AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్‌ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్‌

మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్‌ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్‌

Phani CH
|

Updated on: Dec 16, 2025 | 6:51 PM

Share

కోల్‌కతాలో మెస్సీ పర్యటన గందరగోళంగా మారింది. అభిమానుల కోసం వచ్చిన మెస్సీని నిర్వాహకులు, VIPలు చుట్టుముట్టడంతో భద్రతా లోపం తలెత్తింది. దీంతో మెస్సీ 25 నిమిషాల్లోనే మైదానం వీడారు. టికెట్లు కొని చూడలేకపోయిన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుడు శతద్రు దత్తా అరెస్ట్ కాగా, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఫుట్‌బాల్ దిగ్గజం లయోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటనలో చిరాకు పడ్డారు. నిర్వాహకుల అత్యుత్సాహం, గందరగోళం కారణంగా ఆయన సహనం కోల్పోయారు. దీంతో వేలాది రూపాయలు పెట్టి టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు నిరాశే మిగిలింది. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు మెస్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మైదానంలోకి అడుగుపెట్టగానే, రాజకీయ నేతలు, ప్రముఖులు, భద్రతా సిబ్బందితో సహా వందలాది మంది ఫొటోలు, సెల్ఫీల కోసం ఒక్కసారిగా చుట్టుముట్టారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అధిక ధరలకు టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ, మైదానంలో ఉన్న జనం అడ్డుగా ఉండటంతో తమకు మెస్సి కనిపించడం లేదంటూ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటికే గ్యాలరీలో అశాంతి చెలరేగి, స్టేడియంలోకి బాటిళ్లు విసరడం మొదలుపెట్టారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గమనించిన మెస్సి బృందం వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. దాంతో 25 నిమిషాల్లోనే మెస్సీ మైదానం వీడారు. తమ అభిమాన ఆటగాడిని సరిగా చూడలేకపోయిన ప్రేక్షకులు ఆగ్రహంతో హింసకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ సమయంలో భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, నిర్వాహకుడు శతద్రు దత్తా మరికొంత సేపు ఉండాలని మెస్సిని కోరారు. అయితే, భద్రతాపరమైన అంశాలలో రాజీపడేది లేదని స్పష్టం చేసిన మెస్సి బృందం వారి విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించింది. తన సహచరులు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్‌లతో కలిసి మెస్సి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు మెస్సి మైదానంలో గడిపింది కేవలం 20 నిమిషాలే. ఆ సమయంలో కూడా ఆయన చుట్టూ మంత్రులు, వీఐపీలు, సిబ్బంది ఉండటంతో అభిమానులు ఆయన్ను సరిగా చూడలేకపోయారు. ఈ ఘటన తర్వాత, టికెట్ డబ్బులు వాపసు ఇస్తానని మ్యాచ్ నిర్వాహకుడు శతద్రు దత్తా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, కాసేపటికే దాన్ని తొలగించారు. అనంతరం హైదరాబాద్ వెళ్లేందుకు కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా లోపానికి బాధ్యుడిని చేస్తూ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఇక.. మైదానంలో రభస విషయానికి వస్తే.. మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ మెస్సీ అభిమాని ఏకంగా స్టేడియంలోని కార్పెట్‌ను భుజంపై వేసుకుని ఇంటికి తీసుకెళ్తూ కనిపించాడు. ఎందుకిలా అని రిపోర్టర్ ప్రశ్నించగా, “రూ.10,000 పెట్టి టికెట్ కొన్నాను. కానీ మెస్సీ ముఖం కూడా చూడలేకపోయాను. నాకు కనిపించిందల్లా నాయకుల ముఖాలే. అందుకే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ కార్పెట్ ఇంటికి తీసుకెళ్తున్నా” అని అతగాడు బదులిచ్చాడు. ఆ ఫ్యాన్ వీడియో ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా.. నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌…భారీగా తగ్గిన బంగారం ధరలు

ఆటగాళ్లపై రవీంద్ర జడేజా భార్యసెన్సేషనల్ కామెంట్స్

చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు.. కంట తడి పెట్టిస్తున్న స్టోరీ

దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్‌ వన్‌… కాశీ తర్వాత ఇక్కడే…

వావ్‌.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా