AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC: ఎల్ఐసీ దీపావళి ధమాకా.. సామాన్యుల కోసం 2 సూపర్ స్కీమ్స్.. ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే..?

దేశంలో అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ దీపావళి ముందు సామాన్యులకు గుడ్ న్యూస్ తెలిపింది. పేద, మధ్యతరగతి ప్రజల కోసం రెండు కొత్త పథకాలు తెచ్చింది. ఈ పాలసీలకు స్టాక్ మార్కెట్‌తో సంబంధం లేదు, కాబట్టి డబ్బు సేఫ్. ఈ కొత్త పథకాల ప్రకటనతో ఎల్ఐసీ షేర్ ధర పెరిగింది. ఈ కొత్త పథకాలు అక్టోబర్ 15 నుంచే అమలులోకి వస్తాయి.

LIC: ఎల్ఐసీ దీపావళి ధమాకా.. సామాన్యుల కోసం 2 సూపర్ స్కీమ్స్.. ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే..?
Lic Launches 2 New Insurance Schemes
Krishna S
|

Updated on: Oct 14, 2025 | 5:17 PM

Share

దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీపావళి పండుగ సందర్భంగా సామాన్యుల కోసం రెండు కొత్త బీమా పథకాలను ప్రకటించింది. ఈ రెండు పథకాలు పూర్తిగా రిస్క్ లేనివి. స్టాక్ మార్కెట్‌తో లేదా బోనస్‌లతో ఎటువంటి సంబంధం లేకుండా అందుబాటులోకి వచ్చాయి. ఎల్ఐసీ అక్టోబర్ 14న చేసిన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ రెండు కొత్త పథకాలు అక్టోబర్ 15 నుండి ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ పథకాలు వేర్వేరు వ్యక్తిగత అవసరాలను తీర్చే విధంగా ఉన్నాయి.

ఎల్ఐసీ జన్ సురక్ష

ఈ పథకం ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ బీమా పథకం. అంటే దీని రాబడి స్టాక్ మార్కెట్‌తో లేదా కంపెనీ బోనస్‌లతో ముడిపడి ఉండదు. దీన్ని ఒక సూక్ష్మ బీమా పథకంగా ప్రారంభించారు. ఆర్థికంగా బలహీన వర్గాలు కూడా సులభంగా బీమా రక్షణ పొందేలా తక్కువ ప్రీమియంలకు, అనుకూలమైన చెల్లింపు ఎంపికలతో ఇది అందుబాటులో ఉంటుంది.

ఎల్ఐసీ బీమా లక్ష్మి

బీమా లక్ష్మి అనేది LIC ప్రారంభించిన మరో కొత్త జీవిత బీమా, పొదుపు పథకం. ఈ ప్లాన్ కూడా మార్కెట్ రిస్క్ లేకుండానే జీవిత బీమా రక్షణతో పాటు, మెచ్యూరిటీ సమయంలో మంచి మొత్తంలో పొదుపు డబ్బును అందిస్తుంది.

కొత్త పథకాల ప్రకటనతో ఎల్ఐసీ షేర్ల జోరు..

రెండు కొత్త పథకాల ప్రకటనతో భారత స్టాక్ మార్కెట్‌లోని బలహీనమైన ట్రెండ్‌ను ధిక్కరిస్తూ LIC షేర్లు పెరిగాయి. LIC షేర్ ధర రూ.904.15 గరిష్ట స్థాయికి చేరుకుంది. మొత్తం ఏడాది పనితీరులో ఎల్‌ఐసీ షేర్ ధర కాస్త నిరాశపరిచినప్పటికీ గత ఆరు నెలల్లో స్టాక్ ఏకంగా 17శాతం పెరుగుదలను నమోదు చేసింది. సామాన్య ప్రజలకు భద్రత, పొదుపును అందించే ఈ రెండు కొత్త పథకాలతో LIC తన మార్కెట్‌ను మరింత విస్తరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి