Actress : తండ్రిలా అనుకున్నా.. లిప్ లాక్ కోసం ట్రై చేశాడు.. దర్శకుడిపై హీరోయిన్ సంచలన కామెంట్స్..
క్యాస్టింగ్ కౌచ్.. సినీరంగంలో ఎక్కువగా వినిపించే పదం. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తొలినాళ్లల్లో ఎంతో మంది హీరోయిన్లు, మహిళలు వేధింపులు ఎదుర్కున్నామని పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఇప్పటికే చాలా మంది మహిళలకు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఇప్పుడు ఓ హీరోయిన్ సైతం ఊహించని కామెంట్స్ చేసింది.

సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ అనే మాటను ప్రతిసారీ వింటుంటాం. ఇండస్ట్రీలో నటీమణులుగా అలరించాలనుకున్న చాలా మంది మహిళలు కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యులలో కొందరు హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా ఓ హీరోయిన్ సైతం దక్షిణాది దర్శకుడిపై సంచలన కామెంట్స్ చేసింది. అతడిని తండ్రిలా భావించానని.. కానీ అతడు మాత్రం తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. ఆమె మరెవరో కాదు.. టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి బాలీవుడ్ బ్యూటీ మాల్టీ చాహర్. ఇటీవలే హిందీలో బిగ్ బాస్ సీజన్ 19లో పాల్గొంది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాల్టీ మాట్లాడుతూ.. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని తెలిపింది.
సినిమా అవకాశం కోసం ఓ దక్షిణాది దర్శకుడు అతడి హోటల్ గదికి రమన్నాడని తెలిపింది. ఒక ఆఫీస్ మీటింగ్ లో మాట్లాడి వెళ్లిపోయే ముందుకు అతడికి సాధారణ హగ్ ఇవ్వాలని భావించానని.. కానీ అతడు తనను ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేశాడని తెలిపింది. ఆ సమయంలో తనకు అసౌకర్యంగా అనిపించిందని.. వెంటనే అతడిని అడ్డుకుని అతడితో అన్ని సంబంధాలను తెంచుకున్నానని.. తండ్రిలా భావించిన వ్యక్తి… తనతో అలా ప్రవర్తించడం ఊహించలేదని తెలిపింది. ఆ సంఘటన తనకు ఒక గుణపాఠం నేర్పిందని… ఎవరినీ ఉన్నత స్థానం ఉంచవద్దని అన్నారు. మహిళలు అవకాశాల కోసం ఇలాంటి వాటికి అంగీకరించవద్దని అన్నారు. మనపై మనకు నియంత్రణ ఉండాలని తెలిపారు.
మాల్టీ చాహర్.. 2018 లో డైరెక్టర్ అనిల్ శర్మ దర్శకత్వం వహించిన జీనియస్ సినిమాతో హిందీ సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇందులో రూబీనా పాత్రలో కనిపించింది. ఆ తర్వాత 2022లో ఇష్క్ పాష్మినా సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె పలు వాణిజ్య ప్రకటనలు చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఏదోక పోస్ట్ చేస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..



