Hanumakonda: 55 ఏళ్ల చరిత్ర కలిగిన హనుమకొండ – కరీంనగర్ ప్రధాన రహదారి మూసివేత.!
హనుమకొండ-కరీంనగర్ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. 55 ఏళ్లనాడు నిర్మించిన ఈ బ్రిడ్జిపై మూడు నెలలపాటు వాహన రాకపోకలను నిషేధించారు. కొత్త బ్రిడ్జిని నిర్మించేందుకు పాతబ్రిడ్జిని కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకూ ఈ జాతీయ రహదారిపై రాకపోకలపై నిషేధం విధించి, వాహనాలను దారిమళ్లిస్తున్నారు. నయీంనగర్ నాలా వద్ద 55 ఏళ్ల తర్వాత ఈ కొత్త వంతెన నిర్మాణం కానుంది
నయీంనగర్ నాలా వద్ద 55 ఏళ్ల తర్వాత ఈ కొత్త వంతెన నిర్మాణం కానుంది. దీనికి స్మార్ట్‌సిటీ పథకం ద్వారా రూ.7.40 కోట్లు కేటాయించారు. జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం నుంచి పాత వంతెన కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. దీంతో నాలుగు నెలల పాటు ఈ ప్రధాన రహదారిని మూసేస్తారు. నయీంనగర్ నాలా విస్తరణ, ఇరువైపులా గోడలు నిర్మించే పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఇందులో భాగంగానే నాలా పైన ఉన్న పాత వంతెన తొలగించి, దాని స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మిస్తారు. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రధాన పైపులైను నిర్మాణ పనులు పూర్తయ్యాయి. భారీవరదల సమయంలో ఓరుగల్లు నీటమునిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదముప్పునుండి శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం నయీంనగర్ బ్రిడ్జిని కూల్చివేసి కొత్త వంతెనను నిర్మించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో హనుమకొండ-కరీంనగర్ ప్రధాన రహదారిపై మూడు నెలలుపాటు రాకపోకలపై నిషేధం విధించారు. వాహనాలను దారిమళ్లించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.