AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drought Politics: కరువు చుట్టే రాజకీయం.. దూకుడు పెంచిన ప్రతిపక్షాలు.. ధీటుగా అధికార పార్టీ ఎదురుదాడి!

పార్లమెంటు ఎన్నికల వేళా కరువు చుట్టే రాజకియం తిరుగుతుంది. బీఅర్ఎస్ అధినేత పోలం‌బాట పేరుతో రైతుల దగ్గరికి వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ‌బండి సంజయ్ కుమార్ రైతు దీక్ష పేరుతో అందోళన నిర్వహించారు. బీఅర్ఎస్ రైతు దీక్ష పేరుతో అన్ని నియోజక వర్గాలలో నిరసన కార్యక్రమాలు చేబట్టింది. అయితే ఎన్నికల వేళా ప్రతిపక్షాలు ఇలాంటి డ్రామాలు చేస్తున్నాయని అధికార పార్టీ ఎదురు దాడికి దిగుతోంది.

Drought Politics:  కరువు చుట్టే రాజకీయం.. దూకుడు పెంచిన ప్రతిపక్షాలు.. ధీటుగా అధికార పార్టీ ఎదురుదాడి!
Kcr Uttam Bandi
G Sampath Kumar
| Edited By: |

Updated on: Apr 07, 2024 | 1:55 PM

Share

ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల వేళా కరువు చుట్టే రాజకియం తిరుగుతుంది. బీఅర్ఎస్ అధినేత పోలం‌బాట పేరుతో రైతుల దగ్గరికి వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ‌బండి సంజయ్ కుమార్ రైతు దీక్ష పేరుతో అందోళన నిర్వహించారు. బీఅర్ఎస్ రైతు దీక్ష పేరుతో అన్ని నియోజక వర్గాలలో నిరసన కార్యక్రమాలు చేబట్టింది. అయితే ఎన్నికల వేళా ప్రతిపక్షాలు ఇలాంటి డ్రామాలు చేస్తున్నాయని అధికార పార్టీ ఎదురు దాడికి దిగుతోంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు అదే స్థాయిలో రాజకీయ వేడి సెగలు పుట్టిస్తోంది. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడిన కొద్ది‌ ప్రతిపక్షాలు కరువు గురించే మాట్లాడుతున్నాయి. అయితే పకృతి కారణంగానే కరువు ఏర్పడినదని ధీటైనా సమాధానం ఇస్తోంది ‌కాంగ్రెస్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఅర్ ఉమ్మడి ‌కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. సాగునీరు లేక ఎండిపోయిన పంట పొలాలని పరిశీలించారు. రైతులను ఓదార్చారు. ప్రతిచోట కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపైనా విమర్శలు ‌చేశారు కేసీఆర్.

ఇక బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ ఎంపీ‌ కార్యాలయంలో రైతు దీక్ష ‌చేబట్టారు. గత‌ ప్రభుత్వం బీఅర్ఎస్ ‌పైనా ప్రస్తుత కాంగ్రెస్ ‌ప్రభుత్వం పైనా విమర్శలు చేశారు. కేసీఆర్ కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కూడా రైతులకి ఇచ్చిన హామీలని అమలు చేయడం లేదని ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరు ‌నేతలు కాంగ్రెస్ ‌తీరుపైనా విమర్శలు చేస్తూ రైతుల దగ్గరకి వెళ్తున్నారు.

ఇక సిరిసిల్లలో కేసీఆర్ గంటపాటు మీడియా ‌సమావేశం నిర్వహించారు. మూడు నెలల కాంగ్రెస్ పాలనపైనా నిప్పులు చెరిగారు. త్రాగు, సాగు నీటి సమస్యలను ‌పరిష్కరించడంలో చిత్తశుద్ధి కరువైందని విమర్శలు చేశారు. గంట మీడియా సమావేశంలో త్రాగు, సాగునీరు సమస్యలను ప్రస్తావించారు. రైతాంగం కష్టాలను గుర్తు చేశారు. ఈ‌ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతారని అయన అన్నారు.

ఈ నేపథ్యంలోనే బీజేపీ, బీఅర్ఎస్ కరువును రాజకీయం చేస్తున్నాయని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రకృతి ఓ వైపు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతోనే రాష్ట్రంలో కరవు కారణంగా సాగునీటి సమస్యలు ఎర్పడినట్లు గుర్తు చేస్తున్నారు. అయితే సాధ్యమైనంత వరకు సాగునీటిని‌ అందించి పంట పొలాలని‌ కాపాడుతున్నామని ఎదురుదాడికి దిగుతున్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఅర్ ప్రసంగం అంతా పచ్చి అబద్దాలని, ప్రజలని మోసం చేసే విధంగా ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం పెట్టిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాల తీరుపై విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికలని దృష్టిలో పెడ్టుకొనే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. మొత్తానికి పార్లమెంటు ‌ఎన్నికల ముందు కరువు‌ అంశమే ప్రధాన ప్రచార అస్త్రంగా‌ మారింది. ఈ మూడు పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో సమ్మర్‌లో మరింత హీట్ పెంచారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…