Malavya Yoga: తులా రాశిలోకి శుక్రుడు.. నాలుగు రాశుల వారు జీవితంలో ఓ మెట్టు పైకి..!
శుక్రుడు నవంబర్ 3-26 వరకు తులా రాశిలో సంచరించడం వల్ల నాలుగు రాశుల వారికి మాలవ్య మహా పురుష యోగం ఏర్పడుతుంది. ఈ అరుదైన యోగం మేషం, కర్కాటకం, తుల, మకర రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా, వివాహ బంధాలలో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఆదాయం, హోదా, ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు విదేశీయానం, గృహ లాభాలు కూడా కలుగుతాయి. ఏ రాశి వారికి ఎలాంటి మేలు జరుగుతుందో ఇక్కడ చూడండి..

Shukra Gochar Tula Rashi: భోగభాగ్యాలకు, శృంగారానికి, ప్రేమలు, పెళ్లిళ్లకు కారకుడైన శుక్రుడు నవంబర్ 3 నుంచి 26 వ తేదీ వరకు తన స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేస్తున్నాడు. తులా రాశిలో శుక్రుడు అత్యంత వేగంగానూ, బలంగానూ వ్యవహరించడం జరుగుతుంది. ఈ రాశి మార్పు వల్ల నాలుగు రాశుల వారికి మాలవ్య మహా పురుష యోగం కలుగుతుంది. పంచ మహా పురుష యోగాల్లో మాలవ్య మహా పురుష యోగం ఒకటి. మేషం, కర్కాటకం, తుల, మకర రాశుల వారికి ఈ మహా పురుష యోగం పట్టి, వారి జీవితం ఉచ్ఛ స్థితికి చేరుకుంటుంది. ఆదాయం, ఆరోగ్యం, హోదాలు, విదేశీయానాలు వంటివి తప్పకుండా కలుగుతాయి.
- మేషం: ఈ రాశివారికి సప్తమ కేంద్రంలో సప్తమ స్థానాధిపతి అయిన శుక్రుడు ప్రవేశించడం వల్ల మాలవ్య మహాపురుష యోగం ఏర్పడుతోంది. దీనివల్ల సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందు తారు. అంచనాలకు మించి ఆదాయం వృద్ధి చెందడానికి, సంపన్నులు కావడానికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
- కర్కాటకం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహాపురుష యోగం ఏర్పడింది. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల సాకారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగుతాయి. సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. వాహన యోగం కలుగుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తులు చేతికి అందుతాయి.
- తుల: ఈ రాశిలోకి రాశినాథుడైన శుక్రుడు ప్రవేశించడం వల్ల మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. దీని వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఒక ప్రతిష్ఠాత్మక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంది. సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. జనాకర్షణ పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ప్రేమ, వివాహ బంధాలు పటిష్టం అవుతాయి.
- మకరం: ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్రుడి ప్రవేశం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. ఉద్యోగంలో అధికారయోగం పడుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .
(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)







