నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సర్వీస్ సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభంతో దేశంలో ఏవియేషన్ సెక్టార్ మొత్తం అస్థవ్యస్థమైంది. ఇండిగో సంక్షోభంతో చాలా మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానయాన సంస్థ తీరుపై అటు ప్రభుత్వం, ఇటు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సర్వీస్ సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభంతో దేశంలో ఏవియేషన్ సెక్టార్ మొత్తం అస్థవ్యస్థమైంది. ఇండిగో సంక్షోభంతో చాలా మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానయాన సంస్థ తీరుపై అటు ప్రభుత్వం, ఇటు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఇండిగో విమాన సంస్థపై ట్రోల్స్ మొదలయ్యాయి.తాజాగా “ఇండిగో ఆటోరిక్షా” పేరుతో ఒక ఏఐ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వైరల్ వీడియో ప్రకారం.. ఇండిగో ఎయిర్‌లైన్స్ సిగ్నేచర్ బ్లూ-అండ్-వైట్ కలర్ పెయింటింగ్‌తో ఒక ఆటోరిక్షా కనిపిస్తుంది. ఈ ఆటోకు విమానం మాదిరిగా రెక్కలు కూడా ఉన్నాయి. అంతే కాదు ఆ ఆటోను టెయిల్ రడ్డర్, ఇంజన్ వంటి విమాన ఫీచర్లతో కస్టమైజ్ చేసినట్టు కనిపిస్తోంది. ఆ ఆటో రిక్షాలో కూర్చున్న వ్యక్తి.. ఎలాంటి ప్రయాణికులు లేకుండా దాన్ని డ్రైవ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియోలో ఆటో నడుపుతున్న వ్యక్తి థంబ్ సింబల్ చూపిస్తుండటం చూడవచ్చు. అయితే ఈ వీడియో AI-జనరేటెడ్ లేదా ఎడిటెడ్ చేసినదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తన Xలో షేర్ చేస్తూ.. ఇండిగో కొత్త విమానాల సముదాయం, ఈ ఫ్లైట్‌లో డీలేలు ఉండవు, డైవర్షన్స్ ఉండవు.. చాలా చవకైనదికూడా అంటూ క్యాప్షన్ జోడిచారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనాలు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ.. వైరల్ అవ్వడం కోసం మరీ ఇలా చేస్తావా ??
బరువు తగ్గించే ఇంజెక్షన్ ఇండియాకి వచ్చేసిందోచ్..
కొబ్బరి బొండాం పీచును నోటితో వొలిచి.. సత్తా చాటిన మహిళ
Jailer 2: విద్యాబాలన్ రీ-ఎంట్రీ.. పవర్‌ఫుల్ రోల్ లో కనిపించనున్న ముద్దుగుమ్మ
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

