AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2025లో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

2025లో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Dec 18, 2025 | 5:15 PM

Share

2025 టాలీవుడ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గతంలో 1000, 500 కోట్ల సినిమాలు అలవోకగా తీసిన టాలీవుడ్, ఈ ఏడాది ఒక్క 500 కోట్ల సినిమాను కూడా చూడలేదు. భారీ అంచనాలతో వచ్చిన ప్యాన్ ఇండియా చిత్రాలు నిరాశపరిచాయి. గేమ్ ఛేంజర్, వార్ 2 వంటివి బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. కన్నడలో కాంతార ఛాప్టర్ 1 వంటి సినిమాలు వందల కోట్లు కొల్లగొట్టగా, తెలుగు సినిమాకు 2025 కలిసి రాలేదు.

ఇండియన్ సినిమాకు 1000 కోట్ల సినిమానే పరిచయం చేసిందే టాలీవుడ్.. ఆ తర్వాత 500 కోట్లు కూడా మనోళ్లకు జుజూబీ అయిపోయింది. అలాంటి టాలీవుడ్‌కు 2025 అస్సలు కలిసిరాలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా 500 కోట్లు కలెక్ట్ చేయలేదు.. అంచనాలతో వచ్చిన సినిమాలేమో చేతులెత్తేసాయి. 2025లో ప్యాన్ ఇండియన్ ఫెయిల్యూర్‌కు కారణమేంటి..? 2022లో ట్రిపుల్ ఆర్ 1000 కోట్లకు పైగా వసూలు చేసింది.. 2023లో సలార్ 500 కోట్ల క్లబ్బులో చేరింది.. 2024లో పుష్ప 2 సినిమా 1800 కోట్లు, కల్కి 2కు 1200 కోట్లు, దేవర సినిమాకు 500 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. మరి 2025 తెలుగు ఇండస్ట్రీకి ఏమిచ్చింది.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. గత కొన్నేళ్లుగా సాగిన దండయాత్ర ఈ ఏడాది లేదు. మరో 2 వారాలైతే 2026 వచ్చేస్తుంది. కానీ ఈ ఏడాది ప్యాన్ ఇండియన్ సినిమాలకు పెద్దగా కలిసొచ్చిందేం లేదు. భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ దారుణంగా నిరాశ పరిచింది. 500 కోట్ల క్లబ్‌లో చేరుతుందనుకుంటే.. భారీ నష్టాలు తీసుకొచ్చింది. ఇక వార్ 2 కూడా అంతే ఘోరంగా ఫ్లాప్ అయింది. దాంతో టాలీవుడ్‌కు 2025లో 500 కోట్లు కలగానే ఉండిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ 300 కోట్లు వసూలు చేయగా.. ఆ తర్వాత ఓజి సినిమాతో పవన్ కళ్యాణ్ కూడా అదే మ్యాజిక్ చేసారు. ఈ రెండు సినిమాలు మినహాయిస్తే 300 కోట్లు వసూలు చేసిన సినిమా మరోటి లేదు. మిరాయ్, డాకూ మహారాజ్, హిట్ 3 లాంటి సినిమాలు 100 కోట్ల క్లబ్బులో చేరాయి.. కానీ 200 కోట్ల సినిమాలు కూడా ఏం లేవు. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలు 2025లో అస్సలు కనబడలేదు. అది కూడా టాలీవుడ్‌కు మైనస్ అయింది. మరోవైపు కన్నడలో కాంతార ఛాప్టర్ 1 ఏకంగా 853 కోట్లతో 2025 బిగ్గెస్ట్ గ్రాసర్ కాగా.. ఛావా 800 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత సైయ్యారా 560 కోట్లు, కూలీ 518 కోట్లు వసూలు చేసాయి. ధురంధర్ సైతం 500 కోట్ల క్లబ్బులో చేరిపోయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

OG ఎఫెక్ట్.. సుజీత్‌కు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Demon Pavan: అప్పుడు ఇజ్జత్‌ పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు హీరోలా నిలబడ్డాడు

Bharani: గెలవకున్నా పర్లేదు.. ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ దక్కించున్న భరణి

నటిని కిడ్నాప్ చేసిన ఆమె భర్త !! కట్ చేస్తే ??

Emanuel: ఇమ్మాన్యుయేల్ గెలవడం కష్టమేనా ??