AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI payments: ఇక.. ఫేస్‌, ఫింగర్‌ప్రింట్‌తోనే UPI చెల్లింపులు

UPI payments: ఇక.. ఫేస్‌, ఫింగర్‌ప్రింట్‌తోనే UPI చెల్లింపులు

Phani CH
|

Updated on: Oct 14, 2025 | 4:30 PM

Share

యూపీఐ చెల్లింపులకు ఇప్పటివరకు పిన్‌ enter చేస్తుండగా, ఇకపై fingerprint, facial recognition తోనూ transaction పూర్తికానుంది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ NPCI ఈ విధానాన్ని లాంచ్‌ చేసినట్లు ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు తెలిపారు. ముంబయిలో జరుగుతున్న గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో దీన్ని మంగళవారం ప్రదర్శించారు.

కొత్త సదుపాయం ఎప్పటినుంచి అందరికీ అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ నూతన విధానాన్ని అక్టోబర్‌ 8 నుంచే కొత్త విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి. ఆధార్‌ కార్డులో నమోదైన బయోమెట్రిక్‌ సమాచారం ఆధారంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. కొత్త విధానం వల్ల భద్రత మరింత పటిష్ఠం అవ్వడమే కాక, ట్రాన్సాక్షన్‌ టైమ్‌ 25% వరకు తగ్గుతుందని చెబుతున్నారు. మొబైల్‌ యాప్‌ ద్వారా ఏదైనా కొనుగోలు చేస్తున్నప్పుడు, పిన్‌ నమోదు చేయకుండానే ముఖాన్ని స్కాన్‌ చేయడం లేదా వేలిముద్ర ఆధారంగా చెల్లింపు పూర్తిచేయొచ్చు. డిజిటల్‌ చెల్లింపుల వాడకంపై మరింత నమ్మకాన్ని ఈ విధానం గ్రామీణుల్లో కల్పిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యంత సురక్షితమైన ఆధార్‌ సమాచారం ఆధారంగా లావాదేవీలు పూర్తవుతాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం సమాచారం బయటకు రాకుండా కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. NPCI వీటన్నింటినీ పూర్తిస్థాయిలో పరీక్షించాకే, అమలుకు సిద్ధమయ్యిందని తెలుస్తోంది. ఈ నూతన విధానంలో ఒకే బ్యాంక్‌ ఎకౌంట్‌ను ఇద్దరు వ్యక్తులు UPI transactionకు ఉపయోగించుకునే వీలునూ కల్పించనున్నారు. ఒకరు లావాదేవీని ప్రారంభించి, పిన్‌ ఎంటర్‌ చేస్తే, చెల్లింపును ఆమోదించేందుకు రెండో వ్యక్తికీ నోటిఫికేషన్‌ వస్తుంది. లావాదేవీ పూర్తి చేసేందుకు ఇద్దరూ తమ మొబైల్‌ ఫోన్లలో పిన్‌ నమోదు చేయాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాముల భయంతో.. కార్తికేయను మిస్‌ చేసుకున్న స్టార్ హీరో..

చీమలు తయారుచేసిన యోగర్ట్‌ ను చూశారా

ఈ 4 తప్పులే ఆయుష్షును తగ్గించేస్తున్నాయా ?? మరి, జపనీయుల ఆరోగ్య రహస్యం ఏమిటి?

కోరింత దగ్గు చిన్నారులకు ప్రాణాంతకం.. గర్భిణిగా ఉన్నప్పుడే టీకా వేస్తే