- Telugu News Photo Gallery Spiritual photos Lakshmi Kataksham: 5 Zodiac Signs' Favorable Planets Bring Fortune Mahabhagya Yoga
Mahabhagya Yoga: అరుదుగా 5 గ్రహాల అనుకూలత.. ఈ ఏడాదిలోనే వీరికి లక్ష్మీ కటాక్షం!
Lakshmi Kataksham: గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడమనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈ ఏడాదంతా అయిదు గ్రహాలు అనుకూలంగా ఉండడం మరీ అరుదు. అత్యధిక గ్రహాలు అనుకూలంగా మారితే తప్పకుండా అపర కుబేరులవుతారు. ప్రస్తుతం ఈ నెల (అక్టోబర్) 24 నుంచి డిసెంబర్ 28 వరకు మేషం, కర్కా టకం, కన్య, తుల, ధనూ రాశుల వారికి అత్యధిక గ్రహాల అనుకూలత వల్ల మహా భాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. గురువు ఉచ్ఛపట్టడం, శుక్ర, కుజులు స్వస్థానాల్లో సంచారం చేయడం వంటి కారణాల వల్ల ఈ రాశులకు లక్ష్మీ కటాక్షం అత్యధికంగా లభించే అవకాశం ఉంది.
Updated on: Oct 23, 2025 | 5:52 PM

మేషం: ఉన్నత పదవులు చేపట్టాలనే కోరిక అధికంగా కలిగిన ఈ రాశివారికి ఈ లక్ష్యం, ఆశయం నెరవేరడానికి రాహువు, రవితో పాటు రాశ్యధిపతి కుజుడు, శుక్రుడు, బుధుడు బాగా తోడ్పడబోతున్నాయి. ప్రతి విషయంలోనూ సానుకూల దృక్పథంతో వ్యవహరించే ఈ రాశివారికి రెండు నెలల పాటు పట్టిందల్లా బంగారం కాబోతోంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంది.

కర్కాటకం: అందరినీ కలుపుకుని వెళ్లే తత్వంతో పాటు, మొండి పట్టుదల కలిగిన ఈ రాశివారికి అయిదు గ్రహాల అనుకూలతతో పాటు, హంస, మాలవ్య మహా పురుష యోగాలు కూడా కలుగుతున్నందువల్ల రాజకీయ ప్రాబల్యం, అధికార యోగంతో పాటు సంపద ఊహించని స్థాయిలో వృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. గృహ, వాహన యోగాలు తప్పకుండా కలుగుతాయి.

కన్య: ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే తత్వంతో పాటు, ఏ రంగంలోనైనా ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న ఆకాంక్ష కలిగిన ఈ రాశివారికి శుక్ర, గురు, కుజ గ్రహాలతో పాటు, రాశ్యధిపతి బుధుడు, రాహువు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల అత్యధికంగా సంపద పెరిగే అవకాశం ఉంది. మహా భాగ్య యోగం, ధన ధాన్య సమృద్ధి యోగం, మహాలక్ష్మీ యోగం వంటివి కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. షేర్లతో సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.

తుల: ఆర్థిక విషయాల్లోనే కాక, వ్యాపారపరంగా కూడా ఎంతో సామర్థ్యం కలిగిన ఈ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడితో పాటు శని, రాహు, కుజ, బుధ, గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రాశికి హంస, మాలవ్య మహా పురుష యోగాలు కూడా కలుగుతున్నందువల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు, వృత్తి, వ్యాపారాల్లో అత్యధిక రాబడి వంటివి తప్పకుండా కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి లాభాలు కలుగుతాయి.

ధనుస్సు: భారీ ఆశయాలు, ఆకాంక్షలు, ఆశలు కలిగి ఉండే ఈ రాశివారికి మనసులోని కోరికల్లో చాలావరకు నెరవేరుతాయి. రాశ్యధిపతి గురువు ఉచ్ఛలో ఉండడం, బుధ, శుక్ర, రవి, రాహువులు అనుకూలంగా ఉండడం వల్ల వీరి కలలన్నీ సాకారమవుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల, సొంత ఇల్లు, వాహనం కలిగి ఉండాలన్న కల తప్పకుండా నెరవేరుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి వెళ్లడం జరుగుతుంది.



