2026లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతో తెలుసా ??
ఊహించినట్టుగానే దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. మరోవైపు వెండి ధర కూడా బంగారానికి దీటుగా పెరుగుతోంది. పండుగలు, శుభకార్యాలతో సంబంధం లేకుండా ధరలు పెరుగుతుండటంతో బంగారం కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో..వీటి ధరలపై ...బ్యాంక్ ఆఫ్ అమెరికా కొత్త అంచనాలను ప్రకటించింది.
2026 నాటికి బంగారం ధర ఔన్సుకు 5,000 డాలర్లుగా, వెండి ధర 65 డాలర్లుగా ప్రకటించింది.ఈ అంచనా నిజమైతే, 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1,56,458కి చేరుకునే అవకాశం ఉంది.నిజానికి, ఇప్పటికే బంగారం ధరలు ఈ సంవత్సరం 55 శాతం మేర పెరిగాయి. గత వారం స్పాట్ గోల్డ్ $4,000 మార్కును దాటింది. అయితే, బంగారం $6,000 మార్కును చేరుకోవాలంటే, పెట్టుబడిదారులు తమ కొనుగోళ్లను మరో 28 శాతం పెంచాల్సి ఉంటుందని బ్యాంక్ అభిప్రాయపడింది. సమీప భవిష్యత్తులో ధరల్లో కొంత దిద్దుబాటు (కరెక్షన్) రిస్క్ ఉన్నప్పటికీ, 2026లో మాత్రం బంగారానికి మరింత ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా స్పష్టం చేసింది. బంగారంతో పాటు వెండి కూడా తన ప్రకాశాన్ని పెంచుకోనుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా ప్రకారం, 2026 నాటికి వెండి ధర ఔన్స్‌కు 65 డాలర్ల (సుమారు రూ. 5,400) మైలురాయిని తాకే అవకాశం ఉంది. ఈ అంచనా ప్రకారం, కిలో వెండి ధర సుమారు రూ. 2,03,417కి పైగా పెరిగే అవకాశం ఉంది. ఇది వెండిపై పెట్టుబడి పెట్టేవారికి భారీ లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులో దిద్దుబాటు ప్రమాదం ఉన్నప్పటికీ, 2026లో రెండు లోహాలకు మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా తన నోట్‌లో పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kolkata’s Underwater Metro: దేశంలోని తొలి అండర్ వాటర్ మెట్రోను చూశారా
సెక్యూరిటీ గార్డు నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా
నీ ఫిట్‌నెస్ సూపర్ బ్రో… సైకిల్‌పై ఈఫిల్ టవర్ ఎక్కాడు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

