గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? మరి ఏ బ్యాంక్‌లో తక్కువ వడ్డీ రేటు ఉందో తెలుసుకోండి!
అత్యవసర సమయాల్లో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం సులభం. వ్యక్తిగత రుణాల కంటే బంగారు రుణాలపై వడ్డీ తక్కువగా ఉంటుంది, సిబిల్ స్కోరు అవసరం లేదు. బంగారం ధరలు పెరిగినందున అధిక నగదు పొందవచ్చు. వడ్డీ రేట్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇవే..

ఏదైనా అత్యవసర అవసరం వస్తే చాలా మంది తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు పొందుతుంటారు. ఇతర లోన్ల కంటే బంగారు రుణాలపై తక్కువ వడ్డీ ఉంటుంది. ఎందుకంటే మన బంగారం బ్యాంక్ వద్ద ఉంటుంది కనుక. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో బంగారం తాకట్టు పెడితే కూడా భారీ మొత్తంలో నగదు వస్తుంది. మరి వీటిపై ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ రేటు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సాధారణంగా పర్సనల్ లోన్స్ బ్యాంకుల్లో 16 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తుంటారు. అదే సమయంలో బంగారం రుణాల పైన వడ్డీ 10 శాతం కన్నా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ రుణం పొందేందుకు మీకు ఎలాంటి సిబిల్ స్కోర్ అవసరం లేదు. అందుకే బంగారు రుణాలను తీసుకునేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 8.05 శాతం నుండి 8.35 శాతం
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): 7.50 శాతం నుండి 9.00 శాతం
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 8.20 శాతం నుండి 11.60 శాతం
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): 8.35 శాతం నుంచి ప్రారంభం
- బ్యాంక్ ఆఫ్ ఇండియా: 8.60 శాతం నుండి 8.75 శాతం
- ఇండియన్ బ్యాంక్: 8.75 శాతం నుంచి ప్రారంభం
- కెనరా బ్యాంక్: 8.75 శాతం నుంచి ప్రారంభం
- బ్యాంక్ ఆఫ్ బరోడా: 9.00 శాతం నుంచి ప్రారంభం
- కోటక్ మహీంద్రా బ్యాంక్: 9.00 శాతం ప్రారంభ రేటు
- ICICI బ్యాంక్: 9.15 శాతం నుండి ప్రారంభం
- HDFC బ్యాంక్: 9.30 శాతం ప్రారంభం
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




