Lucky Zodiac Signs: ధనూ రాశికి బలం.. ఇక ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..!
Telugu Astrology: డిసెంబర్ 16 నుండి జనవరి 15 వరకు ధనూ రాశిలో గ్రహాల సంచారం, యుతి కారణంగా విశేష బలం చేకూరుతుంది. దీని ప్రభావంతో మేషం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు, ఆర్థిక లాభాలు, ఉన్నత స్థానం లభించి, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ కాలం వారికి శుభప్రదం.

Lucky Zodiac Signs
ఈ నెల(డిసెంబర్) 16 నుంచి జనవరి 15 వరకు ధనూ రాశికి బలం పెరగబోతోంది. మొదటగా రవి, కుజుల యుతి ఏర్పడుతోంది. ఈ యుతిని గురు, శనులు వీక్షించడం జరుగుతోంది. ధనూ రాశిలో క్రమంగా గ్రహాల సంఖ్య పెరిగి నాలుగుకు చేరుకుంటుంది. మొత్తం మీద ఆరు గ్రహాల ప్రభావం ధనూ రాశి మీద పడుతోంది. దీనివల్ల మేషం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశులవారు ఏ రంగంలో, ఏ స్థాయిలో ఉన్నా తప్పకుండా అందలాలు ఎక్కడం, భాగ్యవంతులు కావడం, అనేక విషయాల్లో వారిని విజయాలు వరించడం జరుగడుతుంది. వారు పట్టిందల్లా బంగారమవుతుంది.
- మేషం: ఈ రాశికి నవమ స్థానం మీద అత్యధిక గ్రహాల ప్రభావం పడుతున్నందువల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. తప్పకుండా విదేశీయాన యోగం, విదేశీ సంపాదన యోగం కలుగుతాయి. అతి తక్కువ శ్రమతో అత్యధికంగా సంపన్నులయ్యే అవకాశం ఉంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశికి సప్తమ స్థానంలో గ్రహ బలం పెరిగినందువల్ల వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాల్లో స్థిరపడే యోగం కలుగుతుంది. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభం పొందడం జరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. దాంపత్య సమస్యలు తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.
- సింహం: ఈ రాశికి పంచమ స్థానంలో గ్రహాల ప్రభావం కేంద్రీకృతమవుతున్నందువల్ల ఈ రాశివారికి దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడంతో పాటు అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా అంచనాలకు మించి వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి. సంతాన యోగం కలుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగవుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి ధన స్థానంలో గ్రహాల సంఖ్య పెరగడంతో పాటు, రెండు ప్రధాన గ్రహాల దృష్టి కూడా పడి నందువల్ల జనవరి 15లోపు ఈ రాశివారికి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందు తాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
- ధనుస్సు: ఈ రాశి మీద ఆరు గ్రహాల ప్రభావం పడినందువల్ల ఈ రాశివారి స్థాయి, హోదా, జీవనశైలి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. అత్యంత ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు.
- కుంభం: ఈ రాశికి లాభ స్థానంలో గ్రహాల యాక్టివిటీ పెరుగుతున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడంతో పాటు, ఆకస్మిక ధన లాభానికి కూడా బాగా అవకాశం ఉంది. మనసులోని కోరి కలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతాన యోగం కలుగుతుంది.



