మారిన NPS రూల్స్..! ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ప్రయోజనాలు!
PFRDA జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS) నిబంధనలను మార్చింది. ఇప్పుడు మీరు 85 ఏళ్ల వరకు NPSలో ఉండవచ్చు, వార్షిక కొనుగోలు పరిమితి 20 శాతానికి తగ్గింది. సిస్టమాటిక్ యూనిట్ రిడంప్షన్ ( SUR) అనే కొత్త ఉపసంహరణ సౌకర్యం ప్రవేశపెట్టారు.

పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ PFRDA జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS) నియమాలలో గణనీయమైన మార్పులు చేసింది. మీరు ఇప్పుడు 85 సంవత్సరాల వయస్సు వరకు NPS పథకంలో ఉండవచ్చు. అలాగే వార్షిక కొనుగోలు పరిమితి (పెన్షన్ పథకం) 20 శాతానికి తగ్గించారు. సిస్టమాటిక్ యూనిట్ రిడంప్షన్ (SUR) అనే కొత్త సౌకర్యం ప్రవేశపెట్టారు. ఈ మార్పులు ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగులు, NPS లైట్ చందాదారులకు వర్తిస్తాయి.
NPSలో ఉండటానికి గరిష్ట వయస్సును ప్రభుత్వం 75 నుండి 85కి పెంచారు. మీరు మీ డబ్బును 85 సంవత్సరాల వయస్సు వరకు ఉంచుకోవచ్చు. ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఇప్పుడు వారి మొత్తం నిధులలో కనీసం 20 శాతం పదవీ విరమణ తర్వాత లేదా కొన్ని పరిస్థితులలో యాన్యుటీలను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. గతంలో మీ నిధి రూ.5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే మీరు యాన్యుటీలను కొనుగోలు చేయడానికి మీ నిధులలో కనీసం 40 శాతం ఉపయోగించాల్సి ఉండేది.
రూ.8 లక్షల వరకు డిపాజిట్లకు మినహాయింపు
మొత్తం నిధి రూ.8 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే మీరు ఒకేసారి మొత్తం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు తమ నిధిలో 40 శాతం వరకు యాన్యుటీలలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ప్రైవేట్ ఉద్యోగులు తమ నిధిలో కనీసం 20 శాతం యాన్యుటీల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది (మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోకుంటే)
ప్రభుత్వం సిస్టమాటిక్ యూనిట్ రిడంప్షన్ (SUR) అనే కొత్త విత్‌డ్రా పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇది మ్యూచువల్ ఫండ్ SWP (సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ ) లాంటిది . ఈ సౌకర్యం రూ.8 లక్షల నుండి రూ.12 లక్షల మధ్య నిధులు ఉన్నవారికి మాత్రమే . వారు ఒకేసారి రూ.6 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని SUR ద్వారా వాయిదాలలో విత్‌డ్రా చేసుకోవచ్చు. SUR చందాదారుడు కనీసం 6 సంవత్సరాల పాటు వాయిదాలలో డబ్బును విత్‌డ్రా చేసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




