AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు గ్రహాల మార్పుతో వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..! ఇందులో మీ రాశి ఉందా?

అక్టోబర్ 24 నుండి నవంబర్ 2 మధ్య బుధ, కుజ, శుక్ర గ్రహాలు రాశి మారబోతున్నాయి. ఈ గ్రహ సంచారం వృషభం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశులవారి జీవితాలపై రెండు నెలల పాటు గణనీయమైన సానుకూల ప్రభావం చూపుతుంది. ఆదాయం, ఆరోగ్యం, ఉద్యోగం, కుటుంబ జీవితాల్లో ఊహించని శుభ పరిణామాలు, రాజయోగాలు, ధన లాభాలు కలుగుతాయి.

మూడు గ్రహాల మార్పుతో వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..! ఇందులో మీ రాశి ఉందా?
Money Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 24, 2025 | 7:44 PM

Share

ఈ నెల(అక్టోబర్) 24 నుంచి వారం రోజుల వ్యవధిలో మూడు ప్రధాన గ్రహాలు రాశులు మారడం జరుగుతోంది. బుధ గ్రహం ఈ నెల 24న(శుక్రవారం) వృశ్చిక రాశిలోకి, కుజుడు 28న వృశ్చిక రాశిలోకి, శుక్రుడు నవంబర్ 2న తులా రాశిలోకి మారుతున్నాయి. ఈ గ్రహాల రాశి మార్పు వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో తప్పకుండా మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వృషభం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారి జీవితాల్లో కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ గ్రహాల మార్పు ప్రభావం పూర్తిగా రెండు నెలల పాటు కొనసాగు తుంది. ఆదాయం, ఆరోగ్యం, ఉద్యోగం, కుటుంబ జీవితాల మీద వీటి ప్రభావం ఉంటుంది.

  1. వృషభం: మూడు గ్రహాల రాశి మార్పుతో ఈ రాశివారు అత్యధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. మనశ్శాంతి, ప్రశాంతత, సుఖసంతోషాలు బాగా పెరిగే పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి.
  2. కర్కాటకం: ఈ రాశివారికి ఈ మూడు గ్రహాల మార్పు వల్ల వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగం పట్టే అవకాశం ఉంటుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. తల్లి వైపు నుంచి ఆస్తిపాస్తులు లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. విదేశాల నుంచి శుభ వార్తలు అందడం, విదేశీ యానానికి అవకాశాలు మెరుగుపడడం, విదేశాల్లో ఉద్యోగాలు లభించడం వంటివి జరుగుతాయి. తండ్రి జోక్యంతో సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది.
  3. కన్య: ప్రధాన గ్రహాల మార్పు వల్ల ఈ రాశివారికి కలలో కూడా ఊహించని ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. అదనపు ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాల్లో విదేశీ అవకాశాలు అందుతాయి. తండ్రి వైపు నుంచి భూమి, ఆస్తి లాభాలు కలుగుతాయి.
  4. తుల: గ్రహాల మార్పుతో ఈ రాశివారికి మంచి రాజయోగం పట్టే అవకాశం ఉంది. ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లపై పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. వ్యాపారాల్లో డిమాండ్ పెరగడంతో పాటు, క్షణం తీరికలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
  5. ధనుస్సు: ఈ రాశివారికి ఈ గ్రహాల మార్పుతో అధిక ధన లాభానికి, ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవాలతో పాటు యాక్టివిటీ కూడా పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా స్థాయి, హోదా పెరిగే అవకాశం ఉంది. జీవనశైలి పూర్తిగా మారుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగుతాయి.
  6. మకరం: గ్రహాల మార్పుతో ఈ రాశికి దశమ, లాభ స్థానాలు పటిష్ఠం అవుతున్నందువల్ల ఈ రాశివారికి రాజయోగాలతో పాటు ధన యోగాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?