Kolkata’s Underwater Metro: దేశంలోని తొలి అండర్ వాటర్ మెట్రోను చూశారా
కోల్‌కతా నగరంలో హూఘ్లీ నదికి అడుగున ఓ అద్భుతమైన టన్నెల్ నిర్మించి, ఆ టన్నెల్‌లో మెట్రో రైలును ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు నదులపై బ్రిడ్జి నిర్మించి ప్రయాణాలు సాగించే రైళ్లనే చూశాం. కానీ ఈ మెట్రో రైలు అన్నిటికంటే డిఫరెంట్. దేశంలో మొదటిసారిగా నీటి అడుగు భాగంలో నడుస్తున్న మెట్రో రైలు ఇది. రూ.120 కోట్ల వ్యయంతో ఈ టన్నెల్‌ను హుగ్లీ నది కింద నిర్మించారు.
కోల్‌కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు. ఇందులో 10.8 కిలోమీటర్ల పొడవున మెట్రో మార్గం.. భూమి కింది భాగంలో ఉంటుంది. ఆ తరువాత నదిలోపలికి ప్రవేశిస్తుంది. ఈ మార్గంలో హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర.. అంటే 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్ మెట్రో టన్నెల్ ను నిర్మించారు. ఇది హుగ్లీ నదిని 45 సెకన్లలో దాటేస్తుంది. ఈ అండర్ వాటర్ టన్నెల్‌ను అత్యాధునిక టెక్నాలజీతో ప్రకృతి విపత్తులను కూడా తట్టుకునేలా రూపొందించారు. బ్రిటన్‌కు చెందిన సంస్థల సహకారంతో ఈ టన్నెల్ నిర్మించారు. ప్రస్తుతం హౌరా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గంటన్నర సమయం పడుతుండగా.. ఈ అండర్‌వాటర్ మెట్రో మార్గం అందుబాటులోకి రావడంతో కేవలం 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ అండర్‌వాటర్ టన్నెల్ నిర్మాణ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. పై నుంచి వచ్చే నీటి ఒత్తిడిని తట్టుకుని, టన్నెల్ లోపలికి నీరు రాకుండా అడ్డుకునే యంత్రాన్ని రూపొందించాల్సి వచ్చింది. అయితే ఇలాంటి టన్నెల్ ను దేశంలో ఇప్పటికే నిర్మించినా.. ఈ టన్నెల్ మాత్రం నది లోపల ఉంది. సాధారణ టన్నెల్ బోరింగ్ మెషిన్‌తో… దీనిని ఆపరేట్ చేయడం వీలు కాలేదు. దీంతో ఈ టన్నెల్‌ను తవ్వడానికి అవసరమైన టన్నెల్ బోరింగ్ మెషిన్ ను ప్రత్యేకంగా జర్మనీలో తయారు చేశారు. ఇది నేలను తవ్వుతూ, తవ్విన వెంటనే చుట్టూ ఉండే భాగాన్ని సురక్షితంగా మూసివేస్తూ వచ్చింది. అలా ఈ మెట్రో మార్గాన్ని రెడీ చేయడం సాధ్యమైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెక్యూరిటీ గార్డు నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా
నీ ఫిట్‌నెస్ సూపర్ బ్రో… సైకిల్‌పై ఈఫిల్ టవర్ ఎక్కాడు
సెల్ఫీ తీయబోతూ.. 18 వేల అడుగుల్లో పట్టు తప్పి
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

