AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ నాలుకలోనే మీ ఆరోగ్య రహస్యాలు.. ఆ రంగులు ఈ ప్రమాదకర వ్యాధులకు సంకేతం..

మీ నాలుక రంగు మీ అంతర్గత ఆరోగ్యం గురించి చాలా విషయాలు చెబుతుంది. గులాబీ రంగు ఆరోగ్యకరమైన నాలుకను సూచిస్తే, తెల్లటి పూత, ఎరుపు, పసుపు, ఊదా లేదా ముదురు రంగులు వివిధ ఆరోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చు. విటమిన్ లోపాలు, ఇన్ఫెక్షన్లు, కామెర్లు లేదా గుండె సంబంధిత సమస్యలను నాలుక రంగు మార్పులు ప్రతిబింబిస్తాయి.

మీ నాలుకలోనే మీ ఆరోగ్య రహస్యాలు.. ఆ రంగులు ఈ ప్రమాదకర వ్యాధులకు సంకేతం..
Tongue Color Says About Your Health
Krishna S
|

Updated on: Dec 19, 2025 | 7:27 AM

Share

మనం ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లినప్పుడు వైద్యులు మొదట మన నాలుకను చూపించమని అడుగుతారు. ఎందుకంటే, మన శరీరంలోని అంతర్గత ఆరోగ్య స్థితిని ప్రతిబింబించే అద్దం వంటిది మన నాలుక. సాధారణంగా ఆరోగ్యవంతుల నాలుక గులాబీ రంగులో, కొద్దిగా తేమగా ఉంటుంది. అయితే ఈ రంగులో మార్పులు వస్తే అవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏ రంగు ఏ వ్యాధికి సంకేతం?

తెల్లటి పూత: నాలుకపై తెల్లటి పొరలా ఏర్పడితే అది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడాన్ని సూచిస్తుంది. పిల్లలు, వృద్ధులు, మధుమేహం లేదా ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కోసారి యాంటీబయాటిక్స్ వాడకం వల్ల కూడా ఇలా జరగవచ్చు.

ఎర్రటి నాలుక: నాలుక మరీ ఎర్రగా ఉంటే అది శరీరంలో విటమిన్ బి-12 లోపాన్ని లేదా తీవ్రమైన జ్వరాన్ని సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

పసుపు రంగు: నాలుక పసుపు రంగులోకి మారితే అది కామెర్లు లేదా మధుమేహానికి ప్రాథమిక సంకేతం కావచ్చు. నోటి పరిశుభ్రత లోపించడం వల్ల కూడా ఇలా జరుగుతుంది.

ఊదా రంగు: నాలుక ఊదా రంగులో కనిపిస్తే అది గుండె సంబంధిత సమస్యలు లేదా శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగడం లేదని అర్థం.

ముదురు రంగు లేదా నలుపు: బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ధూమపానం, మాదకద్రవ్యాల వ్యసనం ఉన్నవారిలో నాలుక ముదురు రంగులోకి మారుతుంది.

గోధుమ రంగు: నాలుక గోధుమ రంగులో ఉంటే అది శరీరంలో ఐరన్ లోపాన్ని సూచిస్తుంది.

నారింజ రంగు: నోరు పొడిబారడం, అపరిశుభ్రత వల్ల నాలుక నారింజ రంగులో కనిపిస్తుంది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

నాలుక రంగులో మార్పు అనేది కేవలం తాత్కాలికం కావచ్చు. కానీ ఈ క్రింది లక్షణాలు ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకూడదు..

  • నాలుక రంగు మార్పు రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగడం.
  • రంగు మార్పుతో పాటు జ్వరం, గొంతు నొప్పి లేదా కడుపు నొప్పి ఉండటం.
  • నాలుకపై వింతైన మచ్చలు లేదా నొప్పి కలగడం.

జీర్ణ సమస్యలు, అధిక ఒత్తిడి, కొన్ని రకాల క్యాన్సర్ల లక్షణాలు కూడా నాలుకపైనే మొదట కనిపిస్తాయి. అందుకే ప్రతిరోజూ పళ్లు తోముకునే సమయంలో నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా అసాధారణ మార్పు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ నాలుకలోనే మీ ఆరోగ్య రహస్యాలు.. ఆ రంగులు ఈ ప్రమాదకర వ్యాధులకు..
మీ నాలుకలోనే మీ ఆరోగ్య రహస్యాలు.. ఆ రంగులు ఈ ప్రమాదకర వ్యాధులకు..
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?