Gold: 2026లో బంగారం ధర ఎంత ఉంటుందో తెలుసా..? అసలు విషయం తెలిస్తే షాకే..
బంగారం ధరలు బ్రేకులు లేకుండా దూసుకపోతున్నాయి. కరెన్సీ విలువ తగ్గడం, ఆర్థిక అనిశ్చితి, బ్యాంకుల కొనుగోళ్లు వంటివి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు. ఇది పెట్టుబడిదారులకు లాభం చేకూర్చినా, సామాన్యులకు మాత్రం పెనుభారంగా మారుతుంది. 2026 నాటికి తులం బంగారం రూ. 2 లక్షలకు చేరుకుంటుందా..? అనేది తెలుసుకుందాం..

బంగారం ధరల పెరుగుదలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. బంగారం ధరలు చూసి బాబోయ్ అనుకుంటున్న వారికి.. రాబోయే రోజుల్లో మరింత షాక్ తగిలేలా ఉంది. 2025లోనే రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు.. 2026 నాటికి తులం రూ. 2 లక్షల మార్కును తాకవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బంగారం మార్కెట్‌ను పర్యవేక్షించే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ డేవిడ్ టైట్ పసిడి ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు విపరీతంగా పెరగబోతున్నాయని, అది భారత మార్కెట్‌పై కూడా భారీ ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో 10 గ్రాముల బంగారం సుమారు రూ. 1.35 లక్షల వద్ద ఉంది. వచ్చే ఏడాది నాటికి ఇది రూ. 1.90 లక్షల నుండి రూ. 1.92 లక్షలకు చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం ప్రపంచమార్కెట్‌లో ఔన్సు బంగారం 4,333 డాలర్లుగా ఉంది. ఇది రానున్న రోజుల్లో 6వేలకు చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు.
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
బంగారం ధర పెరగడానికి కేవలం పెళ్లిళ్ల సీజన్ మాత్రమే కారణం కాదు, దీని వెనుక కొన్ని బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
కరెన్సీల విలువ తగ్గడం: ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల విలువ తగ్గుతుండటంతో అందరూ బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడిగా చూస్తున్నారు.
దేశాల మధ్య గొడవలు: వివిధ దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధాల వల్ల ఆర్థిక అనిశ్చితి నెలకొంది.
బ్యాంకుల కొనుగోళ్లు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద బ్యాంకులు తమ దగ్గర బంగారం నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి.
అగ్రరాజ్యాల అప్పులు: అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు భారీ అప్పుల్లో ఉండటం కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణం.
పెట్టుబడిదారులకు పండగే.. కొనుగోలుదారులకు భారమే
బంగారం ధరలు ఇలాగే పెరుగుతూ పోతే, ఇప్పటికే బంగారం కొని పెట్టుకున్న వారికి అది భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. కానీ ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మాత్రం ఇది పెను భారంగా మారనుంది. రల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాలే నిజమైతే, భవిష్యత్తులో బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








