AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman khan: షాకింగ్.. సల్మాన్‌ ఖాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన పాకిస్తాన్.. కారణమిదే

బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించడం సంచలనం రేపుతోంది. 1997 ఉగ్రవాద నిరోధక చట్టంలోని 4వ షెడ్యూల్ కింద సల్లూ భాయ్ పేరును చేర్చినట్లు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

Salman khan: షాకింగ్.. సల్మాన్‌ ఖాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన పాకిస్తాన్.. కారణమిదే
Salman Khan
Basha Shek
|

Updated on: Oct 26, 2025 | 3:25 PM

Share

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం ‘ఉగ్రవాది’గా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి ప్రధాన కారణం ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఒక కార్యక్రమంలో సల్మాన్ బలూచిస్తాన్ గురించి చేసిన ప్రకటన. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సల్మాన్ బలూచిస్తాన్, పాకిస్తాన్‌లను విడివిడిగా ప్రస్తావించారు. ఇది పాకిస్తాన్ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. దీంతో పాకిస్తాన్ షాబాజ్ ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసి సల్మాన్‌ను నేరుగా ఉగ్రవాదిగా ప్రకటించింది. పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఈ చర్య తీసుకుంది. దీనితో పాటు సల్మాన్ పేరును నాల్గవ షెడ్యూల్‌లో చేర్చారు. అయితే ఈ విషయంపై సల్మాన్ లేదా అతని టీమ్ నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.

అసలు సల్మాన్ ఏం మాట్లాడాడంటే?

సౌదీ అరేబియాలో ‘జాయ్‌ ఫోరమ్‌ 2025’ లో పాల్గొన్న సల్మాన్.. ‘ప్రస్తుతానికి, మీరు ఒక హిందీ సినిమా తీసి ఇక్కడ (సౌదీ అరేబియాలో) విడుదల చేస్తే, అది సూపర్ హిట్ అవుతుంది. మీరు తమిళం, తెలుగు లేదా మలయాళంలో సినిమా చేస్తే, అది వందల కోట్లు సంపాదిస్తుంది. ఎందుకంటే వివిధ భాషల ప్రజలు ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పాకిస్తాన్ ప్రజలు ఉన్నారు. ఆఫ్గన్లు ఉన్నారు. బలూచిస్తాన్ నుంచి వచ్చిన వారూ ఉన్నారు. వీరే కాదు ఎన్నో దేశాల నుంచి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు’ అని ప్రసంగించారు. అయితే ఇక్కడ సల్మాన్ బలూచిస్తాన్‌, పాకిస్తాన్ లను విడివిడిగా ప్రస్తావించడం పాకిస్తాన్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిరసనలు వెల్లువెత్తాయి. అదే సమయంలో బలూచిస్తాన్ వేర్పాటువాద నాయకులు సల్మాన్ ప్రకటనను ప్రశంసించారు.

బలూచిస్తాన్ స్వతంత్ర్య దేశంగా డిమాండ్ చేస్తున్న నాయకుడు మీర్ యార్ బలూచ్ మాట్లాడుతూ, “భారతీయ నటుడు సల్మాన్ ఖాన్ సౌదీ అరేబియాలో బలూచిస్తాన్ గురించి ప్రస్తావించినప్పుడు 60 మిలియన్ల బలూచ్ పౌరులు సంతోషించారు. ప్రధాన దేశాలు కూడా మాట్లాడడానికి వెనుకాడుతున్న సమయంలో సల్మాన్ ఎంతో ధైర్యంగా ఈ విషయాన్ని ప్రస్తావించాడు’ అని చెప్పుకొచ్చారు

ఇవి కూడా చదవండి

అయితే సల్మాన్ ఉద్దేశపూర్వకంగా బలూచిస్తాన్‌, పాకిస్తాన్ లను విడిగా ప్రస్తావించాడా లేదా అనుకోకుండా మట్లాడాడా? అనేది ఇంకా స్పష్టంగా తెలియడంలేదు. బలూచిస్తాన్ పాకిస్తాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్. ఇది పాకిస్తాన్ గ్యాస్ ఉత్పత్తిలో 40 శాతం వాటాను కలిగి ఉంది. ఎంతో ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, పాకిస్తాన్ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించారు. ఇప్పుడిదే ఏర్పాటు వాద ఉద్యమానికి దారి తీసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి