AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు.. కంట తడి పెట్టిస్తున్న స్టోరీ

చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు.. కంట తడి పెట్టిస్తున్న స్టోరీ

Phani CH
|

Updated on: Dec 16, 2025 | 6:14 PM

Share

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో కుమారుడు మహేష్ జిరావాలా మరణానంతరం, గిర్ధర్‌భాయ్‌ అతని వాగ్దానాన్ని నెరవేర్చారు. అప్పులు తీర్చి, కొత్త ఇంటిని కొన్నారు. ఎయిర్‌ ఇండియా పరిహారంగా రూ.1.25 కోట్లు అందిన తర్వాత, మహేష్ కలల ఇంటిని తండ్రి నిర్మించారు. కొడుకు లేని లోటు ఉన్నా, అతని కోరికను తీర్చిన ఈ విషాద గాథ హృదయాలను కదిలిస్తోంది.

అహ్మదాబాద్‌లోని కొత్త ఇంట్లో కూర్చున్న 61 ఏళ్ల గిర్ధర్‌భాయ్‌ జిరావాలా కళ్ల ముందు.. విషాద జ్ఞాపకాలు ఒకేసారి మెదిలాయి. వజ్రాల పాలిషింగ్‌ కార్మికునిగా కష్టపడి జీవితాన్ని నెట్టుకొచ్చిన ఆయన, ప్రస్తుత సొంత ఇంటిని చూస్తున్న ప్రతిసారీ, గుండెలో ఏదో తెలియని భారం నెలకొంటుంది. ఎందుకంటే, అది ఆయన కష్టంతో కొనుక్కున్న ఇల్లు కాదు. అది.. ఆయన పెద్ద కొడుకు మహేష్‌ జిరావాలా మరణానంతరం నెరవేర్చిన వాగ్దానం. ఇదేంటో తెలియాలంటే స్టోరీని జాగ్రత్తగా చూడండి. కొద్ది రోజుల ముందు, గిర్ధర్‌భాయ్‌కి గుండెపోటు వచ్చింది. అప్పటికే కుటుంబంపై ఉన్న అప్పుల భారం, అద్దె ఇంట్లో ఆరుగురు సభ్యుల జీవితం.. ఇవన్నీ ఆయనకు నిద్ర పట్టనివ్వలేదు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళితే.. గిర్ధర్‌భాయ్‌కి కుమారుడు మహేష్. అతడికి 34 ఏళ్లు. సినీ నిర్మాత. అన్నీ తానై తండ్రిని చూసుకునేవాడు. తండ్రి బాధను చూసి తట్టుకోలేక, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ‘నాన్నా! మీరు ఇకపై పనికి వెళ్లొద్దు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి. నా సినిమాల నుంచి మంచి ఆదాయం వస్తుంది, దీపావళి లోపు అప్పులన్నీ తీర్చేసి, కొత్త ఇంటిని కొంటాను’.. అని గట్టిగా మాటిచ్చాడు.కానీ అతని ఆశలు నెరవేరలేదు. జూన్‌ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా ప్రమాదంలో ఆ ప్రాంతంలోని హాస్టల్‌ పక్కన రోడ్డుపై నుంచి వెళ్తున్న మహేష్‌ జిరావాలా ఆ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మహేష్‌ మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. కానీ ఆర్థికంగా ఆ కుటుంబానికి ఒక ఆసరాను కల్పించింది. కుమారుడు వాగ్దానాన్ని తండ్రి నెరవేర్చేలా చేసింది. విమాన ప్రమాదంలో మృతి చెందిన మహేష్ కు పరిహారంగా ఎయిర్‌ ఇండియా, టాటా గ్రూప్‌ నుంచి అతడి కుటుంబానికి రూ.1.25 కోట్లు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహేష్ భార్య హేతల్‌కు పరిహారంగా రూ.4 లక్షలు లభించాయి. మొత్తంగా అందిన రూ.1.29 కోట్ల నుంచి, మహేష్‌ భార్య హేతల్‌ తన వాటా కింద రూ.54 లక్షలు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మిగిలిన రూ.75 లక్షలు గిర్ధర్‌భాయ్‌ చేతికొచ్చాయి. కళ్లలో సుడులు తిరుగుతున్నా, గిర్ధర్‌భాయ్‌ మనసులో తన కొడుకు కోరికను నెరవేర్చాలనే తపన తగ్గలేదు. ‘ఆ రూ.75 లక్షలతో, ముందుగా మహేష్‌ కలగన్నట్టు రూ.15 లక్షల అప్పు తీర్చేశాడు. ఆ తర్వాత, రూ.45 లక్షలతో ఇల్లు కొన్నాడు.. అలా తన కొడుకు కోరికను నెరవేర్చాడు. గిర్ధర్‌భాయ్‌ మీడియాతో చెప్పిన ఈ మాటలు వైరల్ అయ్యాయి. కొత్త ఇంట్లో ఫర్నిచర్‌ కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి, మిగిలిన రూ.5 లక్షలను తన మనవరాలి భవిష్యత్తు కోసం పక్కన పెట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్‌ వన్‌… కాశీ తర్వాత ఇక్కడే…

వావ్‌.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా

నో డిలే.. నో డైవర్షన్‌.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో

ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ.. వైరల్ అవ్వడం కోసం మరీ ఇలా చేస్తావా ??

బరువు తగ్గించే ఇంజెక్షన్‌ ఇండియాకి వచ్చేసిందోచ్‌..