- Telugu News Photo Gallery Spiritual photos Mars Mercury Conjunction: Wealth and Career Gains for 6 Zodiac Signs Details in Telugu
Wealth Astrology: కుజ, బుధ గ్రహాల యుతి.. వచ్చే నెల రోజులు ఈ రాశుల వారిదే హవా!
గ్రహ సంచారంలో కుజ, బుధ గ్రహాలు కలిసే పక్షంలో కొన్ని రాశుల వారిలో దూరదృష్టి వృద్ధి చెందడం, ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం, అనుకున్నవి సాధించడం వంటివి జరుగుతాయి. ఈ రెండు గ్రహాల యుతి వల్ల విపరీతంగా పట్టుదల పెరుగుతుంది. ఈ నెల(అక్టోబర్) 28 నుంచి నవంబర్ 23 వరకు వృశ్చిక రాశిలో ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడం జరుగుతోంది. ఇందులో కుజుడికి ఈ రాశి స్వస్థానం కావడం ఒక విశేషం కాగా, వీటిని ఉచ్ఛ గురువు వీక్షించడం మరో విశేషం. దీనివల్ల వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకరం, కుంభ రాశుల వారు వృత్తి, ఉద్యోగాలు, విదేశీ యానం, గృహ, వాహనాలు, ధన సంపాదన వంటి విషయాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.
Updated on: Oct 25, 2025 | 7:14 PM

వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ, బుధులు యుతి చెందడం వల్ల ఈ రాశివారికి రాజయోగాలతో పాటు ధన యోగాలు కూడా కలిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం తప్పకుండా జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించిన లాభాలనిస్తాయి. రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు.

కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ, బుధుల సంచారం వల్ల ఈ రాశివారు వృత్తి, వ్యాపారాల్లో ఊహిం చని లాభాలు గడిస్తారు. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆస్తిపాస్తుల్ని సంపా దించుకుంటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారు తప్పకుండా విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి.

సింహం: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో కుజ, బుధులు కలవడం వల్ల గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో గృహ ప్రవేశం, పెళ్లి వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది.

తుల: ఈ రాశివారికి ధన స్థానంలో కుజ, బుధులు కలవడం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు లాభాలనిస్తాయి. కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో అంచనాలను మించి రాబడి పెరుగుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

మకరం: లాభ స్థానంలో లాభాధిపతి కుజుడు, భాగ్యాధిపతి బుధుడు కలవడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఉచ్ఛ స్థితి నుంచి గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి కొద్దిపాటి ప్రయత్నంతో అనుకున్నవన్నీ సిద్ధించే అవకాశం ఉంది. మనసులోని కోరికలను పట్టుదలగా నెరవేర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో తన పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. విదేశీ ఆఫర్లు అందుతాయి.

కుంభం: ఈ రాశివారికి దశమ స్థానంలో ఈ రెండు గ్రహాలు చేరినందువల్ల ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతులు కలుగుతాయి. సమర్థతకు గుర్తింపు లభించి, డిమాండ్ పెరుగుతుంది. లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలను, కోర్టు కేసులు రాజీమార్గంలో పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యలను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.



