్ హీరో సినిమా వస్తుందంటే డబుల్ బొనాంజా అనే చెప్పాలి. అయితే, సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో దళపతి విజయ్ సినిమా విడుదల వాయిదా పడటం ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తోంది.

తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో దళపతి విజయ్. ‘జన నాయగన్’ విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు చేస్తున్న చివరి చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 9న థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ యాక్షన్ డ్రామా, ఆఖరి నిమిషంలో వాయిదా పడటం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ రాకపోవడమే దీనికి ప్రధాన కారణమని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. అయితే ఈ జాప్యం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Untitled Design (6)
రికార్డ్ స్థాయిలో టికెట్ల అమ్మకాలు
ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందంటే, అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్దిసేపటికే ‘బుక్ మై షో’ వంటి ప్లాట్‌ఫామ్స్ షేక్ అయ్యాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సంక్రాంతికి అత్యధిక టికెట్లు అమ్ముడైన చిత్రంగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. కానీ ఇప్పుడు విడుదల వాయిదా పడటంతో బుక్ చేసుకున్న వారందరికీ డబ్బులు వెనక్కి ఇచ్చే ప్రక్రియ మొదలైంది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇది అతిపెద్ద రీఫండ్ అని విశ్లేషకులు చెబుతున్నారు. సుమారు 5 లక్షల మందికి పైగా ప్రేక్షకులకు రూ. 20 కోట్ల రూపాయలను ‘బుక్ మై షో’ తిరిగి చెల్లిస్తోంది. ఒక సినిమా వాయిదా పడటం వల్ల ఇంత భారీ మొత్తంలో రీఫండ్ జరగడం ఇదే మొదటిసారి.
సెన్సార్ బోర్డులో అసలేం జరిగింది?
సెన్సార్ కమిటీలోని నలుగురు సభ్యులు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, ఒక సభ్యుడు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సర్టిఫికెట్ జారీ ప్రక్రియ నిలిచిపోయింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు రాజకీయంగా సెన్సిటివ్‌గా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు మద్రాస్ హైకోర్టు మెట్లెక్కింది.
అండగా నిలిచిన కమల్ హాసన్ కుటుంబ సభ్యుడు
సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ చిత్ర యూనిట్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ఆ స్టార్ హీరో తరపున ప్రముఖ న్యాయవాది, లోకనాయకుడు కమల్ హాసన్ మేనల్లుడు సతీశ్ పరాశరణ్ వాదనలు వినిపిస్తున్నారు. సెన్సార్ అడ్డంకులను తొలగించి సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చట్టపరమైన పోరాటం జరుగుతోంది. సంక్రాంతి బరి నుంచి దాదాపు తప్పుకున్న జన నాయగన్ థియేటర్లలో ఎప్పుడు సందడి చేస్తారోనని అభిమానుల నుంచి సినీ ప్రేమికుల వరకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
