AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రతికుండగానే తన అంత్యక్రియలు చేసుకున్న వ్యక్తి.. ఆ తర్వాత

బ్రతికుండగానే తన అంత్యక్రియలు చేసుకున్న వ్యక్తి.. ఆ తర్వాత

Phani CH
|

Updated on: Oct 14, 2025 | 8:30 PM

Share

సాధారణంగా వెనుకా ముందూ ఎవరూ లేనివారు కొందరు తాము చనిపోయాక తమకు శ్రాద్ధకర్మలు నిర్వహించేవారు ఎవరూ ఉండరని కాశీక్షేత్ర దర్శనానికి వెళ్లినప్పుడు తమకు తామే పిండప్రదానం చేసుకుంటూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి మరో అడుగు ముందుకు వేసి ఏకంగా తన అంత్యక్రియలనే నిర్వహించుకున్నాడు. బంధుమిత్రులంతా బోరున విలపిస్తుండగా.. పాడెపై పడుకొని ఊరేగింపుగా శ్మసానానికి వెళ్లాడు.

ఈ విచిత్ర సంఘటన బీహార్‌లో జరిగింది. బీహార్‌లోని గయా జిల్లాలో కొంచి గ్రామానికి చెందిన మోహన్‌లాల్‌ భారత వైమానిక దళంలో పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఆయన వయస్సు ఇప్పుడు 74 ఏళ్లు. ఆయన తనకు వచ్చే పెన్షన్‌ డబ్బుతో సామాజిక సేవ చేస్తుంటారు. అలాంటి ఆ వ్యక్తికి విచిత్రమైన కోరిక కలిగింది. తాను చనిపోతే తన అంత్యక్రియలకు ఎందరు హాజరవుతారు.. తనను ఎలా గౌరవిస్తారు..తనకోసం ఎంతమంది దుఃఖిస్తారు, అసలు తనకు అంతిమసంస్కారాలు ఎలా నిర్వహిస్తారో చూడాలనుకున్నాడు. అంతే వెంటనే తన కోరికను అమలు పరిచాడు. తను బ్రతికుండగానే అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవాలనుకుంటున్నానని, బంధుమిత్రులందరికీ తన చివరి ప్రయాణానికి రావాలని ఆహ్వానం పంపాడు. చనిపోయినవారికి కప్పినట్టుగానే తెల్లటి దుస్తులు వేసి, పాడెపై పడుకోబెట్టి, పూలదండలు వేశారు. డాన్సులు, నినాదాలు చేస్తూ అతన్ని ముక్తిధామానికి తీసుకు వెళ్లి చితిపై పడుకోబెట్టారు. ఆ తర్వాత అతని స్థానంలో దిష్టిబొమ్మను ఉంచి దహనం చేశారు. బంధువులంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. దహనం పూర్తయ్యాక ఆ బూడిదను నదిలో నిమర్జనం చేశారు. అంతిమ సంస్కారాల తర్వాత చేయాల్సిన నియమాలన్నీ పాటించారు. దీంతో తృప్తిపొందిన మోహన్ లాల్.. ఆ తర్వాత వచ్చిన జనాలందరకీ భోజనాలు పెట్టించాడు. ఈ ఘటన నెట్టింట వైరల్‌ కావడంతో అటు స్థానికులను, ఇటు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా మోహన్ లాల్ పెన్షన్‌ డబ్బులతో ఇప్పటికే అనేక సామాజిక కార్యక్రమాలు చేశాడు. ఈ మధ్య వర్షాకాలంలో దహన సంస్కారాలకు గ్రామస్తులు ఇబ్బందిపడుతున్నారని.. ముక్తిధామ్‌ను నిర్మించాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు కాగా అందరూ సెటిల్ అయిపోయారు. భార్య జీవన్ జ్యోతి 14ఏళ్ల క్రితమే కాలం చేసినట్టు సమాచారం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

2026లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతో తెలుసా ??

Kolkata’s Underwater Metro: దేశంలోని తొలి అండర్‌ వాటర్ మెట్రోను చూశారా

సెక్యూరిటీ గార్డు నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా

నీ ఫిట్‌నెస్ సూపర్‌ బ్రో… సైకిల్‌పై ఈఫిల్‌ టవర్‌ ఎక్కాడు

సెల్ఫీ తీయబోతూ.. 18 వేల అడుగుల్లో పట్టు తప్పి