AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒరేయ్ ఆజామూ.! ఇదిరా రివెంజ్ అంటే.. 6 బంతుల్లో కెప్టెన్‌కు ఇచ్చిపడేసిన తోపు బౌలర్.. వీడియో చూశారా.?

AUS Vs ENG: యాషెస్ మూడో టెస్టులో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఆ జట్టు బౌలర్ జోఫ్రా ఆర్చర్ మధ్య జరిగిన గొడవ.. ఆ తర్వాత ఆర్చర్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ అని చెప్పొచ్చు.

ఒరేయ్ ఆజామూ.! ఇదిరా రివెంజ్ అంటే.. 6 బంతుల్లో కెప్టెన్‌కు ఇచ్చిపడేసిన తోపు బౌలర్.. వీడియో చూశారా.?
Ashes Test
Ravi Kiran
|

Updated on: Dec 19, 2025 | 7:12 AM

Share

ప్రత్యర్ధుల పరుగుల వేట కొనసాగుతోంది. మన బౌలర్లు ఏం చేయలేకపోతున్నారని.. జట్టులోని ప్రధాన బౌలర్‌పైనే తిట్ల వర్షం కురిపిస్తే.. అది తిరిగి మనకే వస్తుంది మర్చిపోయినట్టున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్. అడిలైడ్ వేదికగా జరుగుతోన్న యాషెస్ మూడో టెస్టులో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఆ జట్టు బౌలర్ జోఫ్రా ఆర్చర్ మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌండరీలతో చెలరేగి.. అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

ఇది చదవండి: ‘మా దగ్గర డబ్బులు లేవు సర్’.. కట్ చేస్తే.. అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది

ఇవి కూడా చదవండి

ఈ సమయంలో ఆర్చర్ బౌలింగ్‌పై స్టోక్స్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. లైన్ అండ్ లెంగ్త్ సరిగ్గా లేదు.. సరిచేసుకుని సరిగ్గా బౌలింగ్ వేయాలని ఆర్చర్‌కు చెప్పాడు స్టోక్స్. అసలే అంతర్జాతీయంగా మంచి అనుభవమున్న బౌలర్.. అలా అంటే ఊరుకుంటాడా.. ఆ తర్వాత స్టార్క్ వికెట్ పడగొట్టి గట్టిగానే సమాధానమిచ్చాడు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. అటు బంతితోనే కాదు.. ఇటు బ్యాట్‌తోనూ ఆర్చర్ అదరగొట్టాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో కలిసి 9వ వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

స్టోక్స్ 83 పరుగులు చేసి అవుట్ కాగా.. ఆర్చర్ 105 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 పరుగులతో రాణించాడు. కాగా, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియాకు 93 పరుగుల ఆధిక్యం వచ్చింది. అటు మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులకు ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ సెంచరీ(106)తో దుమ్మురేపగా.. ఖవాజా 82 పరుగులు, స్టార్క్ 54 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 5 వికెట్లు పడగొట్టగా.. కార్సే, జాక్స్ తలో రెండు వికెట్లు, టంగ్ ఒక వికెట్ పడగొట్టారు.

ఇది చదవండి: కపిల్‌దేవ్ అంతటివాడవుతాడని అనుకుంటే.. తుస్సుమనిపించి షెడ్డుకెళ్లాడు.. మరి రీ-ఎంట్రీ ఎలా.?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి

కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
తెలివైన వారికే ఈ సవాల్.. సింహంలో దాగిఉన్న చిట్టెలుకను గుర్తిస్తే
తెలివైన వారికే ఈ సవాల్.. సింహంలో దాగిఉన్న చిట్టెలుకను గుర్తిస్తే