AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Rates: నాసామి రంగ.. సందు దొరికిందని దూసుకుపోతున్న వెండి.. ఏంది గురు ఈ రేటు

అవును వెండి. కొనలేమండి. ఇప్పుడు వెండే బంగారమైంది. పట్టుకోండి చూద్దాం అంటూ కొండెక్కి కూర్చుంది. ఈ ఐదేళ్లలోనే ఇంతై వటుడింతై అన్నట్టుగా డబుల్ కాదు త్రిబుల్ పెరిగింది. ఇప్పుడు ధరలు పండుగ మూడ్‌లో కాదు..పేలుడు మోడ్‌లో ఉన్నాయి. జ్యువెల్లర్స్ నుంచి ఇన్వెస్టర్స్ వరకు అందరిదీ ఒకటే ప్రశ్న. వెండి ఇక ఫిజికల్‌గా దొరకుతుందా అని. ఇంతకూ ఈరేంజ్‌లో వెండి పెరగడానికి కారణాలేంటి..?

Silver Rates: నాసామి రంగ.. సందు దొరికిందని దూసుకుపోతున్న వెండి.. ఏంది గురు ఈ రేటు
Silver
Ram Naramaneni
|

Updated on: Oct 14, 2025 | 7:03 PM

Share

ఒకసారి ఐదేళ్లలో వెండి ధరలు ఎలా పెరిగాయో ఓ సారి తెలుసుకుందాం…

  • 2020లో 63వేల435 రూపాయలు
  • 2021లో 62వేల572రూపాయలు
  • 2022లో 55వేల 100రూపాయలు
  • 2023లో 78వేల600రూపాయలు
  • 2024లో 95వేల 700రూపాయలు
  • 2025లో దాదాపు 2లక్షల రూపాయలకు చేరింది.

ఎక్కడ 50వేలు, ఎక్కడ 2 లక్షలు. కేవలం మూడేళ్లలోనే ఈరేంజ్‌లో వెండి పెరుగుతుందని ఊహించామా..? 2023లో కిలో వెండి కేవలం 55వేలు, కానీ ఇప్పుడు దాదాపు రెండు లక్షలకు చేరింది. ఇంతలా వెండి ధరలు పెరగడానికి కారణం..ఒకే ఒక్కటి. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడమే. బంగారానికి మించిన డిమాండ్ వెండికే ఎందుకంటే..సవాలక్ష రీజన్స్ చెబుతున్నారు మార్కెట్ నిపుణలు. ఒకప్పడు వెండంటే కాళ్ల పట్టీలు, ఆభరణాలు, కంచాలు, గ్లాసులు, కానీ ఇప్పుడు వెండంటే ఫోన్లు, సోలార్ ప్యానెల్స్‌, ఎలక్ట్రానిక్ గూడ్స్. సో..వెండి ఇప్పుడు కేవలం ఒక లోహం కాదు, అది పెట్టుబడుల్లోనూ, పరిశ్రమల్లోనూ అన్నింటిలోనూ హాట్ కమోడిటీ

గ్లోబల్‌గా వెండి వినియోగం పెరుగుతున్నా, ఆస్థాయిలో మాత్రం ఉత్పత్తి జరగడంలేదు. 2025లో వెండి ఉత్పత్తి దాదాపు 70% ఇతర లోహాల మైనింగ్‌లో కో ప్రొడక్షన్ మెటల్‌గానే లభిస్తోంది. అంటే వెండికోసేం ప్రత్యేకంగా మైనింగ్ చేయరు. సీసం, జింక్, బంగారం, కాపర్ వంటి వాటిని తవ్వే సమయంలో వెండి లభిస్తుంది. అందుకే వెండి సప్లై చాలా తక్కువగా ఉంటుంది.

భారత్ ప్రపంచంలోనే వెండి వినియోగంలో అగ్రగామిదేశంగా ఉంది.  ఆభరణాలు, పాత్రలు, నాణేలు, బార్లు, సౌరశక్తి ప్యానెల్స్‌…. ఎలక్ట్రానిక్ పరికరాల్లో విస్తృతంగా వెండిని వినియోగిస్తున్నాము. మనకు 80% కంటే ఎక్కువ వెండి, దిగుమతులద్వారానే వస్తోంది. అంతేకాదు వెండి రేట్లు పెరగడంతో రికార్డ్‌ స్థాయిలో ETFs, వ్యక్తిగత పెట్టుబడులు పెరిగాయి. వచ్చే ఏడాది నుంచి వెండి కొరత భారీగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు

వెండి ఈరేంజ్‌లో పెరగడానికి కారణం..రికార్డ్ స్థాయిలో సిల్వర్‌ను పారిశ్రామికంగా ఉపయోగించడమే. దాదాపు 60శాతం పైగా వెండి పరిశ్రమల్లోనే వినియోగిస్తున్నాం. అందుకే భవిష్యత్‌లో ఫిజికల్‌గా వెండి దొరకడం కష్టతరం కావచ్చుంటున్నారు నిపుణులు. ఎందుకంటే

1.ప్రొడక్షన్ గణనీయంగా పడిపోవడం: వెండి దాదాపు 70% ఇతర లోహాలైన సీసం, జింక్, బంగారం మైనింగ్‌లోనే లభిస్తుంది. ఆ లోహాల ఉత్పత్తి పెరగితే కానీ, వెండి ఉత్పత్తి పెరగదు.

2. మైనింగ్ ప్రాజెక్టుల ప్రారంభం చాలా తక్కువ:  ప్రత్యేకంగా వెండికోసమే మైనింగ్‌ చేయాలంటే భారీగా పెట్టుబడులు అవసరం. అలాగే అనుమతులు, పర్యావరణ క్లియరెన్స్‌ కూడా కావాలి. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. అందుకే సిల్వర్ ఉత్పత్తి గణనీయంగా పడిపోతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు.

3. రీసైక్లింగ్ తగ్గడం: వెండి ధరలు అమాంతం పెరగడంతో, మార్కెట్లోకి పాత అభరణాలు, నాణేలు, సిల్వర్ బార్లు మార్కెట్లోకి రావడం బాగా తగ్గింది. వెండి ధరలు పెరుగుతాయని ఆశించిన పెట్టుబడిదారులు వెండి అమ్మేందుకు ఇప్పుడు సుముఖంగా లేరు

4.పరిశ్రమ, సౌరశక్తి రంగాల్లో విపరీతమైన డిమాండ్:  సోలార్ ప్యానెల్స్‌, ఎలక్ట్రానిక్స్, EV, మెడికల్ పరికరాల్లో వెండి వినియోగం బాగా పెరిగింది

5.భౌగోళిక & లాజిస్టికల్ సమస్యలు:  భవిష్యత్‌లో వెండి ఉత్పత్తి చేసే దేశాల నుంచి దిగుమతులు రావడం కష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే అమెరికా గత నెలలో వెండిని క్రిటికల్ మినరల్‌ జాబితాలో చేర్చింది. దీంతో అమెరికా భారీగా వెండి నిల్వలను సేకరిస్తోంది. ఇది భారత్, చైనా వంటి దేశాల మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఈ కారణాలతో ఫిజికల్‌గా వెండి లభ్యత చాలా తక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. మరోవైపు బంగారం ధరలు కూడా ఇవాళ ఆల్‌టైమ్ హైకి చేరాయి. పదిగ్రాములు లక్షా 30వేలకు చేరింది. పదిరోజుల్లోనే బంగారం పదివేలకు పైగా పెరిగింది. ఇక ముందు కూడా ఇదే స్థాయిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు.

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా