బరువు తగ్గించే ఇంజెక్షన్ ఇండియాకి వచ్చేసిందోచ్..
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒజెంపిక్ ఇంజెక్షన్ ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. మధుమేహ నియంత్రణకు అనుమతించబడినప్పటికీ, బరువు తగ్గించే గుణం వల్ల దీనికి భారీ డిమాండ్ ఉంది. నోవో నార్డిస్క్ విడుదల చేసిన ఈ ఇంజెక్షన్ వారానికి ఒకసారి తీసుకోవాలి. దీని ధర రూ. 8,800 నుండి ప్రారంభమవుతుంది. ఇది గ్లూకోజ్, బరువు నియంత్రణతో పాటు గుండె, కిడ్నీలకు రక్షణనిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా బరువు తగ్గించే ఔషధంగా సంచలనం సృష్టించిన ‘ఒజెంపిక్’ ఇంజెక్షన్ ఇప్పుడు భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నార్డిస్క్ డిసెంబర్ 12 శుక్రవారం ఈ ఔషధాన్ని దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. టైప్ 2 మధుమేహం నియంత్రణ కోసం అధికారికంగా అనుమతి పొందిన ఈ డ్రగ్‌కు, బరువు తగ్గించే గుణం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది. దీని నెల రోజుల డోసు ప్రారంభ ధర రూ. 8,800గా ఉంది. ఒజెంపిక్ అనేది వారానికి ఒకసారి తీసుకునే ఇంజెక్షన్. ఇది 0.25mg, 0.5mg, 1mg డోసుల్లో లభిస్తుంది. నొప్పి లేకుండా సులభంగా ఇంజెక్ట్ చేసుకునేందుకు వీలుగా ‘నోవోఫైన్ నీడిల్స్’ అనే ప్రీ-ఫిల్డ్ పెన్ రూపంలో దీన్ని అందిస్తున్నారు. ప్రారంభ డోస్ అయిన 0.25mg పెన్ ధర రూ. 8,800 కాగా, 0.5mg ధర రూ. 10,170, 1mg ధర రూ. 11,175గా కంపెనీ నిర్ణయించింది. ప్రతి పెన్‌లో నాలుగు వారాలకు సరిపడా డోసులు ఉంటాయి. ఈ సందర్భంగా నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా స్పందిస్తూ… “ఒజెంపిక్‌ను భారత్‌కు తీసుకురావడం ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన క్లినికల్ ఫలితాలతో వస్తున్న ఈ ఔషధం భారతీయ వైద్యులకు ఒక సమర్థవంతమైన చికిత్సా మార్గాన్ని అందిస్తుందన్నారు. సులభంగా వాడే పెన్ ద్వారా మెరుగైన గ్లూకోజ్ నియంత్రణ, బరువు నియంత్రణ, గుండె, కిడ్నీలకు దీర్ఘకాలిక రక్షణ అందించడమే తమ లక్ష్యం అని వివరించారు. అమెరికా ఎఫ్‌డీఏ 2017లో టైప్ 2 డయాబెటిస్ కోసం ఒజెంపిక్‌కు ఆమోదం తెలిపింది. అయితే, ఇది ఆకలిని నియంత్రించగలగడంతో బరువు తగ్గడం కోసం దీని వాడకం విపరీతంగా పెరిగింది. ఇది జీఎల్‌పీ-1 రిసెప్టార్ అగోనిస్ట్‌గా పనిచేస్తూ, మెదడులోని ఆకలి కేంద్రాలపై ప్రభావం చూపుతుంది. మధుమేహంతో సంబంధం ఉన్న గుండె, కిడ్నీ సంబంధిత సమస్యల ముప్పును కూడా తగ్గిస్తుందని నోవో నార్డిస్క్ పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొబ్బరి బొండాం పీచును నోటితో వొలిచి.. సత్తా చాటిన మహిళ
Jailer 2: విద్యాబాలన్ రీ-ఎంట్రీ.. పవర్‌ఫుల్ రోల్ లో కనిపించనున్న ముద్దుగుమ్మ
Thaman: టాలీవుడ్ లో యూనిటీ లేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్
పక్కా ప్లానింగ్ తో ఉన్న భాగ్యశ్రీ, రుక్మిణి.. 2026 మాదే అంటున్న ముద్దుగుమ్మలు
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

