దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్… కాశీ తర్వాత ఇక్కడే…
కదంబ వృక్షాలు హిందూ సంప్రదాయంలో దేవతా స్వరూపాలు. కాశీ తర్వాత త్రిపురాంతకంలోని బాలాత్రిపురసుందరి ఆలయంలో మాత్రమే ఈ వృక్షాలు అధికంగా కనిపిస్తాయి. పార్వతీదేవి, శ్రీకృష్ణుడితో ముడిపడిన ఈ కదంబ వృక్షాలు ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఆలయ నిర్వాహకుల సంరక్షణతో తిరిగి వాటి సంఖ్య పెరిగింది, ధర్మ పరిరక్షణకు చిహ్నంగా నిలిచింది.
హిందూ సంప్రదాయంలో కొన్ని వృక్షాలను దేవతా వృక్షాలుగా భావించి పూజించడం, ఆరాధించడం చేస్తారు. వేప, మర్రి, రావి, మారేడు ఇలా పలు రకాల వృక్షాలను దేవతా స్వరూపంగా భావించి పూజిస్తారు. వీటిలో కదంబ వృక్షం కూడా ఒకటి. ఈ వృక్షాలు కాశీ పుణ్యక్షేత్రం తరువాత ఒక్క త్రిపురాంతకంలోని శ్రీ బాలా త్రిపురసుందరీదేవి ఆలయం ఆవరణలో మాత్రమే ఇవి కనిపిస్తాయి. ఎరుపురంగులో ఉండే కదంబ పూలు దేవతారాధనకు ఎంతో ప్రసిద్ధమైనవి. అంతేకాదు ఈ పుష్పాలు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయిని చెబుతారు. ఈ వృక్షాలను సాక్షాత్తూ పార్వతీదేవి స్వరూపంగా భావించి మహిళలు పూజలు చేస్తారు. కదంబవాసినిగా పేరున్న పార్వతీదేవి ఈ వృక్షాల దగ్గర వనవాసం చేశారని ప్రతీతి. నిత్యం పచ్చగా ఉండే ఈ వృక్షాలను సంరక్షించడం అంటే ధర్మాన్ని పరిరక్షించడమే అని పండితులు చెబుతారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ దేవతా వృక్షాలు ప్రకాశంజిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో ఎక్కువగా కనిపించేవి. కాలక్రమంలో వీటి సంఖ్య తగ్గిపోవడంతో ఆలయ నిర్వాహకులు, పండితులు ఈ వృక్షాలను సంరక్షించడంతో తిరిగి వీటి సంఖ్య పెరిగింది. ఇక్కడి అమ్మవారి ఆలయ చెరువు కట్టపై కదంబ వృక్షాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాశీ పుణ్యక్షేత్రం తర్వాత కదంబ వృక్షాలు త్రిపురాంతకంలోని అమ్మవారి ఆలయ పరిసరాల్లోనే ఉన్నాయని స్థలపురాణాలు, చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారు కదంబవాసిని కావడం వల్లే ఇవి ఎక్కువగా ఇక్కడే కనిపిస్తాయని చెబుతారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడికి కదంబ వృక్షాలంటే ఎంతో ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. రాధాకృష్ణుల ప్రణయగాధలు కూడా ఈ వృక్షాల కిందే ప్రారంభమయ్యాయని చెబుతారు. రాధాకృష్ణులు ఈ చెట్టు కిందే ఎక్కువగా విశ్రాంతి తీసుకునేవారట. లలితసహస్రనామంలో కూడా త్రిపురాంతకం, కాశీ క్షేత్రాల్లో తప్ప మరెక్కడా ఈ కదంబ వృక్షాలు కనిపించవని పేర్కొన్నట్టు పండితులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ.. వైరల్ అవ్వడం కోసం మరీ ఇలా చేస్తావా ??
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

