వామ్మో.. పుష్ప స్టైల్ నే తలదన్నారుగా!.. కారును ఢీకొడితే గంజాయి పడింది..
అరకు ఘాట్ రోడ్ లో ఒక కారు రయ్యిన మైదానానికి దూసుకొస్తుంది. ఇంతలో దిగువ నుంచి ఘాట్ రోడ్ పైకి వెళ్తుంది ఓ బైక్. ఓ మలుపు వద్ద ఒక్కసారిగా రెండు ఢీకొన్నాయి. బైక్ పై ఉన్న వ్యక్తి కింద పడ్డాడు. కానీ కారులో ఉన్న వాళ్ళు కంగారు పడ్డారు. ఎందుకంటే బైక్ ఢీకొనగానే కారులోంచి.. కొన్ని ప్యాకెట్లు కింద పడ్డాయి. అది కూడా కారు ముందు టైర్ల మధ్య ఇంజన్ కింద నుంచి. అందరూ అవాక్కయ్యేంత పని అయింది. ఆదివారం.. తెల్ల తెల్లవారుతుండగా జరిగిన ఈ ఘటన అనంతగిరి ఘాట్రోడ్లో తీవ్ర కలకలం సృష్టించింది.
అరకు ఘాట్ రోడ్ లో ఒక కారు రయ్యిన మైదానానికి దూసుకొస్తుంది. ఇంతలో దిగువ నుంచి ఘాట్ రోడ్ పైకి వెళ్తుంది ఓ బైక్. ఓ మలుపు వద్ద ఒక్కసారిగా రెండు ఢీకొన్నాయి. బైక్ పై ఉన్న వ్యక్తి కింద పడ్డాడు. కానీ కారులో ఉన్న వాళ్ళు కంగారు పడ్డారు. ఎందుకంటే బైక్ ఢీకొనగానే కారులోంచి.. కొన్ని ప్యాకెట్లు కింద పడ్డాయి. అది కూడా కారు ముందు టైర్ల మధ్య ఇంజన్ కింద నుంచి. అందరూ అవాక్కయ్యేంత పని అయింది. ఆదివారం.. తెల్ల తెల్లవారుతుండగా జరిగిన ఈ ఘటన అనంతగిరి ఘాట్రోడ్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఘాట్ పైనుంచి సిల్వర్ కలర్ కారు కిందకు దిగుతుంది. కారు నెంబరు UA 07 T 3376. అందులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వీకెండ్ కదా ఎవరో టూరిస్టులు అనుకున్నారు. కారు నెంబర్ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రానిది కాబట్టి.
బైక్ ఢీకొంటే గుట్టు బయటపడింది.. ఈ లోగా ఓ గిరిజన యువకుడు బైక్ పై ప్రయాణిస్తూ.. ఘాట్ రోడ్డు లో వెళ్తున్నాడు. అనంతగిరి పోలీస్ స్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి ఒక మలుపు ఉంది. ఆ సమయంలో ఆ కారు స్పీడ్ పెంచింది. మలుపు వద్దకు వచ్చేసరికి బైకు కారు ఢీకొన్నాయి. బైకు కింద పడింది.. కారు ముందు భాగం కుడి వైపు కాస్త ధ్వంసం అయింది. కానీ ఢీకొన్న వెంటనే.. కారు ఇంజన్ కింద భాగం నుంచి కొన్ని ప్యాకెట్లు రోడ్డుపై పడ్డాయి. కానీ కారులో ఉన్న వాళ్ళు బయటకు దిగలేదు. స్థానికులు వచ్చి ప్రశ్నించిన విన్నకుండిపోయారు. చివరకు చూస్తే అవి గంజాయి ప్యాకెట్లు. పోలీస్ స్టేషన్కు కూతబెట్టి దూరంలోనే జరిగిన ఈ ఘటనతో పాస్ స్మగ్లర్ల బండారం బయటపడింది.
పుష్ప స్టైల్ ను తలదన్నే రీతిలో..! గంజాయి తరలించేందుకు.. మత్తు ముఠాల ఐడియాలు మామూలుగా లేవు. ఒక్కొక్కరూ ఒక్క విధంగా సరిహద్దులు దాటించేస్తున్నారు. గంజాయి తరలించేందుకు ఒకరు వాహనంలో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసుకుంటే.. మరి కొంతమంది వేర్వేరు లోడుల్లో మధ్యలో పెట్టి గంజాయి ఎత్తుకెళ్తున్నారు. తాజాగా అనంతగిరి ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదంతో గంజాయి స్మగ్లింగ్ గుట్టు బయటపడింది. ఈ వ్యవహారం చూసి పోలీసులు కంగుతిన్నారు. కారు అంతా మామూలుగానే ఉంది.. కానీ ముందు భాగంలో రెండు టైర్ల మధ్య, ఇంజన్ దిగువ భాగంలో గంజాయి ప్యాకెట్లను పెట్టి గుట్టు చప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. ‘ ప్రస్తుతానికి కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నాం. దీని వెనుక ఇంకా ఎవరు ఉన్నారని దానిపై ఆరాతీస్తున్నాం ‘ అని టీవీ9 తో చెప్పారు అనంతగిరి ఎస్సై రాము.
చూశారుగా ఏ స్టైల్ లో గంజాయి తరలిపోతుందో..?! అల్లూరు ఏజెన్సీలో దాదాపుగా గంజాయి పంటను పండించకుండా అధికారులు ప్రత్యేక చొరవ చూపారు. కాకపోతే ఒడిస్సాలో పండే గంజాయిని.. అల్లూరి ఏజెన్సీ రూట్లలో మార్గాన్ని ఎంచుకుని తరలించకపోతున్నారు స్మగ్లర్లు. ప్రమాదం జరిగింది కాబట్టి గంజాయి గుట్టు బయటపడింది.. లేకుంటే..?!