AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: వామ్మో.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు ఏకంగా లక్షా 35 వేల మార్క్ దాటి పరుగులు పెడుతున్నాయి.. కొన్నిరోజుల క్రితం తగ్గినట్లే తగ్గిన పసిడి ధరలు.. డాలర్ తో పోలిస్తే.. రూపాయి బలహీనతతో మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి..

Gold Rates: వామ్మో.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
Gold and Silver Rate Today
Shaik Madar Saheb
|

Updated on: Dec 19, 2025 | 6:28 AM

Share

రూపాయి బలహీనత ఎఫెక్ట్‌తో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు ఏకంగా లక్షా 35 వేల మార్క్ దాటి పరుగులు పెడుతున్నాయి.. కొన్నిరోజుల క్రితం తగ్గినట్లే తగ్గిన పసిడి ధరలు.. డాలర్ తో పోలిస్తే.. రూపాయి బలహీనతతో మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. ప్రధానంగా అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా.. పెరుగుతుండటంతో.. దేశీయంగా కూడా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మున్ముందు ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటుందని పేర్కొంటున్నారు. తాజాగా.. గోల్డ్, సిల్వర్ ధరలు పెరిగాయి.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. శుక్రవారం (డిసెంబర్ 19 2025) ఉదయం 6గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 మేర పెరిగి.. రూ.1,34,850 గా ఉంది.

22 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర రూ.10 మేర పెరిగి.. 1,23,610 గా ఉంది.

వెండి కిలో ధర రూ.100 మేర పెరిగి.. 2,11,100 లుగా ఉంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,850, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,23,610 ఉంది. వెండి కిలో ధర రూ.2,24,100 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,34,850, 22 క్యారెట్ల ధర రూ.1,23,610 ఉంది. కిలో వెండి ధర రూ.1,24,100 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,35,000, 22 క్యారెట్ల ధర రూ.1,23,760 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,11,100 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,34,850, 22 క్యారెట్ల ధర రూ.1,23,610 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,11,100 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,35,720, 22 క్యారెట్ల ధర రూ.1,24,410 ఉంది. వెండి కిలో ధర రూ.2,24,100 లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,34,850, 22 క్యారెట్లు రూ.1,23,610 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,11,100 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..