AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 4 తప్పులే ఆయుష్షును తగ్గించేస్తున్నాయా ?? మరి, జపనీయుల ఆరోగ్య రహస్యం ఏమిటి?

ఈ 4 తప్పులే ఆయుష్షును తగ్గించేస్తున్నాయా ?? మరి, జపనీయుల ఆరోగ్య రహస్యం ఏమిటి?

Phani CH
|

Updated on: Oct 14, 2025 | 3:26 PM

Share

మనం చేసే నాలుగు పొరపాట్లే మన ఆయుష్షు తగ్గిపోడానికి కారణం అంటున్నారు వైద్య నిపుణులు. జపనీయుల ఆయుర్ధాయానికి భారతీయుల ఆయుర్ధాయానికి 13 ఏళ్ల తేడా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు కారణం మన దైనందిన జీవనశైలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం, పనివేళలు, నిద్ర, శారీరక శ్రమ వంటి చిన్న చిన్న విషయాల్లో మనం చేసే పొరపాట్లే మన ఆయుష్షును తగ్గిస్తున్నాయని వారు హెచ్చరిస్తున్నారు.

జపనీయుల రోజువారీ జీవితంలో ప్రధానమైనది శారీరక శ్రమ. వారు ఎక్కడికైనా వెళ్లాలంటే వాహనాలను ఆశ్రయించరు. ఎక్కవ శాతం నడిచి వెళ్తారు. లేదంటే సైకిల్‌ను ఉపయోగిస్తారు. ఇలా రోజులో వారు 7 నుంచి 10 వేల అడుగులు సహజంగానే వేస్తారు. కానీ కొందరు మాత్రం చిన్నపాటి దూరానికి కూడా బైకులు, కార్ల పైన ఆధారపడతారు. కనీసం రోజుకి 2 వేల అడుగులు కూడా నడవడం లేదు. భారత్‌లోని పట్టణాలు, నగరాల్లో అయితే ఇంక చెప్పనక్కర్లేదు. పక్కవీధిలో దుకాణానికి వెళ్లాలంటే కూడా బైక్‌ ఉపయోగిస్తారు. ఇక ఆహారం విషయంలోనూ జపనీయులు చాలా పద్ధతిగా ఉంటారు. ఉదయం అల్పాహారంగా ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. మిసో సూప్, అన్నం, గ్రిల్డ్ చేపలు వంటివి తీసుకుంటారు. భారతీయులు ఇందుకు పూర్తి విరుద్ధం. ఇక్కడ నెయ్యి, వెన్నతో చేసిన ఆహారాలు, కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే టిఫిన్‌లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. దీనివల్ల ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు చిన్న వయసులోనే వస్తున్నాయి. పని విషయంలో జపనీయులు కచ్చితత్వానికి మారుపేరుగా చెబుతారు. అలా అని వారు 16, 18 గంటలు పని చేస్తారు అనుకుంటే పొరపాటే. వారు సగటున రోజుకు ఎనిమిదిన్నర గంటలు మాత్రమే పనిచేస్తారు. కానీ, భారత్‌లో 10 నుంచి 12 గంటల వరకు పని చేస్తూనే ఉంటారు. దీనికి ప్రయాణ సమయం అదనం. ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం, పని ఒత్తిడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆరోగ్యానికి అత్యంత కీలకమైన నిద్ర విషయంలోనూ మనం వెనుకబడే ఉన్నాం. జపనీయులు సగటున 6 నుంచి 7 గంటలు నిద్రపోతే, భారతీయులు కేవలం 5 నుంచి 6 గంటలకే పరిమితమవుతున్నారు. దీర్ఘకాలిక నిద్రలేమి గుండె జబ్బులు, మధుమేహం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని, ఇది అకాల మరణానికి కూడా కారణం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోరింత దగ్గు చిన్నారులకు ప్రాణాంతకం.. గర్భిణిగా ఉన్నప్పుడే టీకా వేస్తే