Andhra: బూచోళ్లున్నారు.. పిల్లలు జాగ్రత్త.. మళ్లీ ఫ్రేమ్‌లోకి సరోజిని అండ్ గ్యాంగ్
బూచోళ్లున్నారు.. పిల్లలు జాగర్త.. సరోజా మళ్లీ గ్యారెజీ ఓపెన్ చేసింది. శిశు క్రయ విక్రయాల దందాలో ఆరితేరిన బెజవాడ బేకార్ బ్యాచ్ మళ్లీ ఖాకీలకు చిక్కింది. ఇదర్ కా మాల్ ఉదర్ అన్నంత ఈజీగా పొరుగు రాష్ట్రాల్లో చిన్నారులను ఎత్తుకొచ్చి..కొనుక్కొచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. లేటెస్ట్‌గా సరోజా సహా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు.

Child Trafficking Gang
చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌కు విజయవాడ పోలీసులు చెక్ పెట్టారు. 10మంది నిందితులను అరెస్ట్ చేసి ఐదుగురు శిశువులను రెస్క్యూ చేశారు. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి..అమ్మ ఒడిలో ఉండాల్సిన పసిబిడ్డలను అంగడి సరుకులుగా మార్చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఈ తెగులు మరీ ఎక్కువైపోతోంది. కుదిరితే డీల్.. లేదంటే కిడ్నాప్… అన్నట్టుగా ఆస్పత్రుల దగ్గర అంతర్ రాష్ట్ర ముఠాలు పసిపిల్లలను ఎత్తుకెళ్లి విక్రయిస్తున్నారు. పిల్లలు లేని దంపతులను టార్గెట్ చేసుకొని శిశు విక్రయాలకు పాల్పడుతోన్న సరోజిని అండ్‌గ్యాంగ్ మళ్లీ ఫ్రేమ్‌లోకి వచ్చింది. నార్త్ ఇండియాలో చిన్నారులను కిడ్నాప్ చేసి ఇక్కడ అమ్ముతున్నట్లు తేల్చారు.
కింగ్ పిన్ సరోజ సహా గరికమొక్క విజయలక్షి, వాడపల్లి బ్లెస్సి, ముక్తిపేట నందిని, ఎస్ కే బాబావలికి చెక్ పెట్టాయి టాస్క్ ఫోర్స్ టీమ్స్. ఓ చిన్నారిని విక్రయిస్తుండగా నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శిశవును ఐసీడీఎస్ సెంటర్‌కు తరలించారు. ఇక సరోజ సహా నిందితులను భవానీపురంపోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిప్పకూడు తిన్నా సరే చిన్నారులను అమ్మి సొమ్ము చేసుకోవడంలో సరోజిని గ్యాంగ్‌కు ఏమాత్రం బుద్ది రాలేదు. గతేడాది తెలంగాణ పోలీసులు సరోజిని బ్యాచ్ ఆగడాలను బ్రేక్ చేశారు. విజయవాడకు చెందిన సరోజిని..పిల్లలను అమ్మి సొమ్ము చేసుకోవడమే బిజినెస్‌గా పెట్టుకుంది. ఏపీ , తెలంగాణ , మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్‌పై కేసులున్నాయన్నారు ఏపీ పోలీసులు. లక్ష రూపాయిల చొప్పన శిశువును కొని.. 4 లక్షల వరకు విక్రయించే వారని విజయవాడ పోలీసులు గతంలో తేల్చారు.
మహిళ అయివుండి మరో అమ్మకు కడుపుకోత పెడుతోన్న సరోజా ఎందుకు ఈదందాను చేపట్టింది. పాపిష్టి డబ్బు కోసం సరోజాతో చేతులు కలిపిన వాళ్లు ఇంకెందరు? జైలులో చిప్పకూడు తిన్నాసరే సరోజిని అండ్ గ్యాంగ్ మళ్లీ శిశు విక్రయాలకు బరితెగించడం కలకలం రేపుతంది. లాభసాటి యాపారమనే ఇంత బరితెగింపా? లేదంటే ఈ ముఠా ను అంతగా సపోర్ట్ చేసే మరో మాపియా వుందా? జస్ట్ బర్న్ బేబేస్‌ను చాక్లెట్లలా అమ్మకానికి పెడుతున్నారంటే..ఈ తెగింపు వెనుక మరో నెట్‌వర్క్ వుందా? ఆసుపత్రుల్లో ఇంటి దొంగలు.. ఫర్జిలిటి సెంటర్ల లింకులున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సరోజిని ఫ్రమ్ బెజవాడ. శిశు విక్రాయలను ఓ గ్యారేజీలా నిర్వహిస్తోన్న మాయలేడి. పిల్లలు లేని దంపతులే ఈ ముఠా టార్గెట్. అమ్మాయి కావాలా? అబ్బాయి కావాలా? రాయబారం మొదలు పెడుతారు. పండంటి బిడ్డను తెచ్చి ఇస్తాం..కాకపోతే కర్చుకు వెనుకాడొద్దంటారు. అబ్బాయికి ఓ రేటు..అమ్మాయి కావాలంటో మరో రేటు ఫిక్స్ చేస్తారు. మూడో కంటికి తెలియకుండా డీల్ జరిగిపోతుందని నమ్మిస్తారు. వీళ్ల మాటలు నమ్మి ట్రాప్‌లోపడ్డారంటే.. పిల్లలులేలని లోటు తీరడం మాటేమో కానీ చట్టప్రకారం కఠిన శిక్షలు తప్పవు. సో ఇలాంటి బూచాళ్ల మాటలు నమ్మోద్దు. ఇలాంటి వాళ్లు కన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పిల్లలను దత్తత తీసుకోవాలంటే చట్టబద్దమైన ప్రక్రియలు వున్నాయి. సంబంధిత అధికారులను సంప్రదిస్తే వారు వివరాలు అందిస్తారు. అంతేకానీ పిల్లలపై మక్కువత సరోజా లాంటి 420 బ్యాచ్‌ల మాటలను నమ్మోద్దు.




