AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నువ్వు సూపర్ రా బుడ్డోడా.. మెట్రోలో ఈ పిల్లాడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

మెట్రోలో కూల్ డ్రింక్ కిందపడినప్పుడు, ఒక చిన్నారి ఏడవకుండా, తన బ్యాగ్ నుండి టిష్యూ తీసి స్వయంగా తుడిచాడు. ఈ బాధ్యతాయుతమైన ప్రవర్తనను చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో వైరల్ అవ్వగా నెటిజన్లు ఆ పిల్లాడి విలువలను, తల్లిదండ్రుల పెంపకాన్ని ప్రశంసిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా బాధ్యతను నిరూపించిన ఈ చిన్నారి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఈ వీడియోను మీరూ చూడండి..

Viral Video: నువ్వు సూపర్ రా బుడ్డోడా.. మెట్రోలో ఈ పిల్లాడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా..
Young Boy Wins Hearts
Krishna S
|

Updated on: Dec 18, 2025 | 5:08 PM

Share

మంచి విలువలు అనేవి మాటల్లో చెబితే వచ్చేవి కావు, అవి మన ప్రవర్తనలో కనిపిస్తాయని ఒక చిన్నారి నిరూపించాడు. సాధారణంగా మెట్రో వంటి బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా వస్తువు కింద పడినా లేదా జారిపోయినా చాలామంది చూసీచూడనట్లు వెళ్లిపోతారు. కానీ ఈ బుజ్జాయి మాత్రం పెద్దలకు సైతం ఆదర్శంగా నిలిచి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్న బాలుడు మెట్రోలో ప్రయాణిస్తున్నాడు. అయితే అనుకోకుండా అతని చేతిలోని కూల్ డ్రింక్ బాటిల్ కింద పడిపోయింది. దీంతో డ్రింక్ కింద పడి అంతా తడిగా మారింది. సాధారణంగా ఇలాంటి సమయంలో ఏ పిల్లవాడైనా భయపడటం లేదా ఏడవడం చేస్తాడు. కానీ ఈ బాబు అలా చేయలేదు.

నెటిజన్లను ఆకట్టుకున్న ఆ చిన్న చర్య

డ్రింక్ కింద పడగానే ఏమాత్రం తడబడకుండా, ఆ అబ్బాయి తన బ్యాగ్ నుంచి ఒక టిష్యూ పేపర్‌ను బయటకు తీశాడు. వెంటనే నేలపై వంగి, తాను పారబోసిన డ్రింక్‌ను స్వయంగా తుడిచాడు. మెట్రోలో ఉన్న ఇతర ప్రయాణికులు ఈ సీన్ చూసి ఆశ్చర్యపోయారు. ఈ చిన్న వయసులోనే ఇంత బాధ్యతగా వ్యవహరించడం చూసి వారు మురిసిపోయారు. దీనిని ఎవరో కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది.

ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “సంస్కారం అంటే ఇదే.. తల్లిదండ్రుల పెంపకం ఆ బాబు ప్రవర్తనలో కనిపిస్తోంది” అని ఒకరు కామెంట్ చేయగా.. బాధ్యత అనేది వయసుతో సంబంధం లేనిదని ఈ అబ్బాయి నిరూపించాడు అంటూ అని మరొకరు రాసుకొచ్చారు. ఈ సంఘటన ఏ నగరంలో జరిగిందో స్పష్టంగా తెలియనప్పటికీ, ఆ పిల్లాడి విలువలు మాత్రం దేశ సరిహద్దులు దాటి అందరికీ ఒక గొప్ప పాఠాన్ని నేర్పించాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి