అసాధారణ గజకేసరి యోగం.. త్వరలో ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..!
Rare Gajakesari Yoga: ఈ అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో అరుదైన గజకేసరి యోగం ఏర్పడుతోంది. చంద్రుడు, ఉచ్ఛ గురువుల అసాధారణ సమసప్తక ప్రభావంతో ఇది మేషం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి అపారమైన అదృష్టం, ఆదాయ వృద్ధి, ఆరోగ్యం, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఈ మూడు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి.

Gajakesari Yoga
ఈ నెల(అక్టోబర్) 29, 30, 31 తేదీల్లో అరుదైన గజకేసరి యోగం చోటు చేసుకుంటోంది. ఈసారి చంద్రుడికి ఉచ్ఛ గురువుతో సమసప్తకం ఏర్పడడం వల్ల ఒక అసాధారణ గజకేసరి యోగం కలుగుతోంది. ఈ యోగం ఆదాయ వృద్ధికి, ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక చింతనకు, రాజపూజ్యాలకు బాగా అవకాశం కలిగిస్తుంది. మనసుకు కారకుడైన చంద్రుడి మీద ఉచ్ఛ గురువు దృష్టి పడడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడడంతో పాటు మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. మేషం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశులకు ఊహించని అదృష్టాలు కలిగే అవకాశం ఉంది. ఈ మూడు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెడతాయి.
- మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో గజకేసరి యోగం పడుతున్నందు వల్ల కుటుంబంలో సుఖ సంతో షాలు వృద్ధి చెందడం, శుభకార్యాలు జరగడం, సంతాన ప్రాప్తి కలగడం, దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి చాలావరకు విముక్తి కలగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. గృహ, వాహన యోగాలకు బాగా అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. పుణ్య క్షేత్ర దర్శనాలకు ప్లాన్ వేస్తారు. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందుతారు. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆర్థిక బలం పెరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశిలో ఉచ్ఛస్థితిలో ఉన్న గురువు సప్తమంలో ఉన్న రాశినాథుడిని వీక్షించడం వల్ల ఈ రాశి వారికి గజకేసరి యోగం కలిగింది. దీనివల్ల వైవాహిక జీవితం నిత్యకల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. సిరిసంపదలు, భోగభాగ్యాలు బాగా వృద్ధి చెందుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందుతారు.
- కన్య: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న చంద్రుడి మీద లాభస్థానం నుంచి గురువు దృష్టి పడడం వల్ల గజకేసరి యోగం కలిగింది. ఈ యోగం వల్ల ఈ రాశివారి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అంచనాలను మించి లాభిస్తాయి. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజపూజ్యాలు ఎక్కువగా కలుగుతాయి.
- తుల: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న చంద్రుడిని దశమ స్థానం నుంచి ఉచ్ఛ గురువు వీక్షించడం వల్ల వీరి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలగడంతో పాటు, జీతభత్యాలు బాగా పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగులకే కాక, నిరుద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువెత్తుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.
- మకరం: ఈ రాశిలో ఉన్న చంద్రుడిని ఉచ్ఛ గురువు వీక్షించడం ఒక గొప్ప అదృష్టంగా భావించాలి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమై మానసిక ప్రశాంతత కలుగుతుంది. అనారోగ్యాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. వైవాహిక జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. అనేక విధాలుగా రాజపూజ్యాలు కలుగుతాయి.
- మీనం: పంచమ స్థానంలో ఉచ్ఛపట్టిన రాశ్యధిపతి గురువు లాభ స్థానంలో ఉన్న చంద్రుడిని వీక్షించడం వల్ల ఈ రాశివారికి అరుదైన గజకేసరి యోగం కలిగింది. ప్రభుత్వంలోని ఉన్నత పదవులకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఉద్యోగంలో అధికారులు వీరి సలహాలు, సూచనల వల్ల బాగా లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.
ఇవి కూడా చదవండి







